Diwali 2025 Skincare : దీపావళి తర్వాత చర్మాన్ని కాపాడుకోవడానికి ఫాలో అవ్వాల్సిన టిప్స్.. బెస్ట్ స్కిన్ కేర్ రొటీన్
Post Diwali Skin Detox Tips : దీపావళి తర్వాత చర్మం విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే స్కిన్ మెరుపును కోల్పోకుండా ఉంటుందో.. హెల్తీ స్కిన్ కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో చూసేద్దాం.

Post Diwali Skincare Tips : దీపావళి(Diwali 2025) సమయంలో చాలామంది క్రాకర్స్ కాలుస్తారు. వాటి కాలుష్యం స్కిన్‌పై పడుతుంది. అంతేకాకుండా ఈ సమయంలో స్వీట్స్ కూడా ఎక్కువగా తీసుకుంటారు. నూనెలో వేయించిన ఫుడ్స్ తింటారు. ఇవన్నీ కూడా స్కిన్ హెల్త్‌ని కరాబ్ చేస్తాయి. వీటి వల్ల చర్మం సహజమైన మెరుపును కోల్పోతుంది. అందుకే దీపావళి తర్వాత స్కిన్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? స్కిన్ హెల్తీగా ఉంచడంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం.
స్కిన్ డీటాక్స్
పండుగ సమయంలో గ్లోయింగ్ లుక్ కావాలంటే.. మీరు స్వీట్స్, వేయించిన ఫుడ్స్, అధిక కెఫిన్ ఉండే ఫుడ్స్‌కి దూరంగా ఉండాలి. శరీరాన్ని డిటాక్స్ చేసే గ్రీన్ టీలు, ఇన్ఫ్యూజ్ చేసిన వాటర్, దానిమ్మ, బొప్పాయి వంటి పండ్లు తీసుకోవాలి. యాంటీఆక్సిడెంట్-రిచ్ ఫుడ్స్ టాక్సిన్‌లను బయటకు పంపడానికి హెల్ప్ చేస్తాయి. మంటను తగ్గించి, సహజమైన మెరుపు అందుతుంది. కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది. చర్మాన్ని లోపలి నుంచి హైడ్రేటెడ్‌గా ఉండేందుకు అవిసె గింజలు, చియా సీడ్స్ డైలీ రొటీన్లో చేర్చుకోవచ్చు.
స్కిన్ కేర్
యాంటీఆక్సిడెంట్-రిచ్ లేయరింగ్ రొటీన్ ఫాలో అవ్వండి. మైల్డ్ క్లెన్సర్‌తో స్కిన్ కేర్ ప్రారంభించాలి. అనంతరం విటమిన్ సి సీరం అప్లై చేయాలి. నియాసినమైడ్ ఉన్న మాయిశ్చరైజర్ ఉపయోగించాలి. ఇవి చర్మాన్ని హైడ్రేట్ చేయడంలో హెల్ప్ చేస్తాయి. పండుగ సమయంలో ఇది మీ చర్మాన్ని రక్షించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. సన్‌స్క్రీన్ వృద్ధాప్యాన్ని కలిగించే ఫ్రీ రాడికల్స్‌తో పోరాడి మెరుపును అందిస్తుంది.
DIY ఫ్రూట్ మాస్క్
బొప్పాయి గుజ్జులో తేనె, కొన్ని చుక్కల నిమ్మరసాన్ని కలిపి ముఖానికి అప్లై చేయాలి. 10 నుంచి 15 నిమిషాలు ఉంచి.. అనంతరం చర్మాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇది మృత కణాలను సున్నితంగా ఎక్స్‌ఫోలియేట్ చేసి.. రంధ్రాలను శుభ్రపరుస్తుంది. రక్త ప్రసరణను పెంచుతుంది. చర్మానికి ప్రకాశవంతమైన గ్లో ఇస్తుంది. సెన్సిటివ్ స్కిన్ ఉంటే.. నిమ్మరసానికి బదులుగా కలబంద జెల్‌ను ఉపయోగించవచ్చు.
ఫేషియల్ యోగా
మీ ముఖంపై వాపు లేదా నిర్జీవంగా కనిపిస్తే.. ఉదయాన్నే 10 నిమిషాల ఫేషియల్ యోగా చేయండి. "ఫిష్ ఫేస్," "జా లైన్ స్కల్ప్ట్" మైల్డ్ టాపింగ్ వంటి ఫేస్ యోగా చేస్తే.. ముఖంలో రక్త ప్రసరణను పెరుగుతుంది. ఇది మీ ముఖ కండరాలను టోన్ చేయడమే కాకుండా చర్మ సంరక్షణ ఉత్పత్తులు గ్రహించడంలో హెల్ప్ చేస్తుంది.
స్లీపింగ్ మాస్క్‌లు
నిద్రపోతున్నప్పుడు చర్మం తనను తాను బాగు చేసుకోవడానికి పనిచేస్తుంది. హైలురోనిక్ యాసిడ్, సెరామైడ్స్ లేదా రోజ్ ఎక్స్‌ట్రాక్ట్‌ల వంటి పదార్థాలతో నిండిన హైడ్రేటింగ్ స్లీపింగ్ మాస్క్‌లు రాత్రి అప్లై చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఇది స్కిన్ నిర్జీవంగా మారడాన్ని తగ్గిస్తుంది. మీ చర్మం రిఫ్రెష్‌గా ఉండేందుకు హెల్ప్ చేస్తుంది. అదనపు మెరుపు కోసం వారానికి రెండుసార్లు వీటిని ట్రై చేయవచ్చు.
ఐస్ థెరపీ
మేకప్ వేసుకునే ముందు మీ చర్మానికి ఐస్ థెరపీ సెషన్ ఇస్తే మంచిది. మస్లిన్ క్లాత్‌లో ఐస్ క్యూబ్స్‌ను చుట్టి 2–3 నిమిషాల పాటు మసాజ్ చేయాలి. ఇది వాపును తగ్గిస్తుంది. చర్మాన్ని బిగుతుగా చేస్తుంది. రక్త ప్రవాహాన్ని పెంచుతుంది. స్కిన్ గ్లో ఇస్తుంది. అదనపు హైడ్రేషన్ కోసం కీరదోసకాయ లేదా రోజ్‌వాటర్ క్యూబ్స్‌ను కూడా ఫ్రీజ్ చేయవచ్చు.
మెడ, చేతులకు
చాలా మంది ముఖంపై మాత్రమే దృష్టి పెడతారు. కానీ వృద్ధాప్యం మొదట కనిపించేది మెడ, చేతుల దగ్గరే. అందుకే వాటికి కూడా చర్మ సంరక్షణ తీసుకోవాలి. క్లీన్ చేయడం, ఎక్స్‌ఫోలియేటింగ్, మాయిశ్చరైజింగ్, SPF అప్లై చేయాలి. లోతైన పోషణ కోసం వారానికి ఒకసారి బాదం నూనె లేదా నెయ్యి మసాజ్ చేయాలి. ఇది సమానమైన టోన్ ఇచ్చి మృదువుగా మారేలా చేస్తాయి.
ఈ స్కిన్ కేర్ టిప్స్ పండుగ సమయంలోనే కాదు.. రెగ్యులర్‌గా ఫాలో అయితే మీ స్కిన్ మంచి మెరుపును ఇస్తుంది. అంతేకాకుండా స్కిన్ హెల్తీగా ఉంటుంది. దీనివల్ల మేకప్ వేయకున్నా మీ ఫేస్ తాజాగా కనిపిస్తుంది.






















