అన్వేషించండి

Telangana Inter Results 2025 : తెలంగాణ ఇంటర్ ఫలితాలు 2025 ఎప్పుడంటే?

Telangana Inter Results 2025 :తెలంగాణ ఇంటర్మీడియెట్ ఫలితాలు విడుదలకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. పది రోజుల్లో ఫలితాలు విడుదలకానున్నాయి.

Telangana Inter Results 2025 : ఆంధ్రప్రదేశ్‌ ఇంటర్మీడియెట్ ఫలితాలు శనివారం ఉదయం 11 గంటలకు విడుదల చేయనుంది ఏపీ ఇంటర్ బోర్డు. అదే టైంలో పరీక్షలు అయిన తెలంగాణలో ఫలితాలు ఎప్పుడు విడుదల చేస్తారనే చర్చ సాగుతోంది. అయితే ఇంటర్ బోర్డు అధికారులు ఇచ్చిన సమాచారం మేరకు ప్రక్రియ పూర్తి అయినట్టు తెలుస్తోంది. పది రోజుల్లో ఫలితాలు విడుదల చేయనున్నామని చెబుతున్నారు. 

తెలంగాణ ఇంటర్ పరీక్ష పత్రాల మూల్యాంకం ఇప్పటికే పూర్తి అయింది. ఆ మార్కులను డిజిటలైజ్ చేస్తున్నారు. విద్యార్థుల మార్క్‌లిస్ట్‌లు రెడీ చేస్తున్నారు. ఈ ప్రక్రియ కూడా దాదాపు పూర్తి అయింది. విద్యాశాఖ మంత్రి సమయం ఇచ్చినదాని బట్టి వచ్చే వారం విడుదల చేయడానికి ఇంటర్ బోర్డు అధికారులు సిద్ధమవుతున్నారు. లేకుంటే మరో రెండు మూడు రోజులు అటు ఇటుగా ఫలితాలు విడుదల చేయనున్నారు. 

2024 మినహా ఎప్పుడు కూడా తెలంగాణలో ఇంటర్ ఫలితాలు ఏప్రిల్‌లో విడుదల చేసింది లేదు. గతేడాది ప్రభుత్వంతో సంబంధం లేకుండా అధికారులే నేరుగా విడుదల చేశారు. ఎన్నికలు ఉన్నందున అధికారులు ఫలితాలు రిలీజ్ చేశారు. ఇప్పుడు దీనికి ప్రభుత్వ అనుమతి అవసరం ఉంది. దాని కోసం అధికారులు ఎదురు చూస్తున్నారు. 

ఏ సంవత్సరంలో ఎప్పుడు ఇంటర్‌ ఫలితాలు విడుదలయ్యాయో పరిశీలిస్తే... 2021లో జూన్ 28, 2022 జూన్ 28, 2023మే9, 2024 ఏప్రిల్‌ 24న ఫలితాలు విడుదల చేశారు. ఇప్పుడు ఏప్రిల్‌లో ఫలితాలు విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నారు. గత ఏడాది కంటే ఒకట్రెండు రోజులు ముందుగానే రిజల్ట్స్‌ విడుదల చేయనున్నారు. 

తెలంగాణ ఇంటర్ బోర్డు పరీక్షలు మార్చి 5 ప్రారంభమై మార్చి 25తో ముగిశాయి. వెంటనే మూల్యాంకనం కూడా పూర్తి చేశారు. ఈ ఫలితాల కోసం https://tgbie.cgg.gov.in/ వెబ్‌సైట్‌లో చూడొచ్చు. ఏబీపీ దేశం కూడా ఫలితాలు వెబ్‌సైట్‌లో పెట్టనుంది.  

ఈ సంవత్సరం ఎంత మంది పరీక్షలు రాశారు
ఈ ఏడాది రెండు సంవత్సరాల విద్యార్థులు మొత్తం 9,96,971 మంది పరీక్షలు రాశారు. వీరిలో 4,80,415 మంది మొదటి సంవత్సరం విద్యార్థులు కాగా... 4,44,697 మంది రెండో సంవత్సరం చదివిన వాళ్లు. 

గతేడాది ఫలితాలు చూస్తే... 
2024సంవత్సరంలో ఇంటర్ ఫలితాలును ఏప్రిల్ 24వ తేదీని విడుదల చేశారు. 64.19 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. ఇందులో బాలికలు 72.53శాతం ఉంటే బాలురు 56.1 శాతం మంది పాస్ అయ్యారు. రెండో సంవత్సర ఉత్తీర్ణత శాతంలో 82.95 శాతం ఉత్తీర్ణతతో ములుగు టాప్‌లో నిలిచింది. 44.29 శాతంతో కామారెడ్డి ఆఖరి స్థానంలో ఉంది. 
మొదటి సంవత్సరం 60.01 శాతం మంది పాస్ అయ్యారు. ఇందులో ఇందులో బాలికలు 68.35 శాతం ఉంటే బాలురు 51.5 శాతం మంది పాస్ అయ్యారు. టాప్‌లో రంగారెడ్డి జిల్లా 71.7 శాతంతో టాప్‌లో ఉంటే కామారెడ్డి జిల్లా ఉత్తీర్ణతలో 34.81 శాతంతో ఆఖరి స్థానంలో నిలిచింది. 

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: భయపడొద్దు, పెట్టుబడులు పెట్టండి- 2034 నాటికి ట్రిలియన్ డాలర్ ఎకానమీ: సీఎం రేవంత్ రెడ్డి
భయపడొద్దు, పెట్టుబడులు పెట్టండి- 2034 నాటికి ట్రిలియన్ డాలర్ ఎకానమీ: సీఎం రేవంత్ రెడ్డి
Congress Public Meeting: ఈ 24న హైదరాబాద్‌లో కాంగ్రెస్ భారీ బహిరంగ సభ.. ఇండీ కూటమి టార్గెట్ ఏంటీ?
ఈ 24న హైదరాబాద్‌లో కాంగ్రెస్ భారీ బహిరంగ సభ.. ఇండీ కూటమి టార్గెట్ ఏంటీ?
Villa Orchids Security Failure: కౌకూర్ విల్లా ఆర్కిడ్స్ దారుణం - 5 ఏళ్ల అరేలియా హత్య - గేటెడ్ కమ్యూనిటీల భద్రత ఎంత?
కౌకూర్ విల్లా ఆర్కిడ్స్ దారుణం - 5 ఏళ్ల అరేలియా హత్య - గేటెడ్ కమ్యూనిటీల భద్రత ఎంత?
Dalit Denied Entry to Temple: గుడిలోకి వెళ్లకుండా దళితుడ్ని అడ్డుకున్న ఎమ్మెల్యే బంధువు.. వనపర్తిలో దుమారం
గుడిలోకి వెళ్లకుండా దళితుడ్ని అడ్డుకున్న ఎమ్మెల్యే బంధువు.. వనపర్తిలో దుమారం

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jailer 2 Review - 'జైలర్ 2' రివ్యూ: 600 కోట్లు సినిమాకు సీక్వెల్... రజనీ మళ్ళీ బ్లాక్ బస్టర్ కొట్టారా?
'జైలర్ 2' రివ్యూ: 600 కోట్లు సినిమాకు సీక్వెల్... రజనీ మళ్ళీ బ్లాక్ బస్టర్ కొట్టారా?
Actor Imran Khan Leave India Notice : అమెరికా సిటిజన్ అయి ఉండి కాక్రోచ్ నిరసనల్లో పాల్గొంటారా - అమీర్ ఖాన్ మేనల్లుడికి భారత్‌ను వీడాలని నోటీసులు!
అమెరికా సిటిజన్ అయి ఉండి కాక్రోచ్ నిరసనల్లో పాల్గొంటారా - అమీర్ ఖాన్ మేనల్లుడికి భారత్‌ను వీడాలని నోటీసులు!
Today OTT Movies : గురువారం ఓటీటీ మూవీస్ - ఒక్క రోజే 11 సినిమాలు స్ట్రీమింగ్... ఇవి అస్సలు మిస్ కావొద్దు
గురువారం ఓటీటీ మూవీస్ - ఒక్క రోజే 11 సినిమాలు స్ట్రీమింగ్... ఇవి అస్సలు మిస్ కావొద్దు
IAS Vikrant Marmat Transfer: బెంగళూరు పబ్ ఘటనపై ఏపీ ప్రభుత్వం సీరియస్.. ఐఏఎస్ అధికారి విక్రాంత్ మర్మత్‌పై బదిలీ వేటు!
బెంగళూరు పబ్ ఘటనపై ఏపీ ప్రభుత్వం సీరియస్.. ఐఏఎస్ అధికారి విక్రాంత్ మర్మత్‌పై బదిలీ వేటు!
AP Local Body Elections : స్థానిక పోరులో బలమైన వ్యూహం - సీట్ల కేటాయింపుతో ఆగని టీడీపీ-జనసేన రగడ.. ఓటు బదిలీ సాధ్యమేనా?
స్థానిక పోరులో బలమైన వ్యూహం - సీట్ల కేటాయింపుతో ఆగని టీడీపీ-జనసేన రగడ.. ఓటు బదిలీ సాధ్యమేనా?
Chandrababu Vijay River Interlinking: చంద్రబాబు - విజయ్ భేటీలో అసలు మ్యాటర్ - గోదావరి-కావేరి అనుసంధానం సాధ్యమేనా?
చంద్రబాబు - విజయ్ భేటీలో అసలు మ్యాటర్ - గోదావరి-కావేరి అనుసంధానం సాధ్యమేనా?
Sesame Seeds Benefits : నువ్వులు తింటే చర్మం మెరుస్తుందా? జుట్టు బలంగా పెరుగుతుందా? నిజాలు ఇవే
నువ్వులు తింటే చర్మం మెరుస్తుందా? జుట్టు బలంగా పెరుగుతుందా? నిజాలు ఇవే
High Court On Tuni Missing Case: చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు.. డీజీపీకి హైకోర్టు కీలక ఆదేశాలు
చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు.. డీజీపీకి హైకోర్టు కీలక ఆదేశాలు
Embed widget