ఉదయం తీసుకునే ఫుడ్ మంచిదై ఉండాలి. మీరు తీసుకునే ఫుడ్ రోజంతా మీరు యాక్టివ్ ఉండేలా చేస్తుంది. శరీర పనితీరుకు మద్దతు ఇస్తుంది.
ఖాళీ కడుపుతో తిన్నప్పుడు ఏ ఆహారాలు మీ కడుపుకు హాని చేస్తాయో తెలుసుకోవడం ముఖ్యం. అందుకే తినకూడని ఫుడ్స్ ఏంటో చూసేద్దాం.
టీ, కాఫీలలోని కెఫిన్ మీ జీర్ణవ్యవస్థను అధికంగా ఉత్తేజితం చేస్తుంది. ఇది అలసట, ఎసిడిటీ, చిరాకు తెప్పిస్తుంది.
నారింజ, నిమ్మ, ద్రాక్షపండు వంటి సిట్రస్ ఫ్రూట్లు కూడా కాస్త చిరాకు రప్పిస్తాయి. ఎసిడిటీకి కారణం అవుతాయి. మలబద్ధకానికి దారితీయవచ్చు.
పెరుగులో ఉండే లాక్టిక్ ఆమ్లం ఖాళీ కడుపుతో తీసుకుంటే జీర్ణక్రియకు ఆటంకం కలిగిస్తుంది. ఎసిడిటీని పెంచుతుంది.
నూనెలో వేయించిన లేదా మసాలాతో కూడిన ఫుడ్స్ గుండెల్లో మంట, ఉబ్బరం, పగటిపూట భారంగా అనిపించేలా చేస్తాయి.
ఉదయాన్నే కూల్ డ్రింక్స్ ఎసిడిటీని పెంచుతాయి. జీర్ణక్రియకు ఆటంకం కలిగిస్తాయి. ఇది వాటిని ఉదయం తీసుకోవడానికి మంచిది కాదు.
అధిక చక్కెర కలిగిన ఆహారాలు,కేక్స్ రక్తంలో చక్కెర స్థాయిలను త్వరగా పెంచుతాయి. ఆ తర్వాత మీరు అలసిపోయి నీరసంగా ఉంటారు.
ఖాళీ కడుపును చికాకు పెట్టే, పోషకాలు లేని ప్రాసెస్ ఫుడ్ తీసుకోకూడదని చెప్తారు.