Vijay Deverakonda: బీచ్‌లో దేవరకొండ... రష్మిక బర్త్‌డే కోసమే కదా... క్లూ ఇచ్చాడా? దొరికేశాడా?
Vijay Deverakonda Rashmika: ఏప్రిల్ 5న నేషనల్ క్రష్ రష్మిక మందన్న బర్త్ డే. ఈ ఏడాది ఒమన్ వెళ్లి సెలబ్రేట్ చేసుకున్నారు. ఆమెతో పాటు విజయ్ దేవరకొండ కూడా వెళ్లారు. అయితే, ఇక్కడో ట్విస్ట్ ఏమిటంటే?

నేషనల్ క్రష్ రష్మిక మందన్న (Rashmika Mandanna) ఏప్రిల్ 5న తన పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకున్నారు. అది కూడా ఇండియాలో కాదు... ఒమన్ (Oman Country) వెళ్లారు. అక్కడ దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేయగానే... చాలా మంది 'విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) ఎక్కడ?' అంటూ కామెంట్ చేశారు. ఈ రోజు రౌడీ బాయ్ సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు షేర్ చేశారు. దాంతో కామెంట్స్ మరోసారి మొదలు అయ్యాయి.
క్లూ ఇచ్చాడా? కావాలని దొరికేశాడా?
విజయ్ దేవరకొండ గానీ, రష్మిక గానీ తామిద్దరం ప్రేమలో ఇప్పటి వరకు ఒక్కసారి కూడా చెప్పలేదు. అయితే... తన ప్రేమ సంగతి అందిరికీ ఎప్పుడూ నేరుగా చెప్పలేదు. కానీ... ఇద్దరూ ఒకే చోట ఉన్నారని సంగతి తెలిసేలా ప్రవర్తన ఉంటుంది.
View this post on Instagram
విజయ్ దేవరకొండ అండ్ రష్మిక కలిసి ఒమన్ కలిసి వెళ్లలేదు. వేర్వేరుగా వెళ్లారు. రష్మిక కంటే ఒక్క రోజు ముందు ముంబై నుంచి విజయ్ దేవరకొండ వెళ్ళాడు. ఆ తర్వాత రోజు నేషనల్ క్రష్ వెళ్ళింది. దాంతో ఇద్దరు ఒకే చోటకు వెళ్లారనే సంగతి ఆడియన్స్ అందరికీ అర్థమైంది. బర్త్ డే ఫోటోలను రష్మిక విడుదల చేయగా... ఆడియన్స్ ఎక్కువ మంది అడిగిన ప్రశ్న 'విజయ్ దేవరకొండ ఎక్కడ? అని. ఇప్పుడు ఆ హీరో సముద్ర తీరంలో గుర్రపు స్వారీ చేస్తున్న ఫోటోలను నడుస్తున్న ఫోటోలను విడుదల చేశారు. దాంతో రష్మికతో పాటు కలిసే అతను ఉన్నాడని జనాలకు అర్థమైంది. తమ ప్రేమ గురించి మరోసారి క్లూ ఇచ్చాడో లేదో కావాలని దొరికేశాడో కానీ ప్రస్తుతం విజయ్ దేవరకొండ రష్మిక ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
View this post on Instagram
సినిమాల విషయానికి వస్తే... విజయ్ దేవరకొండ హీరోగా జెర్సీ మళ్ళీరావా సినిమాల ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్న 'కింగ్‌డమ్' టీజర్ కొన్ని రోజుల క్రితం విడుదలై సెన్సేషన్ క్రియేట్ చేసింది. దాంతో పాన్ ఇండియా హిట్ కొట్టడం కన్ఫర్మ్ అని ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు రష్మిక విషయానికి వస్తే నటుడు రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో 'ది గర్ల్ ఫ్రెండ్' చేస్తున్నారు.





















