అన్వేషించండి
SBI ATM Charges : ATM లావాదేవీలపై SBI గైడ్లైన్స్.. కస్టమర్లు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిందే
SBI ATM Rules : ATM లావాదేవీలపై SBI గైడ్లైన్స్ గురించి ఎక్కువమందికి తెలియదు. ఉచిత పరిమితి, ఛార్జీలు ఒకేలా వర్తిస్తాయట. మరి ఎంత పరిమితి ఉంది. ఎన్ని డ్రాలు చేస్తే డబ్బులు కట్ అవుతాయో చూద్దాం.
ఎస్బీఐ ఏటీఎంలో డబ్బులు తీస్తే ఎంత ఛార్జ్ పడుతుంది
1/8

ఫిబ్రవరి 1, 2025 నుంచి SBI ATM లావాదేవీలపై కొత్త నిబంధనలు ఇచ్చింది. ఉచిత పరిమితి, ఛార్జీలు ఒకే విధంగా వర్తిస్తాయని తెలిపింది. అవేంటో చూసేద్దాం.
2/8

కొత్త నిబంధనల ప్రకారం.. ప్రతి కస్టమర్‌కు ఇప్పుడు ప్రతి నెలా ఎస్‌బిఐ ఏటీఎంలలో ఐదు ఉచిత లావాదేవీలు, ఇతర బ్యాంక్ ఏటీఎంలలో 10 ఉచిత లావాదేవీలు లభిస్తాయి. అంటే మొత్తం 15 ఉచిత లావాదేవీలు నెల మొత్తం మీద లభిస్తాయి.
3/8

అదేవిధంగా కస్టమర్లు తమ ఖాతాలో 1 లక్ష కంటే ఎక్కువ సగటు బిల్లును కలిగి ఉంటే.. వారికి రెండు రకాల ATMలలో అపరిమిత ఉచిత లావాదేవీలు లభిస్తాయి.
4/8

ఉచిత లావాదేవీ పరిమితిని మించి డబ్బులు విత్‌డ్రా చేస్తే.. SBI ATMలలో 15 రూపాయవు + GST, ఇతర బ్యాంక్ ATMలలో 21 రూపాయాలతో పాటు GST చెల్లించాల్సి ఉంటుంది.
5/8

అంతేకాకుండా ఎస్బీఐ ఏటీఎంలలో బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవడానికి, మినీ స్టేట్‌మెంట్ తీసుకోవడానికి ఎటువంటి ఛార్జీలు ఉండవు. కానీ ఇతర బ్యాంకుల ఏటీఎంలలో ఈ సేవలకు 10 రూపాయలు + జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది.
6/8

అంతేకాకుండా ఖాతాలో తగినంత డబ్బు లేకపోవడం వల్ల ATM లావాదేవీ విఫలమైతే.. SBI 20 రూపాయలు+ GST పెనాల్టీ విధిస్తుంది. ఈ నిబంధన ఇప్పటికే అమలులో ఉంది.
7/8

అయితే మే 1వ తేదీ 2025 నుంచి RBI కూడా ATM ఇంటర్ఛేంజ్ ఫీజును పెంచాలని నిర్ణయించింది. దీని తరువాత ఉచిత పరిమితి దాటిన తర్వాత, కస్టమర్లు ఒక్కో లావాదేవీకి 23 రూపాయలు చెల్లించవలసి ఉంటుంది.
8/8

కాబట్టి కస్టమర్లు ఉచిత పరిమితిని గుర్తుంచుకో లేకపోతే ATMని పదేపదే ఉపయోగించకపోవడం మంచిది. అదే సమయంలో డిజిటల్ బ్యాంకింగ్‌ను ప్రోత్సహించడానికి ఈ మార్పులు చేసినట్లు ఎస్‌బిఐ తెలిపింది.
Published at : 02 Dec 2025 02:03 PM (IST)
వ్యూ మోర్
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















