అన్వేషించండి

Telangana Panchayat Elections 2025: తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్దం- ఉదయం 7 గంటల నుంచి పోలింగ్‌

Telangana Panchayat Elections 2025: తెలంగాణలో పంచాయతీ ఎన్నికల తొలిదశ పోలింగ్‌ గురువారం ఉదయం ఏడు గంటలకు ప్రారంభంకానుంది. సాయంత్రానికి ఓట్ల లెక్కింపు ఉంటుంది.

Telangana Panchayat Elections 2025: తెలంగాణలో తొలి దశ పంచాయతీ ఎన్నికలకు అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభంకానుంది. తొలి దశలో 3836 పంచాయతీల్లో ఎన్నికలు జరగనున్నాయి. వాస్తవంగా 4236 పంచాయతీల్లో ఎన్నికలకు తొలి దశలో నోటిఫికేషన్ వచ్చింది. అయితే ఇందులో దాదాపు నాలుగు వందల గ్రామాల్లో ఎన్నిక ఏకగ్రీవమైంది. దీంతో అక్కడ ఎన్నికలు జరగడం లేదు. మరికొన్ని ప్రాంతాల్లో ప్రజలు ఎన్నికలను బహిష్కరించడంతోపాటు వివిధ కారణాలతో నామినేషన్‌లు దాఖలు కాలేదు. అక్కడ ఎన్నికలు జరగడం లేదు. ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్న గ్రామాల్లో పదమూడు వేల మందికిపైగా అభ్యర్థులు పోటీలో ఉన్నారు. వారి కోసం ఎన్నికలు జరుగుతున్నాయి. వారి భవిష్యత్‌ను 56 లక్షల మందికిపైగా ఓటర్లు తేల్చనున్నారు.  

తొలి దశ పంచాయతీ పోలింగ్ వివరాలు

తొలి దశలో నోటిఫికేషన్ వచ్చిన గ్రామపంచాయతీలు- 4236
తొలి దశలో నోటిఫికేషన్ వచ్చిన వార్డులు-37,440
తొలి దశలో ఏకగ్రీవమైన పంచాయతీలు- 400
పోలింగ్‌ జరుగుతున్న పంచాయతీలు- 3836
పోలింగ్ కోసం ఏర్పాటు చేసిన పోలింగ్ స్టేషన్లు-37,562
పోలింగ్‌లో పాల్గొనే ఓటర్లు - 56,19,430
పోలింగ్ జరిగే పంచాయతీల్లో పోటీలో ఉన్న అభ్యర్థులు- 12,960

పక్కా ఏర్పాట్లు

ఓటు హక్కు కలిగి ఉన్న వారంతా పోలింగ్‌లో పాల్గొని ఓటు వేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ రాణి కుముదిని పిలుపునిచ్చారు. అందరూ స్వేచ్ఛగా ఓట్లు వేసేందుకు ఏర్పాట్లు చేసినట్టు ప్రకటించారు. సెన్సిటివిటీ ఉన్న గ్రామాల్లో భద్రతను కట్టుదిట్టం చేశామని అవసరమైన ప్రాంతాల్లో అదనపు బలగాలు మోహరించినట్టు వెల్లడించారు. లక్షల మంది సిబ్బంది విధుల్లో ఉంటున్నారని ప్రతి పోలింగ్ కేంద్రంలో కూడా సీసీ టీవీలు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. అన్ని ప్రాంతాలపై నిరంతర పర్యవేక్షణ ఉంటుందని అన్నారు. 

18 పత్రాల్లో ఏదైనా చూపించవచ్చు

తొలి దశ ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో ఇన్ని రోజులు ప్రతి గడప తిరిగిన అభ్యర్థులు ప్రచారం మంగళవారంతో ముగిసింది. మంగళవారం నుంచి ఆయా గ్రామాల్లో ఉండే వైన్‌షాపులు బంద్ అయ్యాయి. ఎలాంటి భయం లేకుండా ఓటు హక్కు కలిగి ఉన్న ప్రతి ఒక్కరు ఓటు వేయాలని, ఎదైనా సమస్య ఉండే స్థానికంగా ఉండే అధికారులకు తెలియజేయాలని సూచించారు. ఓటు హక్కు వినియోగించుకునేందుకు ప్రభుత్వం సూచిన 18 కార్డుల్లో ఏదైనా కార్డు చూపించి ఓటు వేయవచ్చని చెప్పారు. 

భారీగా నగదు పట్టివేత

షెడ్యూల్ వచ్చినప్పటి నుంచి భారీ సంఖ్యలో నగదు పట్టుకున్నట్టు రాణి కుముదిని ప్రకటించారు. మొత్తంగా 3,214 కోడ్ ఉల్లంఘన కేసులు నమోదు అయినట్టు తెలిపారు. 902 ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. 1,70,58,340 రూపాయల నగదు సీజ్ చేశారు. 2,22,91,714 విలువైన మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. 12,15,500 విలువైన ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటి వరకు అధికారులు సీజ్ చేసిన సొత్తు విలువ 7,54,78,535 రూపాయులుగా తేల్చారు. 

మొత్తం మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు జరుపుతోంది ఎన్నికల కమిషన్. మొదటి దశ గురువారం జరగనుంది. రెండో ద డిసెంబర్‌ 14న జరగనుంది. మూడో దశ అక్కడికి మూడు రోజుల తర్వాత డిసెంబ్‌ 17న జరుపుతారు. సర్పంచ్‌ వార్డు మెంబర్స్‌కు ఎన్నికలు జరిగిన రోజునే లెక్కింపు కూడా చేపడతారు. అదే రోజు సర్పంచ్, ఉపసర్పంచ్ ఎన్నిక కూడా పూర్తి చేస్తారు.       

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Bonalu Traffic Diversions: బోనాల పండుగ.. హైదరాబాద్‌లో 2 రోజులపాటు ట్రాఫిక్‌ మళ్లింపులు- ఈ రూట్లలో వెళ్తే జాగ్రత్త
బోనాల పండుగ.. హైదరాబాద్‌లో 2 రోజులపాటు ట్రాఫిక్‌ మళ్లింపులు- ఈ రూట్లలో వెళ్తే జాగ్రత్త
Aid for Peddi Sudarshan Reddy Family: పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
Breaking News: పోక్సో కేసులో తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి పృధ్వీశ్వర్ రెడ్డిపై బీఫ్ఐ సస్పెన్షన్!
పోక్సో కేసులో తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి పృధ్వీశ్వర్ రెడ్డిపై బీఫ్ఐ సస్పెన్షన్!
Medical Student Incident: మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MLA Prem Sagar Rao: మంచిర్యాల అభివృద్ధిని చూసి ఓర్వలేక అవినీతి ఆరోపణలు, 2015లోనే లోన్ చెల్లించా: ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు
మంచిర్యాల అభివృద్ధిని చూసి ఓర్వలేక అవినీతి ఆరోపణలు, 2015లోనే లోన్ చెల్లించా: ప్రేమ్ సాగర్ రావు
Aid for Peddi Sudarshan Reddy Family: పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
Medical Student Incident: మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
Sai Sudharsan Ruled Out: శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
32 Kg Weight Loss Journey : ఈ 5 ఫుడ్స్ మానేసి.. 32 కిలోలు తగ్గిన మహిళ, అసలు సీక్రెట్స్ ఇవే
ఈ 5 ఫుడ్స్ మానేసి.. 32 కిలోలు తగ్గిన మహిళ, అసలు సీక్రెట్స్ ఇవే
మొదటి జీతం రాగానే ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి ? FD, RD లేదా SIP లలో ఏది బెస్ట్ ఆప్షన్?
మొదటి జీతం రాగానే ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి ? FD, RD లేదా SIP లలో ఏది బెస్ట్ ఆప్షన్?
Pruthvishwar Reddy: లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
Embed widget