అధికంగా శుద్ధి చేసిన చక్కెర తీసుకోవడం మానేయాలి. ఇంట్లో తయారుచేసిన లేదా చక్కెర తక్కువగా ఉండే స్వీట్స్ తీసుకోవచ్చు.
పండుగల సమయంలో ఫుడ్ ఎక్కువగా తీసుకుంటారు కాబట్టి.. శరీరానికి ఎక్కువ నీటిని ఇవ్వాల్సి ఉంటుంది.
కేలరీలను బ్యాలెన్స్ చేసుకోవాలి. అలాగే పండుగ వంటకాలను మితంగా తీసుకుంటే మంచిది.
వేయించిన స్నాక్స్ బదులుగా మోతాదులో నట్స్, సీడ్స్‌తో చేసే వంటలు తీసుకుంటే రుచికి రుచి. ఆరోగ్యానికి ఆరోగ్యం.
పీచు పదార్థాలను శరీరానికి అందించడానికి, ముఖ్యమైన పోషకాల కోసం సీజనల్ పండ్లు, కూరగాయలు తీసుకోవచ్చు.
పండుగల సమయంలో శక్తి చాలా అవసరం. దానికోసం మిల్లెట్, ఓట్స్, బ్రౌన్ రైస్ వంటి తృణధాన్యాలు తీసుకోవచ్చు.
మద్యం తీసుకుంటే అతిగా కాకుండా తక్కువ మోతాదులో తీసుకోవాలి. అధిక కేలరీలు, డీహైడ్రేషన్‌ని తగ్గించడానికి లిమిట్‌గా తీసుకోవాలి. లేదా మానేయాలి.
ప్రోటీన్ కోసం చికెన్, పనీర్, చిక్కుళ్ళు చేర్చుకుంటే మంచిది. వాటిని తింటే ఎక్కువ కాలం కడుపు నిండినట్లుగా అనిపిస్తుంది.
బరువు, జీర్ణక్రియను నిర్వహించడానికి క్విక్ జిమ్, వ్యాయామాలు లేదా డ్యాన్స్ సెషన్లలో పాల్గొంటే మంచిది.
అన్ని తినాలి. కానీ కొంచెం కొంచెం తింటేనే మంచిది. దీనివల్ల మీరు అన్ని రుచులు తెలుసుకుంటారు. పైగా తక్కువ మోతాదులో తీసుకోగలుగుతారు.