అన్వేషించండి

Allu Cinemas Dolby Screen : హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్ - దేశంలోనే అతి పెద్ద డాల్బీ స్క్రీన్... ప్రత్యేకతలేంటో తెలుసా?

Allu Cinemas : దేశంలోనే అత్యంత పెద్దదైన డాల్బీ స్క్రీన్ త్వరలోనే హైదరాబాద్‌లో ప్రారంభం కానుంది. అల్లు సినిమాస్ అత్యాధునిక టెక్నాలజీతో అదిరిపోయే సౌండ్ సిస్టమ్‌తో దీన్ని ప్రారంభించనున్నారు.

Allu Cinemas Largest Dolby Screen To Launch In Hyderabad : హైదరాబాద్‌ వాసులకు, మూవీ లవర్స్‌కు ఇది నిజంగా గుడ్ న్యూస్. ఇప్పటికే బ్యూటిఫుల్ విజువల్ వండర్ ఎక్స్‌పీరియన్స్ అందించేందుకు ఐమాక్స్ వంటి బిగ్ స్క్రీన్స్ అందుబాటులో ఉండగా మరో బిగ్ స్క్రీన్ అందుబాటులోకి రానుంది. దేశంలోనే అత్యంత పెద్దదైన డాల్బీ స్క్రీన్ ప్రేక్షకుల కోసం భాగ్యనగరంలో ప్రారంభం కాబోతోంది.

ప్రత్యేకతలివే?

అల్లు సినిమాస్ అత్యాధునిక టెక్నాలజీతో బిగ్గెస్ట్ డాల్బీ స్క్రీన్‌ను డాల్బీ సినిమాస్ ప్రారంభించనుంది. ఆడియన్స్‌కు సరికొత్త ఎక్స్‌పీరియన్స్ అందించేందుకు ఏర్పాట్లు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. స్క్రీన్ ఏకంగా 75 అడుగుల వెడల్పు కలిగి ఉండనుండగా... DCI ఫ్లాట్ 1.85:1 ఫార్మాట్‌లో ఉంటుంది. 3D ఎక్స్‌పీరియన్స్ కోసం అత్యుత్తమ 'DolbyVision'తో పాటు 'Dolby3D' ప్రొటక్షన్ టెక్నాలజీని వాడుతున్నట్లు తెలుస్తోంది. ఇక స్పెషల్ సౌండ్ ఎఫెక్ట్స్ కోసం 'DolbyAtmos' సౌండ్ సిస్టమ్ యాడ్ చేసినట్లు చెప్పారు.

ఆడియన్స్‌కు మంచి థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్‌తో పాటు అద్భుతమైన సౌండ్, సౌకర్యవంతంగా వీక్షించేందుకు 'పిచ్ బ్లాక్ స్టేడియం సీటింగ్'ను ఏర్పాటు చేస్తున్నారు. సినీ ప్రపంచంలో ప్రేక్షకులను పూర్తిగా లీనం చేసేలా డాల్బీ స్క్రీన్‌ ప్రారంభించనున్నట్లు తెలిపారు.

Also Read : 100 కోట్ల క్లబ్‌లో రణవీర్ సింగ్ 'ధురంధర్' - కేవలం 3 రోజుల్లోనే రికార్డు కలెక్షన్స్

హాలీవుడ్ విజువల్ వండర్‌తో...

హాలీవుడ్ లెజెండరీ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ తెరకెక్కించిన 'అవతార్ ఫైర్ అండ్ యాష్' మూవీతో ఈ డాల్బీ స్క్రీన్ ప్రారంభించబోతున్నారు. ఈ నెల 19న మూవీ రిలీజ్ కానుండగా బెస్ట్ థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ అందించేందుకు డాల్బీ స్క్రీన్ రెడీ అవుతోంది. ఈ అద్భుత టెక్నాలజీని ఎంజాయ్ చేయాలంటే ఆడియన్స్ మరికొద్ది రోజులు ఆగాల్సిందే. 

ఇప్పటికే భాగ్యనగర వాసులకు ప్రసాద్ ఐమాక్స్, ఏఎంబీ సినిమాస్, ఎపిక్ స్క్రీన్స్ వంటి బిగ్ స్క్రీన్ థియేటర్స్ అందుబాటులో ఉన్నాయి. ఇటీవలే హైదరాబాద్‌లో మాస్ మహారాజ రవితేజ ఏఆర్‌టీ సినిమాస్ ఏర్పాటు చేశారు. ఇదే ఫస్ట్ ఎపిక్ స్క్రీన్ కావడం విశేషం. ఇప్పుడు దేశంలోనే అత్యంత పెద్దదైన డాల్బీ స్క్రీన్ రాబోతోంది.

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ప్రముఖ నేషనల్ మీడియా సంస్థ ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. పొలిటికల్, లైఫ్ స్టైల్, హెల్త్, డివోషనల్, ఎంటర్టైన్మెంట్, అగ్రికల్చర్, ఆస్ట్రాలజీ, స్పోర్ట్స్ వార్తలతో పాటు స్పెషల్ స్టోరీలు కూడా రాశారు. ప్రస్తుతం గత రెండున్నరేళ్ల నుంచి సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా వర్క్ చేస్తున్నారు.

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Pawan Kalyan : పవర్ స్టార్... మార్షల్ ఆర్ట్స్ 'న్యూ చాప్టర్' - రిమైండ్ ద డేట్... ఫ్యాన్స్‌కు సస్పెన్స్?
పవర్ స్టార్... మార్షల్ ఆర్ట్స్ 'న్యూ చాప్టర్' - రిమైండ్ ద డేట్... ఫ్యాన్స్‌కు సస్పెన్స్?
Trump: ఇండియన్స్ అమెరికాకు సంపాదించి పెడుతున్నారు - సంచలన జాబితా వెల్లడించిన ట్రంప్ - ఇవిగో డీటైల్స్
ఇండియన్స్ అమెరికాకు సంపాదించి పెడుతున్నారు - సంచలన జాబితా వెల్లడించిన ట్రంప్ - ఇవిగో డీటైల్స్
Advertisement

వీడియోలు

అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..
బెంగళూరు to గోదావరి.. ఈ స్పెషల్ ట్రైన్ ఉందని మీలో ఎంతమందికి తెలుసు?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Pawan Kalyan : పవర్ స్టార్... మార్షల్ ఆర్ట్స్ 'న్యూ చాప్టర్' - రిమైండ్ ద డేట్... ఫ్యాన్స్‌కు సస్పెన్స్?
పవర్ స్టార్... మార్షల్ ఆర్ట్స్ 'న్యూ చాప్టర్' - రిమైండ్ ద డేట్... ఫ్యాన్స్‌కు సస్పెన్స్?
Trump: ఇండియన్స్ అమెరికాకు సంపాదించి పెడుతున్నారు - సంచలన జాబితా వెల్లడించిన ట్రంప్ - ఇవిగో డీటైల్స్
ఇండియన్స్ అమెరికాకు సంపాదించి పెడుతున్నారు - సంచలన జాబితా వెల్లడించిన ట్రంప్ - ఇవిగో డీటైల్స్
Anasuya Bharadwaj : హీరోయిన్ రాశికి సారీ చెప్పిన అనసూయ - ఆ డైలాగ్‍పై క్షమాపణలు చెబుతూ పోస్ట్
హీరోయిన్ రాశికి సారీ చెప్పిన అనసూయ - ఆ డైలాగ్‍పై క్షమాపణలు చెబుతూ పోస్ట్
Kavitha New Party: రాజకీయ శక్తిగా జాగృతి - మావోయిస్టు సానుభూతిపరులు కలసి రావాలని కవిత పిలుపు
రాజకీయ శక్తిగా జాగృతి - మావోయిస్టు సానుభూతిపరులు కలసి రావాలని కవిత పిలుపు
Nicolas Maduro Guerra Warning:చరిత్ర చెబుతుంది ద్రోహి ఎవరో? తల్లి మీద ఒట్టు అంటూ ట్రంప్‌కు మదురో కుమారుడు వార్నింగ్
చరిత్ర చెబుతుంది ద్రోహి ఎవరో? తల్లి మీద ఒట్టు అంటూ ట్రంప్‌కు మదురో కుమారుడు వార్నింగ్
Telugu Woman Murder: అమెరికాలో తెలుగు యువతి దారుణహత్య.. బాయ్ ఫ్రెండ్ ఫ్లాట్‌లో డెడ్‌బాడీ లభ్యం
అమెరికాలో తెలుగు యువతి దారుణహత్య.. బాయ్ ఫ్రెండ్ ఫ్లాట్‌లో డెడ్‌బాడీ లభ్యం
Embed widget