ఓట్స్ ఉదయాన్నే తినేందుకు అనువైన ఫుడ్ ఇది. తేలికగా జీర్ణమవుతుంది. ఫైబర్తో నిండిన టేస్టీ ఫుడ్ ఇది. మార్నింగ్ అల్పాహారానికి అనువైనది.
మెత్తగా, కరకరలాడుతూ, కూరగాయలతో నిండిన ఓట్స్ చీలా బెస్ట్, టేస్టీ ఆప్షన్. దీనిలో ప్రోటీన్ అధికంగా ఉంటుంది.
మెంతులు ఆకులను, ఓట్స్ కలిపి పేస్ట్‌గా చేసి.. పరాఠాలుగా చేసుకోవచ్చు. ఇది పోషకమైనది. రుచికరమైనది. ఆరోగ్యకరమైన అల్పాహారం కోసం అనువైనది.
మెత్తగా దూదిలా ఆవిరిలో ఉడికించిన ఓట్స్ ఇడ్లీలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది తేలికైన ఆహారం.
ఓట్స్ ఉప్మా కూరగాయలతో చేస్తే టేస్టీగా ఉంటుంది. ఇది రుచికరమైనది. గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
బయట బంగారు వర్ణంలో.. లోపల మెత్తగా ఉండే ఓట్స్ వెజిటబుల్ ఉత్తప్పం ఓట్స్ తీసుకునేందుకు పోషకమైన, రుచికరమైన మార్గం.
ఓట్స్, పెసరపప్పుతో చేసుకునే ఈ క్రంచీ టోస్ట్ రుచిలోనూ, ప్రోటీన్‌ను పుష్కలంగా ఉంటుంది. ఇది ఉదయాన్నే మీకు ఎనర్జీ ఇస్తుంది.
పనీర్, కూరగాయలతో నిండిన ఓట్స్ శాండ్విచ్.. రుచికరమైన, మృదువైన రుచిని ఇస్తుంది. ఇది ఎక్కువసేపు కడుపు నిండుగా ఉంచుతుంది.
ఓట్స్ చాట్ కూడా హెల్తీ ఆప్షనే. ఇది ఒక రిఫ్రెషింగ్ బౌల్ ఫీలింగ్ ఇస్తుంది. క్రంచీ, స్పైసీ, ఆరోగ్యాన్ని మిళితం చేస్తుంది.