అన్వేషించండి

Gorantla Madhav : గోరంట్ల మాధవ్‌కు ముసుగేసి మీడియా ముందు నిలబెట్టారు - పోలీసులతో వాగ్వాదానికి దిగిన మాజీ ఎంపీ

Guntur Police: గోరంట్ల మాధవ్ ను ముసుగేసి మీడియా ముందు నిలబెట్టారు పోలీసులు. అంతకు ముందు అలా నిలబడేందుకు అంగీకరించకుండా పోలీసులతో వాగ్వాదానికి దిగారు.

Gorantla Madhav Case: పోలీసుల అదుపులో ఉన్న నిందితుడిపై దాడికి పాల్పడుతూ, పోలీసులపై జులుం ప్రదర్శించి వారి విధులకు ఆటంకం కలిగించిన గోరంట్ల.మాధవ్ తో పాటు ఆయన ఐదుగురు అనుచరులను అరెస్ట్ చేశామని గుంటూరు ఎస్పీ సతీష్ కుమార్ ప్రకటించారు.  వైఎస్ జగన్మోహన్ రెడ్డి సతీమణి వైఎస్  భారతిపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసిన చేబ్రోలు కిరణ్ అనే నిందితుడిని అరెస్టు చేసి గుంటూరుకు తరలిస్తుండగా తన అనుచరులతో పోలీస్ వాహనాన్ని అనుసరించారు గోరంట్ల మాధవ్. కారు ఆపి మరీ పోలీస్ కస్టడీలో ఉన్న నిందితుడిపై గోరంట్ల మాధవ్ దాడికి పాల్పడ్డారని ఎస్పీ తెలిపారు. 

మంగళగిరి రూరల్ పోలీసులు గోరంట్ల  మాధవ్,  అతని అనుచరుల బారి నుండి నిందితుడిని రక్షించి గుంటూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయానికి తీసుకొస్తుండగా మరలా గోరంట్ల మాధ వ్అతని అనుచరులు  పోలీస్ వాహనాన్నితమ వాహనాలతో వెంబడిస్తూ నిందితుడిని , పోలీసులను  భయబ్రాంతులకు గురి చేశారని ఎస్పీ తెలిపారు. పోలీస్ కస్టడీలో ఉన్న నిందితుడిపై దాడికి పాల్పడటం, పోలీస్ విధులకు ఆటంకం కలిగించడాన్ని తీవ్రంగా పరిగణించి భవిష్యత్తులో ఎవరూ కూడా ఇటువంటి నేరపూరిత చర్యలకు పాల్పడకుండా ఉండాలని గోరంట్ల.మాధవ్ మరియు అతని అనుచరులపై కేసు నమోదు చేసి, అరెస్ట్ చేశామని తెలిపారు.                                   

శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా చట్ట వ్యతిరేక బృందాన్ని పోగుచేయడం. ఆంధ్రప్రదేశ్ ఐటీ,  విద్యా శాఖ మంత్రి  గురించి అసభ్యకరంగా  , వ్యక్తిగత దూషణలకు పాల్పడటం వంటి పలు ఘటనలకు సంబంధించి గోరంట్ల మాధవ్ పై కేసులు నమోదై ఉన్నాయన్నారు.  అలాగే ఒక పోక్సో కేసుతో పాటు 04 ఇతర కేసులు కూడా నమోదయ్యాయని ఎస్పీ తెలిపారు.                

గోరంట్ల మాధవ్ మాజీ సీఐ . ఎంతో మంది నిందితుల్ని, నేరస్తుల్ని అలా మీడియా ముందు నిలబెట్టి ఉంటారు..ఇప్పుడు ఆయనే అలా నిలబడాల్సి వచ్చింది. మీడియా ముందు ఆయనను ప్రవేశ పెట్టేందుకు తీసుకు వచ్చే సమయంలో.. ఆయన పోలీసులతో వాగ్వాదానికి దిగారు. తాము మాజీ పోలీసు అధికారినని..మాజీ ఎంపీనని.. మీడియా ముందు ఎలా నిలబెడతారని ఆయన పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అయితే పోలీసుల కస్టడీలో ఉన్న ఆయనకు ముసుగేసి మీడియా ముందు ప్రవేశ పెట్టి.. ఆ తర్వాత కోర్టుకు తరలించారు.      

మాజీ ఎంపీగా ఉన్న ఆయన దుందుడుకుగా మాట్లాడుతూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూంటారు. మామూలుగా అయితే  ఆయన అరెస్టు అయ్యే వారు కాదు. అరెస్టు చేస్తారని తెలిసి కూడా ఆయన పోలీసుల కస్టడీలో ఉన్న నిందితుడ్ని పోలీసులపై దౌర్జన్యం చేసి మరీ దాడి చేసే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఆయనను అడ్డుకోవడానికి ఓ పోలీసు అధికారి చెంప చెళ్లుమనిపించారని చెబుతున్నారు. ఇప్పుడు గోరంట్ల మాధవ్ .. జైల్లో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.

టాప్ హెడ్ లైన్స్

Telangana SIR Andhra Votes: హైదరాబాద్‌లో ఆంధ్రోళ్ల ఓట్లు ఏమయ్యాయి..? తెలంగాణ SIRలో వెలుగులోకి వచ్చిన కీలక లెక్కలు
ఈసారి ఆంధ్రోళ్లు తెలంగాణలో ఓట్లేయరా? హైదరాబాద్ మెట్రోలో పోయిన 43లక్షల ఓట్లు ఎవరివి SIR..?
ED Raids On YSRCP MP Avinash Reddy: వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
YS Jagan Local Body Elections Strategy 2026: గెలుపోటములు కాదు.. పోటీ ముఖ్యం - లోకల్ పోల్స్‌లో క్యాడర్‌కు జగన్ సందేశం - అసలు ప్లానేంటి?
గెలుపోటములు కాదు.. పోటీ ముఖ్యం - లోకల్ పోల్స్‌లో క్యాడర్‌కు జగన్ సందేశం - అసలు ప్లానేంటి?
AP Municipal Elections: మేయర్లు, ఛైర్మన్ల నేరుగా ఎన్నిక - ఏపీ మున్సిపల్ పోరులో బిగ్ ట్విస్ట్! కూటమి పాలనకు ఇది తొలి లిట్మస్ టెస్ట్ !
మేయర్లు, ఛైర్మన్ల నేరుగా ఎన్నిక - ఏపీ మున్సిపల్ పోరులో బిగ్ ట్విస్ట్! కూటమి పాలనకు ఇది తొలి లిట్మస్ టెస్ట్ !

వీడియోలు

Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం
Konda Susmitha Comments Effect | పార్టీలో విభేదాలు పైకి చెప్పొద్దా..?
Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Comments on Voters: ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
ED Raids On YSRCP MP Avinash Reddy: వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
SIM Limit India: సిమ్ కార్డులపై ఆగస్టు 24 నుంచి కొత్త రూల్స్ అమలు! ఇకపై ఒక వ్యక్తి ఎన్ని తీసుకోవచ్చు? నకిలీలను ఎలా గుర్తించాలి?
సిమ్ కార్డులపై ఆగస్టు 24 నుంచి కొత్త రూల్స్ అమలు! ఇకపై ఒక వ్యక్తి ఎన్ని తీసుకోవచ్చు? నకిలీలను ఎలా గుర్తించాలి?
Defected MLAs Congress Status: బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ లో చేరి తప్పు చేశామా? ఫిరాయింపు ఎమ్మెల్యేల తీవ్ర నైరాశ్యం.. పార్టీ మారిన గులాబీ నేతల భవిష్యత్తు ఏమవుతుంది?
బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ లో చేరి తప్పు చేశామా? ఫిరాయింపు ఎమ్మెల్యేల తీవ్ర నైరాశ్యం.. పార్టీ మారిన గులాబీ నేతల భవిష్యత్తు ఏమవుతుంది?
Brahmanandam : బ్రహ్మానందంపై అన్నయ్య ప్రశంసలు - హాస్య బ్రహ్మ రియాక్ట్ అయ్యారా?... వైరల్ వీడియోలో నిజం ఏంటంటే!
బ్రహ్మానందంపై అన్నయ్య ప్రశంసలు - హాస్య బ్రహ్మ రియాక్ట్ అయ్యారా?... వైరల్ వీడియోలో నిజం ఏంటంటే!
Telangana SIR Andhra Votes: హైదరాబాద్‌లో ఆంధ్రోళ్ల ఓట్లు ఏమయ్యాయి..? తెలంగాణ SIRలో వెలుగులోకి వచ్చిన కీలక లెక్కలు
ఈసారి ఆంధ్రోళ్లు తెలంగాణలో ఓట్లేయరా? హైదరాబాద్ మెట్రోలో పోయిన 43లక్షల ఓట్లు ఎవరివి SIR..?
మారుతి ఆల్టో K10 vs మారుతి ఎస్-ప్రెస్సో.. మీ బడ్జెట్‌కు, డైలీ డ్రైవింగ్‌కు ఏ కారు బెస్ట్‌?
మారుతి ఆల్టో K10 vs మారుతి ఎస్-ప్రెస్సో... రూ.3.50 లక్షల బడ్జెట్‌లో ఏ కారు బెస్ట్?
Friday OTT Movies : శుక్రవారం ఓటీటీ బ్లాక్ బస్టర్స్ - ఒకే రోజు 13 సినిమాలు... ఇవి మిస్ కావొద్దు
శుక్రవారం ఓటీటీ బ్లాక్ బస్టర్స్ - ఒకే రోజు 13 సినిమాలు... ఇవి మిస్ కావొద్దు
Embed widget