Bigg Boss 9 Telugu : బిగ్‌బాస్ డే 94 రివ్యూ... కళ్యాణ్ తో కూతురు తీరుపై భరణి అవాక్కయ్యే కామెంట్స్... చచ్చేదాకా చంపుతారా? అంటూ ఒక్కసారిగా బరస్ట్ అయిన సంజన
Bigg Boss 9 Telugu Today Episode - Day 94 Review : నేటి ఎపిసోడ్ లో బిగ్ బాస్ ఇచ్చిన ట్విస్ట్ కంటే తనూజ - కళ్యాణ్ లపై భరణి చేసిన కామెంట్స్ షాకింగ్ గా అనిపించాయి. అసలు ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే?

94వ రోజు "మా మమ్మీ ఫీల్ అవుతుందా" అంటూ సుమన్ శెట్టితో గేమ్ గురించి డిస్కషన్ పెట్టాడు ఇమ్మాన్యుయేల్. "నువ్వు మధ్యలో దూరొద్దు. వాళ్లిద్దరూ ఎప్పుడైనా కలిసిపోవచ్చు" అని సుమన్ ను హెచ్చరించాడు భరణి. "ఈ వారం లీడర్ బోర్డులో స్కోర్ చేయడానికి పోటీదారులకు ఇస్తున్న యుద్ధం పట్టుకో పట్టుకో. జంబో బ్యాగ్స్ ను ధరించి, సంచాలకులు సంజన, కళ్యాణ్ విసిరే బాల్స్ ను పట్టుకోవాలి" అని చెప్పారు బిగ్ బాస్.
ఇమ్మూకే ఎసరు పెట్టిన మమ్మా
టాస్క్ అయ్యాక "సుమన్ అన్నకు ఒక్కటి కూడా వేయలేదు. అందుకే నేను సెకండ్, ఫోర్త్ వేస్తానని.చెప్పాను" అంటూ ఆర్గ్యుమెంట్ మొదలెట్టింది సంజన. "సుమన్ అన్నవి రెండు నేను తీసేసుకున్నా" అని ఒప్పుకున్నాడు భరణి. "నిన్న కూడా బాల్ ఆటలో ఆమెను ఒక్కదాన్నే అలో చేశాడు. తనొచ్చి నా బండి తాకింది. నా ఆట పోయింది" అంటూ వాదన మొదలు పెట్టింది సంజన. "మరి మీరు 4 భరణి గారికి వేశారు" అని కళ్యాణ్ అనగానే... భరణి ఫైర్ అయ్యాడు. తనూజాకు ఎక్కువ మార్క్స్ రావడంతో అందుకే చెప్పాను నేను అని సంజన సమర్థించుకుంది. ఈ టాస్క్ తర్వాత లీడర్ బోర్డులో ఇమ్మూ 170, డెమోన్ 150, తనూజా 140, భరణి 130, సుమన్ 100, సంజన 80 పాయింట్స్ తో ఉన్నారు. తరువాత "ఈ వీక్ ను కళ్యాణ్ పాడు చేసుకుంటున్నాడు. అతన్ని కరెక్ట్ చేయకండి" అని సంజన అంటే... "నిలబడు అంటే నిలబడుతున్నాడు. కూర్చో అంటే కూర్చున్నాడు. రిలేషన్ ను ఎప్పుడూ తప్పు పట్టను. వాళ్లకు ఒకరంటే ఒకరు అభిమానం. కానీ తనూజా ఓవర్ కమాండింగ్ చేస్తోంది" అన్నాడు భరణి.
ఈసారి తర్వాత జరిగే టాస్క్ నుంచి ఇద్దరు సభ్యులను తీసేయాలి అని ట్విస్ట్ ఇచ్చారు బిగ్ బాస్. "నిన్న నీకు అప్పార్చునిటీ వచ్చింది కదా" అని సంజన అంటే... "అది నేను గెలుచుకున్నది. మీరు ఇచ్చినట్టు మాట్లాడతారేంటి" అంటూ ఫైర్ అయ్యాడు ఇమ్మూ. చివరికి కొన్ని ఫైట్స్ తర్వాత అందరూ కలిసి "మాకు కూడా ఛాన్స్ కావాలి" అంటూ ఇమ్మూ, డెమోన్ ను తీసేశారు. "టాప్ 5 ఉండాలని వారు ముగ్గురూ కలిసి ఆడుతున్న గేమ్" అని తనూజా నిర్ణయాన్ని మార్చే ప్రయత్నం చేశాడు ఇమ్మూ. "ఓటింగ్ వల్ల ఇమ్మూ అన్న వెళ్ళిపోతే నేను చాలా బాధ పడతా" అని తనుజాను రిక్వెస్ట్ చేశాడు డెమోన్.
మనిషిని చచ్చేదాకా చంపుతారా ?
"ప్రతీసారి నన్నే తిస్తావా? చచ్చే దాకా చంపుతారా? కొంచమన్నా హ్యుమానిటీ ఉండాలి. ఒక్క వారంలో 100 సార్లు తీశారు. ప్రతివారం నాకు ఇదే చేస్తున్నారు. మీరెంత కష్టపడ్డారో దానికి పదింతలు నేను కష్టపడ్డాను. సెల్ఫిష్ గా ఆలోచించడానికి కూడా ఒక లిమిట్ ఉంటది" అంటూ ఫైర్ అయ్యింది సంజన. "నీకు పాయింట్స్ ఇచ్చిందే నేను, ఇమ్మూ అన్న. నీకెవరు సపోర్ట్ చేయలేదో వాళ్ళతోనే కలిసి మమ్మల్ని తోస్తున్నావ్" అని డెమోన్ అనగానే... భరణి "సపోర్ట్ లేయలేదు అంటావ్" అని సీరియస్ గా లేచాడు. "ఇప్పుడు ఆయన సుమన్ అన్నకు 50 పాయింట్స్ ఇచ్చారు. మీకు ఇచ్చారా? 50000 ఇచ్చాను. నన్నే ఆవిడ నన్ను ఎటాక్ చేశారు" అని చెప్పాడు డెమోన్.
"ఇమ్మూ కష్టపడి గెలుచుకున్నాడు కాబట్టి అతన్ని తీయకు. నన్ను తీయండి. సంజన ఒక్కరే ఆ గేమ్ ఆడలేదు" అని డెమోన్ మళ్ళీ తనూజతో తిట్లు తిన్నాడు. "నా పేరు తీయకు. మీ కడుపే నిండాలా?" అంటూ మరింత మండిపడింది సంజన. "మేమేం ఎవ్వడి కడుపులు కొట్టి ఇక్కడిదాకా రాలేదు" అని ఇమ్మూ కౌంటర్ వేశాడు. నాలుగవ యుద్ధం "పట్టు విడవకు"లో ఫజిల్ ను పూర్తి చేసి, రోప్ ను కింద పడకుండా ఎక్కువసేపు పట్టుకుని భరణి విన్ అయ్యాడు. టాస్క్ తర్వాత భరణికి 230, తనూజా 220, ఇమ్మూ 170, డెమోన్ 150, సంజన 140, సుమన్ 100 పాయింట్స్ సంపాదించుకున్నారు. దీంతో లీడర్ బోర్డులో టాప్ లో ఉన్న భరణి, తనూజాకి ప్రేక్షకులను కలిసే చాన్స్ దక్కింది. చివరికి తనూజా ఓటు అప్పీల్ చేసుకునే ఛాన్స్ కొట్టేసింది.





















