India vs South Africa T20 Records | మొదటి టీ20లో ఐదు పెద్ద రికార్డులు బ్రేక్!
భారత్ మొదటి T20 మ్యాచ్‌ని సౌత్ ఆఫ్రికాపై 101 పరుగుల తేడాతో గెలిచింది. ఈ మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా 59 పరుగులు చేయడంతో టీమ్ ఇండియా 175 పరుగులు చేసింది. దక్షిణాఫ్రికా 74 పరుగులకే ఆలౌట్ అయింది. అయితే ఈ మ్యాచ్ లో భారత రికార్డును సృష్టించింది. అలాగే హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా కూడా పలు రికార్డ్స్ ను తమ పేరున నమోదు చేసుకున్నారు.
ఇంటర్నేషనల్ T20 క్రికెట్‌లో 100 వికెట్లు తీసిన రెండో ఇండియన్ బౌలర్‌గా నిలిచాడు బుమ్రా. తన T20 కెరీర్‌లో 78వ ఇన్నింగ్స్‌లో ఈ ఘనత సాధించాడు. ఒకే T20 మ్యాచ్‌లో అత్యధిక డిస్మిసల్స్ చేసిన భారత వికెట్ కీపర్ల జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు జితేష్ శర్మ. దక్షిణాఫ్రికాతో జరిగిన మొదటి T20 మ్యాచ్‌లో 4 డిస్మిసల్స్ చేశాడు.
అలాగే హార్దిక్ పాండ్యా ఇంటర్నేషనల్ T20 క్రికెట్‌లో 100 సిక్సర్లు కొట్టిన నాల్గో భారతీయుడిగా నిలిచాడు. కటక్‌లో భారత్.. సఫారీలను 101 పరుగుల తేడాతో ఓడించింది. ఇది అంతర్జాతీయ T20 క్రికెట్ చరిత్రలో దక్షిణాఫ్రికాపై భారత్ సాధించిన మూడో అతిపెద్ద విజయం. ఇక తిలక్ వర్మ 25 ఏళ్లలోపు 1000 T20 పరుగులు పూర్తి చేసిన మొదటి భారతీయ బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు.





















