Chhaava on OTT: ఓటీటీలోకి ఈ వారమే 600 కోట్లు కలెక్ట్ చేసిన సినిమా... ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
Chhaava OTT Release Date Platform: విక్కీ కౌశల్, రష్మిక జంటగా నటించిన దేశభక్తి సినిమా 'ఛావా'. థియేటర్లలో ఆల్మోస్ట్ 800 కోట్లు కలెక్ట్ చేసింది. ఈ వారమే ఓటీటీలోకి వస్తోంది. స్ట్రీమింగ్ ఎందులోనో తెలుసా?

విక్కీ కౌశల్ కథానాయకుడిగా నటించిన దేశభక్తి సినిమా 'ఛావా'. ఛత్రపతి శంభాజీ మహారాజ్ జీవితం ఆధారంగా రూపొందిన ఈ సినిమా బాక్సాఫీస్ బరిలో భారీ విజయం సాధించింది. దాదాపుగా 600 కోట్ల రూపాయలు (నెట్ కలెక్షన్స్) వసూలు చేసింది. ఇప్పుడీ 'ఛావా' సినిమా ఓటీటీలో విడుదలకు రెడీ అయ్యింది.
ఏప్రిల్ 11న 'ఛావా' డిజిటల్ రిలీజ్...
ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందో తెలుసా?
Chhaava OTT Platform: 'ఛావా' సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఇంటర్నేషనల్ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. హిందీతో పాటు తెలుగు, తమిళ, మలయాళ, మరాఠీ, బెంగాలీతో పాటు మరికొన్ని భాషల్లో స్ట్రీమింగ్ కానున్నట్టు సమాచారం.
Chhaava OTT Release Date: బాక్సాఫీస్ బరిలో భారీ విజయం సాధించడం మాత్రమే కాదు... థియేటర్లలోని ప్రేక్షకులలో దేశభక్తి రగిలించిన ఈ సినిమా ఏప్రిల్ 11వ తేదీ నుంచి నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ (రిలీజ్) కానున్నట్టు సమాచారం. ఆ విషయాన్ని ఇంకా అధికారంగా అనౌన్స్ చేయలేదు. బహుశా... రెండు మూడు రోజుల్లో ఆ ప్రకటన రావచ్చు.
View this post on Instagram
ఎవరీ 'ఛావా'? ఏమిటీ సినిమా కథ?
'ఛావా' అంటే సింహం కడుపున పుట్టిన సింహం అని చెప్పవచ్చు. ఛత్రపతి శివాజీ మహారాజ్ గురించి భారతీయ ప్రజలు అందరికీ తెలుసు. విదేశీయులు సైతం చాలా గొప్పగా చెప్పే పోరాట యోధుడు శివాజీ. ఆయన తనయుడు ఛత్రపతి శంభాజీ మహారాజ్ జీవితం ఆధారంగా ఈ సినిమా రూపొందింది. తండ్రి మరణం తర్వాత మొఘల్ సామ్రాజ్యానికి, ఔరంగజేబుకు వ్యతిరేకంగా శంభాజీ ఎలా పోరాటం చేశాడు? అనేది చూపించారు.
శంభాజీ భార్య యేసు బాయి పాత్రలో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా నటించిన ఈ సినిమాలో ఔరంగజేబుగా అక్షయ్ ఖన్నా నటించారు. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ అందించిన సంగీతం బలంగా నిలిచింది. పతాక సన్నివేశాల్లో ఆయన ఆర్ఆర్ గూస్ బంప్స్ తెప్పించడంతో పాటు కన్నీళ్లు పెట్టించింది. ఓటీటీలోనూ 'ఛావా' రికార్డులు క్రియేట్ చేస్తుందని విక్కీ కౌశల్ అభిమానులతో పాటు దర్శక నిర్మాతలు నమ్మకంగా ఉన్నారు.





















