North Pole vs South Pole | ధృవాల గురించి ఈ విషయాలు తెలుసుకుంటే షాక్ అయిపోతారు | ABP Desam
మన భూమికి రెండు ధృవాలు ఉంటాయని తెలుసుకదా..ఒకటి ఉత్తర ధృవం అయితే రెండోది దక్షిణ ధృవం. మరి ఈ రెండు ధృవాల గురించి మన మైండ్ బ్లాక్ అయ్యే ఓ 10 విషయాలు తెలుసుకుందామా.
1. 🌍 ఉత్తర ధృవాలు రెండు
భూమి మీద ఉత్తర ధృవం అనేది ఉత్తర వైపు ఉండే ఎండ్ పాయింట్ అనుకుంటా కానీ ఇది కాకుండా మరో ఉత్తర ధృవం కూడా ఉంటుంది దీన్నే మాగ్నటిక్ నార్త్ పోల్...అయస్కాంత ఉత్తర ధృవం ఉంటాం. దీని ప్రత్యేకత ఏంటంటే ఇది భూమి భ్రమణాన్ని బట్టి ఏడాదికేడాది మారిపోతూ ఉంటుంది. ప్రస్తుతం మాగ్నటిక్ నార్త్ పోల్ రష్యాలోని సైబీరియా దిశగా ఏడాదికి 40-50కిలోమీటర్ల వేగంతో డ్రిఫ్ట్ అవుతోంది.
2.❄️ అంటార్కిటికా ఓ ఎడారి
అంటార్కిటికా గా పిలుచుకునే మన దక్షిణ ధృవం ఓ ఎడారి. అయితే గడ్డకట్ట మంచు ఉంటే ఎడారి అని ఎలా పిలుస్తాం అనేగా. కానీ వాస్తవం ఏంటంటే సహారా ఎడారిలో పడే వర్షపాతం కంటే అతి తక్కువ వర్షపాతం అంటార్కిటికా లో నమోదవుతూ ఉంటుంది. పైగా భూమి మీద ఉన్న నీటిలో 70శాతం నీరు అంటార్కిటికా దగ్గరే గడ్డ కట్టుకు పోయి ఉన్నాయి సో టెక్నికల్ గా ఇది ఎడారి.
3. ఆరు నెలలు పగలు, ఆరు నెలలు రాత్రి
ఉత్తర, దక్షిణ ధృవాలు రెండింటి దగ్గర విచిత్రమైన పరిస్థితులు ఉంటాయి. ఇక్కడ ఏడాదిలో ఆరు నెలల పాటు పగలు ఉంటే..మరో ఆరునెలల పాటు చీకటి ఉంటుంది. పైగా ఇక్కడ మనం ఇప్పుడు టైమ్ జోన్స్ కూడా అలాగే పనిచేయవు. అందుకే కొన్ని చోట్ల కాలాన్ని పట్టించుకోరు కూడా.
4. ధృవాల దగ్గర దిక్కులేని దిక్సూచీ
మనం ధృవాల దగ్గరకు చేరుకునే కొద్దీ మన దగ్గర ఉన్న కంపాస్ లకు ఆల్మోస్ట్ పిచ్చెక్కుతోంది. అవి ఏ దిక్కును చూపిస్తున్నాయో కూడా అర్థం కాదు. అక్కడ మాగ్నటిక్ ఫీల్డ్ లైన్స్ నిట్టనిలువుగా డిప్ అవుతూ ఉండటం వల్ల ధృవాల దగ్గర కంపాస్ లు సరిగ్గా పనిచేయవు.
5. అరుదైన జీవ జాతులు
ఉత్తర, దక్షిణ ధృవాల వద్ద అరుదైన జీవ జాతులు నివసిస్తుంటాయి. ప్రత్యేకించి ఉత్తర ధృవం దగ్గర మాత్రమే ధృవపు ఎలుగుబంట్లు కనిపిస్తాయి. అలాగే దక్షిణ ధృవం దగ్గర మాత్రమే పెంగ్విన్స్ కనిపిస్తాయి. కానీ మనం ఎప్పటికీ ఈ రెండూ కలిసి జీవించటం మాత్రం చూడలేం. ఎందుకంటే నిజం జీవితంలో ఈ రెండు ప్రాణులు ఎప్పటికీ కలవవు కాబట్టి. అవి వాటి ధృవపు పరిస్థితుల్లో మాత్రమే బతకగలుగుతాయి
6. పైకి కనిపించని అద్భుతాలు
సైంటిస్టులు కనిపెట్టింది ఏంటంటే అంటార్కిటికా లో పేరుకుపోయిన ఐస్ కింద ఆల్మోస్ట్ 4 కిలోమీటర్ల అడుగున సరస్సులు ఉన్నాయి. అక్కడ కనీసం సూర్యకాంతి కూడా సోకకపోయినా కొన్ని సూక్షజీవులు బతికేస్తున్నాయి. అలాగే కొన్ని ఐస్ బ్లాక్స్ కింద పెద్ద పెద్ద పర్వతాలు సమాధి అయిపోయి కూడా ఉన్నాయి.
7. దక్షిణ ధృవం దగ్గర గడ్డకట్టే చలి
ఆర్కిటిక్ ఓషన్ ఉన్న ఉత్తర ధృవం దగ్గర చలికాలం -34 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుంది కానీ దక్షిణ ధృవం దగ్గర ఉష్ణోగ్రతలు వింటర్ లో దాదాపుగా -60 డిగ్రీల కు పడిపోతాయి. ఉత్తర ధృవంతో పోలిస్తే దక్షిణ ధృవం థిక్ ఐస్ ప్లేటో మీద ఉండటంతోనే ఇంతటి సౌత్ పోల్ లో చలి దారుణంగా ఉంటుంది.
8. ఓజోన్ పొరకు చిల్లు పడింది
ఓజోన్ పొరకు చిల్లు పడింది దక్షిణ ధృవం దగ్గరే అని సైంటిస్టులు గుర్తించారు. అంటార్కిటికా సైంటిస్టులు కనుగొన్న ఈ మార్పుతోనే పర్యావరణ పరిరక్షణ పెద్ద డిబేట్ అయ్యి అది మాంట్రియల్ ప్రోటోకాల్ లాంటి క్లైమేట్ ట్రీటీలకు కారణమైంది.
9. స్పేస్ సైన్స్ పరిశోధనలకు ధృవాలు ది బెస్ట్
ధృవాల దగ్గర అంతరిక్ష పరిశోధనలకు అద్భుతమైన అవకాశాలు ఉంటాయి. తక్కువ కాలుష్యం ఉండటం...క్లైమేట్ కూడా స్టేబుల్ గా ఉండటంతో ఇక్కడ అనేక దేశాలు ఖగోళ పరిశోధనల కోసం ఏర్పాట్లు చేసుకున్నాయి.
10. విలువైన వజ్రాలు
కొంత మంది జియాలజిస్టులు భావించేది ఏంటంటే ధృవాల కింద ఉండే ఐస్ షీట్స్ వజ్రాల గనులకు ఆవాసాలు అని చెబుతూ ఉంటారు. ఆస్ట్రేలియా, ఆఫ్రికాల్లో దొరికే వజ్రాల కన్నా విలువైన వజ్రాల గనులు ధృవాల కింద మంచుపొరల్లో దాగి ఉందని చెప్పి ఆశ్చర్యపరుస్తూ ఉంటారు.
సో ఇవి ధృవాలు వాటికి సంబంధించిన టాప్ 10 ఇంట్రెస్టింగ్ ఫ్యాక్స్ట్. మీకే అంశం బాగా ఫాసినేటింగ్ గా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి.





















