సాధారణంగా చతుర్థశి మర్నాడు అమావాస్య వస్తుంది. దీపావళి జరుపుకునేందుకు సూర్యాస్తమయం సమయానికి అమావాస్య తిథి ఉండాలి. అంటే ఈ ఏడాది అమావాస్య తిథి అక్టోబరు 31 మధ్యాహ్నం 2:46 నుంచి నవంబరు 1 శుక్రవారం సాయంత్రం 4:47 నిముషాల వరకూ ఉంది. సూర్యాస్తమయం సమయానికి అమావాస్య ఉన్న రోజు అంటే అక్టోబరు 31 గురువారం నాడు దీపావళి జరుపుకోవాలి.
Wish your loved ones a happy Diwali! Share on Whatsapp
FAQs
ఈ ఏడాది దీపావళి ఏ తేదీన వచ్చింది ?
దీపావళి ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారు?
చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా దీపావళి పండుగ జరుపుకుంటారు. పురాణాల ప్రకారం నరకాసురుడు అనే రాక్షసుడిని సత్యభామ, శ్రీకృష్ణుడు అంతమొందించడంతో అందుకు గుర్తుగా దీపాలు వెలిగించి సెలబ్రేట్ చేసుకుంటారు. అదే విధంగా వనవాసానికి వెళ్లిన రాముడు సీతను అపహరించిన రావణుడ్ని సంహరించి తిరిగి అయోధ్యకు సీత, లక్ష్మణుడుతో కలిసి వచ్చినందుకు అయోధ్య ప్రజలు దీపాలు వెలిగించి వేడుక చేసుకున్నారు.
దీపావళి వేడుక ఎన్ని రోజులు చేస్తారు? ఏ రోజు విశిష్టత ఏంటి?
ధన త్రయోదశి నుంచి భాయ్ దూజ్ వరకూ మొత్తం 5 రోజులపాటు దీపావళి వేడుకలు నిర్వహిస్తారు. ఆశ్వయుజ బహుళ త్రయోదశిన తొలి రోజు ధన త్రయోదశి. ధన త్రయోదళి తర్వాత రోజు దీపావళికి ముందు వచ్చే ఆశ్వయుజ బహుళ చతుర్థశి నరక చతుర్థశిగా జరుపుకుంటారు. ఆశ్వయుజ మాసం ఆఖరి రోజు.. కార్తీకమాసం ప్రారంభానికి ముందు రోజు దీపావళి జరుపుకుంటారు. దీపావళి అమావాస్య మర్నాడు వచ్చే పాడ్యమిని బలిపాడ్యమి అంటారు. ఈ రోజు నుంచే కార్తీకమాసం ప్రారంభమవుతుంది. దీపావళి అమావాస్య మర్నాడు బలపాడ్యమి అయితే.. ఆ తర్వాత రోజు యమ విదియ (ఉత్తరాదిన భాయ్ దూజ్ గా) జరుపుకుంటారు. కార్తీకమాసంలో రెండో రోజు వచ్చే ఈ రోజున యముడు స్వయంగా తన సోదరి ఇంటికెళ్లి భోజనం చేసి దీవెనలు అందించాడు. సోదరులు తమ అక్కాచెల్లెళ్ల ఇంటికి వెళ్లి వారి చేతి వంట రుచిచూస్తారు. దీనినే భగనీహస్త భోజనం అని కూడా అంటారు.
దీపావళి పండుగకు లక్ష్మీపూజ ఎప్పుడు, ఏ సమయంలో చేయాలి?
దీపావళి రోజు అక్టోబరు 31న సాయంత్రం లక్ష్మీపూజ చేయడం ద్వారా ఇంట్లో సరిసంపదలు వెల్లివిరుస్తాయని అంతా విశ్వసిస్తారు. ఇంట్లో ఈశాన్యం లేదా ఉత్తర దిశగా ప్రదేశాన్ని శుభ్రంచేసి పీటపై ఎర్రటి వస్త్రం పరిచి ముందుగా గణపతి పూజ, ఆ తర్వాత లక్ష్మీ పూజ చేయాలి.
దీపావళి రోజు క్రాకర్స్ కాల్చే సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
దీపావళి సమయంలో చాలామంది క్రాకర్స్ కాలుస్తారు. దాంతో వాయు కాలుష్యం, శబ్ధ కాలుష్యం తీవ్రంగా ఉంటుంది. పైగా పొగవల్ల దగ్గు వంటి శ్వాస సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. పటాకులు కాల్చే సమయంలో గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారు వాటికి దూరంగా ఉండాలి. పర్యావరణహిత క్రాకర్స్ కాల్చడం మంచిదని కొందరు ఔత్సాహికులు అవగాహన కలిపిస్తున్నారు. దీపాల పండుగ కనుక దీపాలను వెలిగించి ఫ్యామిలీతో ప్రశాంతంగా పండుగ చేసుకోవాలని మరికొందరు సూచిస్తున్నారు.