చాలా మంది సెటిలర్స్ తమ ఓటు హక్కును స్వస్థలాల్లోనే కొనసాగించాలని నిర్ణయించుకున్నారు. అలాగే, కొన్ని ఓట్లకు సంబంధించిన పత్రాలు సరిపోలకపోవడం కూడా ఒక కారణం.
Telangana SIR Andhra Votes: హైదరాబాద్‌లో ఆంధ్రోళ్ల ఓట్లు ఏమయ్యాయి..? తెలంగాణ SIRలో వెలుగులోకి వచ్చిన కీలక లెక్కలు
ఈసారి ఆంధ్రోళ్లు హైదరాబాద్‌లో ఓట్లేయరా..? హైదరాబాద్‌లో మాయం అయిన ఓట్లలో ఎక్కువశాతం ఆంధ్రావాలాలవేనా..? తెలంగాణ ప్రత్యేక ఓటరు సవరణ SIR చెబుతున్న షాకింగ్ నిజాలు ఏంటి..? ఈ కథనంలో చూద్దాం..

- ఈ మార్పులు హైదరాబాద్ రాజకీయ సమీకరణాలపై గణనీయ ప్రభావం చూపుతాయి.
Andhra Voters in Hyderabad: ఆంధ్రా సెటిలర్స్ ఈసారి హైదరాబాద్‌లో ఓట్లేయడం లేదా.. అన్న విషయం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. తెలంగాణ SIR తర్వాత భారీగా ఓట్లు ASDD కేటగిరీలోకి వెళ్లడం, మరికొన్ని లక్షల ఓట్లు Withheldలో ఉండటం హైదరాబాద్ రాజకీయాలపై కొత్త చర్చకు తెరతీసింది. సెటిలర్స్ ప్రభావం ఉన్న నియోజకవర్గాల్లో ఓట్ల తగ్గుదల ఆసక్తికరంగా మారింది.
తెలంగాణ ఎన్నికలు అనగానే ప్రత్యేకంగా చర్చకు వచ్చే అంశాల్లో ఆంధ్రా సెటిలర్స్ ఓట్లు ఒకటి. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఆంధ్రా ఓటర్లు ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసే కీలక వర్గంగా చాలాకాలంగా చర్చలో ఉంటున్నారు. కోర్ అర్బన్ ప్రాంతంలోని 28 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కనీసం 15 నియోజకవర్గాల్లో వీరి ప్రభావం గణనీయంగా ఉందనే అంచనాలు ఉన్నాయి.
ప్రతి ఎన్నికల సమయంలో ఆంధ్రా సెటిలర్స్ ఓట్లు ఏ వైపు మొగ్గుతాయి? ఏ పార్టీకి లాభం చేకూరుతుంది? అనే చర్చ జరుగుతూనే ఉంటుంది. అయితే ఈసారి పరిస్థితి కొంత భిన్నంగా కనిపిస్తోంది.
తెలంగాణలో జరుగుతున్న ప్రత్యేక ఓటరు సవరణ ప్రక్రియ — Special Intensive Revision (SIR) —లో భారీ సంఖ్యలో ఓట్లు జాబితా నుంచి తొలగించడం మరికొన్ని ఓట్లను పెండింగ్‌లో ఉంచడం ఇప్పుడు కొత్త రాజకీయ చర్చకు దారితీస్తోంది.
తెలంగాణలో 73 లక్షల ఓట్లు తొలగింపు
తెలంగాణలో ఎన్నికల సంఘం ప్రత్యేక ఓటరు సవరణ అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR ఓ షాకింగ్ విషయాన్ని బయటపెట్టింది.
SIR ముసాయిదా ప్రకటనలో ఏకంగా తెలంగాణలో ఇప్పటికే 73లక్షల ఓట్లను తొలగించారు. వీళ్లను ASDD (Abesent, Shift, Delete, Duplicate) లో పెట్టారు. అంటే గైర్హాజరు, వేరే ప్రాంతానికి మారిన వారు, తొలగించబడిన లేదా డూప్లికేట్ ఓటర్లుగా గుర్తించిన వారి ఓట్లు ఈ కేటగిరీలోకి వెళ్లాయి. అంటే.. మళ్లీ అప్లై చేసుకుంటే తప్ప ఈ ఓట్లు లేనట్లే.
జూన్ నాటికి తెలంగాణలో మొత్తం 3 కోట్ల 38 లక్షల 26 వేల మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 73 లక్షల ఓట్లు పోయాయంటే.. మొత్తం ఓటర్లలో దాదాపు 22 శాతం ఓట్లు జాబితా నుంచి బయటకు వెళ్లినట్టవుతుంది.
మరో 92.87 లక్షల ఓట్లు కూడా పెండింగ్‌లోనే
SIR తర్వాత తెలంగాణ ఓటర్ల జాబితాలో 2,64,87,213 ఓట్లు మిగిలాయి. అయితే ఈ ఓట్లన్నీ పూర్తిగా ధృవీకరించినవని చెప్పలేమని ఎన్నికల అధికారులు పేర్కొంటున్నారు. మరో 92,87,577 ఓట్లను Withheld కేటగిరీలో ఉంచారు. ఈ ఓట్లకు సంబంధించి మ్యాపింగ్‌లో తేడాలు, సమర్పించిన పత్రాలు 2002 SIR రికార్డులతో సరిపోకపోవడం వంటి కారణాలతో వాలిడేషన్ పూర్తికాలేదని చెబుతున్నారు.
అంటే తెలంగాణలో తొలగించబడిన 73 లక్షల ఓట్లతో పాటు మరో దాదాపు 93 లక్షల ఓట్లు కూడా ప్రస్తుతం తుది స్థితిలో లేవు.
తొలగించిన, పెండింగ్‌లో ఉంచిన ఓట్లను కలిపితే ఈ సంఖ్య దాదాపు 1.66 కోట్లు.
అంటే తెలంగాణ మొత్తం ఓటర్లలో దాదాపు సగం ఓట్లు ఏదో ఒక రకంగా SIR ప్రభావానికి లోనైనట్టుగా కనిపిస్తోంది.
అసలు షాకింగ్ మూడు జిల్లాల్లోనే
ఇక్కడే అసలు కీలకమైన విషయం బయటకు వస్తోంది. తెలంగాణలో ASDD కేటగిరీలోకి వెళ్లిన 73 లక్షల ఓట్లలో 43 లక్షల ఓట్లు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లాల పరిధిలోనే ఉన్నాయని లెక్కలు సూచిస్తున్నాయి. అంటే తెలంగాణలోని 33 జిల్లాల్లో తొలగించబడిన ఓట్లలో దాదాపు 60 శాతం ఈ మూడు జిల్లాల్లోనే ఉన్నాయి. ఇదే సమయంలో ఈ మూడు జిల్లాల్లో మరో 39 లక్షల ఓట్లు అభ్యంతరాలు, మ్యాపింగ్ లేదా ఇతర ధృవీకరణ సమస్యల కారణంగా పెండింగ్‌లో ఉన్నట్లు చెబుతున్నారు. అంటే తొలగించబడిన లేదా ఇంకా పూర్తిగా ఆమోదించబడని ఓట్లలో దాదాపు 83 లక్షలు కేవలం ఈ మూడు జిల్లాల పరిధిలోనే ఉన్నాయి.

హైదరాబాద్‌లో ఆంధ్రా సెటిలర్స్ ఓట్లు ఎక్కడ?
ఇక్కడి నుంచే SIR కేవలం ఓటర్ల లెక్కలకు సంబంధించిన అంశమేనా? లేక హైదరాబాద్ రాజకీయ సమీకరణాలపై కూడా ప్రభావం చూపుతుందా? అనే ప్రశ్న మొదలవుతోంది. హైదరాబాద్ మెట్రోపాలిటన్ ప్రాంతంలో ఇందులో 43 లక్షల ఓట్లు ASDD కేటగిరీలోకి వెళ్లినట్లు లెక్కలు చెబుతున్నాయి. అంటే మెట్రోపాలిటన్ ప్రాంతంలోని దాదాపు 37 శాతం ఓట్లు ప్రభావితమయ్యాయి. తెలంగాణలో నమోదైన ప్రతి 100 Uncollectable ఓట్లలో దాదాపు 59 ఓట్లు హైదరాబాద్ మెట్రో ప్రాంతం నుంచే ఉన్నట్లు కనిపిస్తోంది.
అయితే ఈ 43 లక్షల ఓట్లన్నీ ఆంధ్రా సెటిలర్స్‌వే అని చెప్పడానికి ఆధారం లేదు.
హైదరాబాద్ ఒక మెట్రో నగరం కావడంతో తెలంగాణలోని ఇతర జిల్లాల నుంచి, అలాగే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడిన ప్రజలు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారు.
అయితే ఆంధ్రా సెటిలర్స్ ప్రభావం ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో ఈ మార్పులు రాజకీయంగా ఆసక్తికరంగా మారాయి.
28 నియోజకవర్గాల్లో 15 చోట్ల సెటిలర్స్ ప్రభావం
మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లాలోని కుత్బుల్లాపూర్, కూకట్‌పల్లి, మల్కాజ్‌గిరి నియోజకవర్గాల్లో ఆంధ్రా సెటిలర్స్ ప్రభావం ఎక్కువగా ఉందనే చర్చ ఉంది. రంగారెడ్డి, హైదరాబాద్ పరిధిలోని శేరిలింగంపల్లి, పటాన్‌చెరు, జూబ్లీహిల్స్, సనత్‌నగర్, ఖైరతాబాద్, రాజేంద్రనగర్, ఎల్‌బీనగర్ వంటి నియోజకవర్గాల్లో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తుంది.
మొత్తంగా కోర్ అర్బన్ ప్రాంతంలోని 28 నియోజకవర్గాల్లో దాదాపు 15 చోట్ల ఆంధ్రా సెటిలర్స్ ప్రభావం స్పష్టంగా ఉంటుందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
ఇక కొన్ని నియోజకవర్గాల్లో Enumeration Forms తిరిగి ఇవ్వని వారి శాతం కూడా గమనించదగ్గ స్థాయిలో ఉంది.
సనత్‌నగర్‌లో 45 శాతం, జూబ్లీహిల్స్‌లో 45 శాతం, ముషీరాబాద్‌లో 43 శాతం, ఎల్‌బీనగర్‌లో 44 శాతం ఫారాలు తిరిగి ఇవ్వలేదని లెక్కలు చెబుతున్నాయి. అయితే వీరంతా ఆంధ్రా సెటిలర్స్ అని చెప్పలేం కానీ.. ఈ నియోజకవర్గాల పరిధిలో ఆంధ్రా ప్రజలు ఎక్కువుగా ఉంటున్నారన్నది నిజం. వాళ్లలో మెజారిటీ ఆంధ్రా ప్రాంతంలోనే ఓటుహక్కును కొనసాగించుకున్నారు. ఈ విషయం BLOలు క్షేత్రస్థాయి పర్యటనలకు వెళ్లినప్పుడు కూడా తెలిసింది. చాలా కాలనీల్లో " మేం మా ఊళ్లలోనే ఓటును కొనసాగించుకుంటాం" అని చెప్పారు.

ఏ నియోజకవర్గాల్లో ఎక్కువ ఓట్లు తగ్గాయి?
నియోజకవర్గాల వారీగా చూస్తే కొన్ని ప్రాంతాల్లో ఓట్ల తగ్గుదల గణనీయంగా కనిపిస్తోంది. శేరిలింగంపల్లిలో 3.2 లక్షలకు పైగా ఓట్లు తగ్గాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అత్యధికంగా, దాదాపు 42 శాతం ఓట్లు తగ్గిన నియోజకవర్గంగా ఇది నిలిచింది. ఆ తర్వాత ఎల్‌బీనగర్‌లో 2.7 లక్షలు, రాజేంద్రనగర్‌లో 2.4 లక్షలు, మహేశ్వరంలో 2.3 లక్షల ఓట్లు తగ్గినట్లు లెక్కలు చెబుతున్నాయి.
అయితే ఒక నియోజకవర్గంలో ఎన్ని ఓట్లు తగ్గాయి అన్నది మాత్రమే రాజకీయంగా ముఖ్యం కాదు. ఎవరి ఓట్లు తగ్గాయి? అన్నదే అసలు ప్రశ్న. ఎందుకంటే ఓటర్ల సంఖ్య తగ్గడం ప్రతి పార్టీపై ఒకే విధమైన ప్రభావాన్ని చూపదు.
హైదరాబాద్ జిల్లాది వేరే కథ.
ఈ మూడు జిల్లాల్లో హైదరాబాద్ జిల్లాకు ప్రత్యేక పరిస్థితి ఉంది. పాతబస్తీతో పాటు నగరంలోని అనేక ప్రాంతాలను కలుపుకున్న హైదరాబాద్ జిల్లాలో 47 లక్షలకు పైగా ఓటర్లు ఉన్నారు.
వారిలో దాదాపు 19 లక్షల మంది తిరిగి రిజిస్టర్ చేసుకోలేదని లెక్కలు చెబుతున్నాయి. అంటే దాదాపు 40 శాతం ఓటర్లపై ప్రభావం పడినట్టుగా కనిపిస్తోంది. పాతబస్తీ ప్రాంతంలో అనేక మంది ఓటర్లకు సరైన పత్రాలు లేకపోవడం, SIR ప్రక్రియలో అవసరమైన డాక్యుమెంట్లను సమర్పించలేకపోవడం వంటి కారణాలు కూడా ఈ పరిస్థితికి కారణమై ఉండవచ్చని చెబుతున్నారు. డాక్యుమెంట్లు ఇచ్చిన వారిలో కూడా 12లక్షల మందికి ఇక్కడ నోటీసులు ఇచ్చారు.
మరో39 లక్షల ఓట్లకు నోటీసులు
ఇప్పటికే తొలగించబడిన ఓట్లతో పాటు మరో భారీ సంఖ్యలో ఓటర్లకు ఎన్నికల సంఘం నుంచి నోటీసులు వెళ్తున్నాయి. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లాల్లో మరో 27 లక్షల ఓట్లకు సంబంధించి నోటీసులు ఇచ్చినట్లు సమాచారం. Enumeration పత్రాల్లో తప్పులు, 2002 SIR మ్యాపింగ్‌తో సరిపోని వివరాలు వంటి కారణాలతో ఈ నోటీసులు ఇచ్చారు.
ఈ ఓట్లలో ఎన్ని తిరిగి ధృవీకరించబడతాయి? ఎన్ని ఓట్లు తుది జాబితాలోకి వస్తాయి? అనేది తదుపరి ప్రక్రియలో తేలాల్సి ఉంది. హైదరాబాద్ జిల్లాలో 12లక్షల మందికి నోటీసులు వెళ్లాయి. తొలగించిన ఓట్లకు ఇవి అదనం.
అసలు రాజకీయం ఇప్పుడు మొదలవుతుందా..?
తెలంగాణ ఏర్పడిన తర్వాత హైదరాబాద్‌లో స్థిరపడిన ఆంధ్రా సెటిలర్స్... రాజకీయంగా కొంత ప్రభావం చూపించారు. వీరిలో కొంతమంది ఇక్కడ ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందిన వారున్నారు. ఇప్పుడు ఓట్ల రివిజన్ తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోనుందా అన్న చర్చ మొదలైంది. ఇక్కడ సెటిలైన వారు.. హైదరాబాద్ ఓటర్లుగా పూర్తిగా మారారా?
లేక... “మా ఓటు సొంత రాష్ట్రంలోనే కొనసాగాలి” అని నిర్ణయించుకున్నారా? అనే ప్రశ్న వస్తోంది. రెండో పరిస్థితి పెద్ద సంఖ్యలో నిజమైతే ఒక ఆసక్తికరమైన పరిస్థితి ఏర్పడుతుంది.
"హైదరాబాద్‌లో ఆంధ్రా జనాభా కనిపిస్తుంది. కానీ ఆంధ్రా ఓటు కనిపించదు." ఇది హైదరాబాద్‌లోని రాజకీయ పార్టీలకు కీలకమైన అంశంగా మారే అవకాశం ఉంది.

సెటిలర్స్ ఓట్లు ఏ పార్టీకి?
హైదరాబాద్‌లోని ఆంధ్రా సెటిలర్స్ ఓట్లన్నీ ఒకే పార్టీకి వెళ్తాయనే అభిప్రాయం కూడా పూర్తిగా సరైంది కాదు. తెలుగుదేశం పార్టీ తెలంగాణలో యాక్టివ్‌గా ఉన్న సమయంలో ఆంధ్రా సెటిలర్స్‌లో కొంత మొగ్గు ఆ పార్టీ వైపు ఉండేదనే రాజకీయ విశ్లేషణలు ఉన్నాయి. కానీ ఇప్పుడు తెలంగాణ రాజకీయ పరిస్థితి మారిపోయింది. తెలంగాణలో ప్రధాన రాజకీయ పోటీ తెలంగాణకు చెందిన పార్టీల మధ్యనే సాగుతోంది. అందువల్ల ఓటర్ల సంఖ్య తగ్గడం వల్ల ఏ పార్టీకి ఎంత నష్టం? ఏ పార్టీకి ఎంత లాభం? అనేది ఇప్పుడే కచ్చితంగా చెప్పడం కష్టం.
SIR తర్వాత హైదరాబాద్ రాజకీయ సమీకరణాలు మారుతాయా?
SIR ప్రక్రియ కేవలం ఓటర్ల జాబితా సవరణకు సంబంధించిన పరిపాలనా ప్రక్రియ మాత్రమే. అయితే కేవలం మూడు జిల్లాల పరిధిలోనే దాదాపు 80లక్షల ఓట్లు తొలగిపోవడం, పెండింగ్‌లో ఉండటం అనేది.. చిన్న విషయం కాదు. ఇది భవిష్యత్‌లో రాజకీయంగా తీవ్ర ప్రభావాన్ని చూపించే అంశం. ముఖ్యంగా ఆంధ్రా సెటిలర్స్ ప్రభావం ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో ఓట్ల సంఖ్యలో వచ్చిన మార్పులతో రాజకీయ పార్టీలు తమ ప్లానింగ్ మార్చుకోవలసి పరిస్థితి. ఇక ఏ ప్రభావాలకు లొంగని పాతబస్తీ ప్రాంతం కూడా ఈాసారి కుదుపునకు గురైంది. ప్రత్యేకంగా MIM ప్రభావం ఉన్న నియోజకవర్గాల్లో 35శాతం ఓట్లు తగ్గిపోయాయి. ఏకపక్ష మెజార్టీలతో గెలుస్తున్న MIMకు ఇది కాస్త ఇబ్బందికరమే. ఇది గెలుపుపై ప్రభావం చూపకపోయినా.. మిగిలిన పార్టీలకు పోటీ ఇవ్వడానికి అవకాశం కల్పిస్తుంది. ఆంధ్రావాళ్ల ఓట్లన్నీ తెలంగాణ నుంచి వెళ్లిపోయావా.. MIMకు భారీ గండి పడబోతోందా అన్నది SIR తుది ఓటర్ల జాబితా పూర్తయిన తర్వాతనే తేలనుంది.
Frequently Asked Questions
ఆంధ్రా సెటిలర్స్ ఓట్లు తొలగించబడటానికి లేదా పెండింగ్‌లో ఉండటానికి ప్రధాన కారణం ఏమిటి?
ట్రెండింగ్ వార్తలు





















