అన్వేషించండి

Vijayawada Crime News: సత్యవర్థన్‌ కిడ్నాప్ కేసు- లొంగిపోయిన కీలక నిందితుడు కొమ్మా కొట్లు

టీడీపీ ఆఫీసుపై దాడి జరిగిందని పోలీసులకు ఫిర్యాదు చేసిన దళిత యువకుడు సత్యవర్థన్‌ కిడ్నాప్ కేసులో కీలక నిందితుడు కొమ్మా కొట్లు విజయవాడ పటమట పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు.

Satyavardhan kidnap case | విజయవాడ: విజయవాడలో సంచలనం సృష్టించిన దళిత యువకుడు సత్యవర్థన్‌ కిడ్నాప్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో కొంతకాలంగా అజ్ఞాతంలో ఉన్న కీలక నిందితుడు (ఏ2) కొమ్మా కొట్లు విజయవాడలోని పటమట పోలీస్ స్టేషన్‌లో సోమవారం లొంగిపోయాడు. ఈ కేసులో గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ (ఏ1) కాగా, కొమ్మా కొట్లు (ఏ2)గా ఉన్నాడు. కేసులో మరికొందరు నిందితులు ఉన్నారు.

కేసు వివరాలు..
వైసీపీ హయాంలో టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడి కేసులో ఫిర్యాదుదారుడిగా దళిత యువకుడు సత్యవర్థన్‌ ఉన్నాడు. అతడ్ని కిడ్నాప్ చేసి, మొదట హైదరాబాద్‌కు తరలించి, తరువాత తిరిగి విజయవాడకు తీసుకురావడంలో ఏ2 కొమ్మా కొట్లు కీలక పాత్ర పోషించినట్లు సమాచారం. ఈ కేసును ఉపసంహరించుకోవాలని వల్లభనేని వంశీ అనుచరులు సత్యవర్థన్‌పై తీవ్రంగా ఒత్తిడి తెచ్చాడు. అందుకు అతడు నిరాకరించడంతో, చివరకు సత్యవర్ధన్‌ను కిడ్నాప్ చేశారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

ఈ కేసులో మరో ఇద్దరు నిందితులు, తేలప్రోలు రాము, వజ్రకుమార్, ఇటీవల కోర్టులో లొంగిపోయారు. మరో కీలక నిందితుడు ఎర్రంశెట్టి రామాంజనేయులును విజయవాడ పటమట పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. ఇటీవల కొమ్మా కొట్లుతో సహా మరికొందరు నిందితులు అజ్ఞాతంలో ఉండగా, వారిపై ఇటీవల నాన్-బెయిలబుల్ వారెంట్లు జారీ అయ్యాయి. ఈ క్రమంలో కొమ్మా కొట్లు పటమట పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు.

Also Read: Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు 'అభినవ కృష్ణ దేవరాయ' బిరుదు ప్రదానం

కిడ్నాప్ కేసుల చట్టాలు
భారతీయ శిక్షా స్మృతి (IPC) ప్రకారం, కిడ్నాప్ (Section 363) ,అపహరణ (Section 360/361) తీవ్రమైన నేరాలుగా పరిగణిస్తారు. ఒక వ్యక్తిని బలవంతంగా అక్రమంగా నిర్బంధించినా, లేదా చట్టవిరుద్ధంగా తరలించినా కిడ్నాప్ నేరం కిందకి వస్తుంది. రాజకీయ ఒత్తిళ్ల కోసం లేదా కేసు ఉపసంహరణ కోసం బెదిరించి కిడ్నాప్ చేయడం చట్టం దృష్టిలో అత్యంత తీవ్రమైన నేరం. నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ అయిన తరువాత నిందితులు లొంగిపోవడం అనేది చట్టపరమైన ప్రక్రియలో సాధారణంగా జరిగే పరిణామం.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Visakha Utsav: సాగరం నుంచి శిఖరం వరకు- జనవరి 24 నుంచి వైభవంగా విశాఖ ఉత్సవ సంబరాలు
సాగరం నుంచి శిఖరం వరకు- జనవరి 24 నుంచి వైభవంగా విశాఖ ఉత్సవ సంబరాలు
KTR News: దళిత ఎమ్మెల్యేపై దాడిని ఖండించిన కేటీఆర్.. ఎంపీ మల్లురవి క్షమాపణ చెప్పాలని డిమాండ్
దళిత ఎమ్మెల్యేపై దాడిని ఖండించిన కేటీఆర్.. ఎంపీ మల్లురవి క్షమాపణ చెప్పాలని డిమాండ్
IND vs NZ 1st ODI: భారత్, న్యూజిలాండ్ తొలి టీ20 మ్యాచ్ లైవ్ ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది.. స్టార్ ప్లేయర్ దూరం
భారత్, న్యూజిలాండ్ తొలి టీ20 మ్యాచ్ లైవ్ ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది.. స్టార్ ప్లేయర్ దూరం
PF ఖాతాదారులకు గుడ్‌న్యూస్.. త్వరలో అందుబాటులోకి EPFO 3.0 పోర్టల్.. మనీ విత్‌‌డ్రా ఈజీ
PF ఖాతాదారులకు గుడ్‌న్యూస్.. త్వరలో అందుబాటులోకి EPFO 3.0 పోర్టల్.. మనీ విత్‌‌డ్రా ఈజీ
Advertisement

వీడియోలు

MI vs DC WPL 2026 | ముంబై ఢిల్లీ విజయం
Rohit, Virat BCCI Contracts Changes | విరాట్​, రోహిత్​కు బీసీసీఐ షాక్?
Ishan Kishan Ind vs NZ T20 | ఇషాన్ కిషన్ పై సూర్య సంచలన ప్రకటన
India vs New Zealand T20 Preview | నేడు భారత్ - న్యూజిలాండ్ మొదటి టీ20
Medaram Jatara Houseflies Mystery | మేడారం మహాజాతరలో కనిపించని ఈగలు | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Visakha Utsav: సాగరం నుంచి శిఖరం వరకు- జనవరి 24 నుంచి వైభవంగా విశాఖ ఉత్సవ సంబరాలు
సాగరం నుంచి శిఖరం వరకు- జనవరి 24 నుంచి వైభవంగా విశాఖ ఉత్సవ సంబరాలు
KTR News: దళిత ఎమ్మెల్యేపై దాడిని ఖండించిన కేటీఆర్.. ఎంపీ మల్లురవి క్షమాపణ చెప్పాలని డిమాండ్
దళిత ఎమ్మెల్యేపై దాడిని ఖండించిన కేటీఆర్.. ఎంపీ మల్లురవి క్షమాపణ చెప్పాలని డిమాండ్
IND vs NZ 1st ODI: భారత్, న్యూజిలాండ్ తొలి టీ20 మ్యాచ్ లైవ్ ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది.. స్టార్ ప్లేయర్ దూరం
భారత్, న్యూజిలాండ్ తొలి టీ20 మ్యాచ్ లైవ్ ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది.. స్టార్ ప్లేయర్ దూరం
PF ఖాతాదారులకు గుడ్‌న్యూస్.. త్వరలో అందుబాటులోకి EPFO 3.0 పోర్టల్.. మనీ విత్‌‌డ్రా ఈజీ
PF ఖాతాదారులకు గుడ్‌న్యూస్.. త్వరలో అందుబాటులోకి EPFO 3.0 పోర్టల్.. మనీ విత్‌‌డ్రా ఈజీ
FOMO: వేరే వాళ్ల స్టాటస్ చూసి వీళ్లకు సోకులు ఎక్కువయ్యాయని అనుకుంటున్నారా? అయితే మీరు ఫోమో బాధితులే!
వేరే వాళ్ల స్టాటస్ చూసి వీళ్లకు సోకులు ఎక్కువయ్యాయని అనుకుంటున్నారా? అయితే మీరు ఫోమో బాధితులే!
Sandhya Nama Upasate Trailer : క్వారంటైన్ కలిపింది ఇద్దరినీ - బంధం... భయం... ఎమోషన్... కట్ చేస్తే సంధ్యానామ ఉపాసతే
క్వారంటైన్ కలిపింది ఇద్దరినీ - బంధం... భయం... ఎమోషన్... కట్ చేస్తే సంధ్యానామ ఉపాసతే
Amaravati News: అమరావతిలో తొలిసారి రిపబ్లిక్ డే వేడుకలు.. ఏపీ సర్కార్ ఇకపై అన్నీ ఇక్కడే చేస్తుందా?
అమరావతిలో తొలిసారి రిపబ్లిక్ డే వేడుకలు.. ఏపీ సర్కార్ ఇకపై అన్నీ ఇక్కడే చేస్తుందా?
Sunita Williams Retires: నాసా నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన సునీతా విలియమ్స్, ఆమెకు పెన్షన్ ఎంత వస్తుంది?
నాసా నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన సునీతా విలియమ్స్, ఆమెకు పెన్షన్ ఎంత వస్తుంది?
Embed widget