Diwali Wishes 2025 : దీపావళి శుభాకాంక్షలు 2025.. స్నేహితులు, కుటుంబ సభ్యులకు వాట్సాప్, ఫేస్ బుక్, సోషల్ మీడియా ద్వారా ఇలా చెప్పేయండి
Diwali Wishes 2025 in Telugu : దీపావళికి ఇంట్లోవారికి, కుటుంబ సభ్యులకు స్పెషల్‌గా సోషల్ మీడియా ద్వారా హ్యాపీ దీపావళి అంటూ శుభాకాంక్షలు చెప్పాలనుకుంటే మీరు వీటిని ఫాలో అయిపోవచ్చు.

దీపావళిని దేశవ్యాప్తంగా 2025లో అక్టోబర్ 20వ తేదీన జరుపుకుంటున్నాము. లక్ష్మీ దేవికి పూజ చేసి.. స్వీట్స్ పంచుకుంటూ, దీపావళి శుభాకాంక్షలు చెప్తూ.. స్నేహితులు, కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. సాయంత్రం దీపాలు వెలిగించి.. క్రాకర్స్ కాలుస్తారు. అయితే ఈ పండుగ రోజున ఇంట్లో లేని వారు.. ఇంటికి దూరంగా ఉండేవారు కూడా తమ కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్, కొలిగ్స్కి సోషల్ మీడియా ద్వారా విషెష్ చెప్పవచ్చు. తెలుగులో దీపావళి శుభాకాంక్షలు ఎలా చెప్పవచ్చో.. ఫోటోలకు ఎలాంటి క్యాప్షన్స్ ఇచ్చి షేర్ చేయవచ్చో చూసేద్దాం.
దీపావళి శుభాకాంక్షలు 2025..
- ఈ దీపావళి మీ జీవితంలో వెలుగులు నింపాలని.. మనసులోని చీకట్లు దూరం చేసి.. ప్రకాశవంతంగా మార్చాలని కోరుకుంటూ హ్యాపీ దీపావళి.
- మీకు, మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు. మీరు కూడా దీపావళి వెలుగులతో సంతోషంగా గడపాలని కోరుకుంటున్నాను.
- మీరు ఇంట్లో వెలిగించే ప్రతి దీపం.. మీ జీవితాల్లో ఆనందపు వెలుగులు నింపాలని కోరుకుంటూ దీపావళి శుభాకాంక్షలు.
- ఈ దీపాల పండుగ మీ జీవితంలో ప్రేమ, సంతోషం, ఆరోగ్యం, సంపద తీసుకురావాలి. మీకు, మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు.
- ఇప్పటివరకు మీ జీవితంలో ఉన్న చీకటి తొలగిపోయి.. ఈ దీపాల వెలుగులు మీకు మరో కొత్త జీవితాన్ని ప్రసాదించాలని కోరుకుంటూ హ్యాపీ దీపావళి.
- ఈ దీపావళి మీ జీవితాల్లో సంతోషం, ఆనందం, శ్రేయస్సు అనే వెలుగులు నింపాలని విష్ చేస్తూ హ్యాపీ దీపావళి.
- ఈ దీపాలు అందించే వెలుగులు.. మనసుల్లోని చీకటి చెరిపేసి.. జీవితాన్ని రిఫ్రెష్ చేయాలని కోరుకుంటున్నాను. హ్యాపీ దీపావళి 2025.
- మీ చుట్టూ వెలుగులు ఉండాలి. అవి మీకు శాశ్వతమైన చిరునవ్వును అందించాలి. మీకు, మీ కుటుంబానికి దీపావళి శుభాకాంక్షలు.
- ఈ దీపావళి ఆనందం మీ జీవితంలో ఎప్పటికీ వెలుగుగానే ఉండాలని కోరుకుంటూ దీపావళి శుభాకాంక్షలు.
- గతంలో జరిగిన చెడును చీకటిలో మరచిపోయి.. హృదయంలో వెలుగును నింపే దీపాలు వెలిగించు. హ్యాపీ దీపావళి.
- ఈ దీపావళి నుంచి మీ జీవితం చిచ్చుబుడ్డిలా రంగులు, చిమ్ముతూ ప్రకాశంవతంగా, ఆహ్లాదకరంగా ఉండాలని కోరుకుంటున్నాను.
- ఈ దీపావళి అందరికీ నవ్వులు, వెలుగులు, స్వీట్లు అందిస్తుంది. ఇవన్నీ మీలో ఫుల్ పాజిటివ్ వైబ్స్ ఇవ్వాలని విష్ చేస్తూ హ్యాపీ దీపావళి.
- దీపావళికి తినే స్వీట్స్ కంటే మీ లైఫ్‌లో ఎక్కువ స్వీట్ మెమోరీలు ఉండాలని కోరుకుంటూ దీపావళి శుభాకాంక్షలు.
వీటిని మీరు మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీకి వాట్సావ్, ఫేస్బుక్ వంటి సోషల్ మీడియా ద్వారా షేర్ చేయవచ్చు. అంతేకాకుండా ఫోటోలు షేర్ చేసి వాటికి క్యాప్షన్‌గా వీటిని ఇవ్వవచ్చు. అలాగే మీరు సోషల్ మీడియాలో స్టేటస్ పెట్టుకునేందుకు కూడా ఇవి అనువైనవి. మీ ఫ్యామిలీ గ్రూప్‌లో షేర్ చేసుకోవచ్చు.






















