అన్వేషించండి

Kadapa Mayor Election: కడప మేయర్‌ ఎన్నికకు నోటిఫికేషన్‌, డిసెంబర్ 11న ప్రత్యేక సమావేశం.. 9న హైకోర్టులో విచారణ

Kadapa Mayor Election | కడప మేయర్‌ ఎన్నికకు నోటిఫికేషన్‌ జారీ అయింది. కడప కార్పొరేషన్ కార్యాలయంలో డిసెంబర్ 11న ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు.

కడప: కడప నగరపాలక సంస్థ (Kadapa Municipal Corporation) మేయర్ ఎన్నిక నిర్వహణకు సంబంధించి జిల్లా జాయింట్ కలెక్టర్ అదితి సింగ్ నోటిఫికేషన్ జారీ చేశారు. ఏపీ ఎన్నికల కమిషనర్ నీలం సాహ్నీ 2 రోజుల కిందటే మేయర్ ఎన్నిక కోసం ఉత్తర్వులు జారీ చేయడంతో, జాయింట్ కలెక్టర్ ఈ నోటిఫికేషన్ ఇచ్చారు. దీని ప్రకారం డిసెంబర్ 11వ తేదీన ఉదయం 11 గంటలకు కడప కార్పొరేషన్ కార్యాలయంలో కార్పొరేటర్లు, ఎక్స్ అఫీషియో సభ్యులతో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు.

మేయర్‌గా సురేష్ బాబు తొలగింపు, తప్పనిసరి ఎన్నిక
ఇటీవల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత సురేష్ బాబును మేయర్ పదవి నుంచి తొలగిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. అవినీతి, అక్రమాల ఆరోపణలు ఎదుర్కొంటున్న కారణంగా ఆయనపై కూటమ సర్కార్ చర్యలు తీసుకుంది. అనంతరం, కడప డిప్యూటీ మేయర్‌గా ఉన్న ముంతాజ్ బేగంను ఇన్‌ఛార్జ్ మేయర్‌గా నియమించారు. అయితే, ప్రస్తుత పాలకవర్గం పదవీకాలం మరో ఐదు నెలల్లో ముగియనుంది. కడప నగరంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన తీర్మానాలను ఆమోదించడం తప్పనిసరి. పాలనా అవసరాల దృష్ట్యా కడప మేయర్‌ను ఎన్నుకోవడం అనివార్యం కావడంతో, రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఈ మేరకు మేయర్ పదవి కోసం నోటిఫికేషన్ జారీ చేసింది.

హైకోర్టులో మాజీ మేయర్ పిటిషన్
ఎన్నికల కమిషన్ కడప మేయర్ ఎన్నిక కోసం జారీ చేసిన నోటిఫికేషన్‌ను సవాల్ చేస్తూ, మాజీ మేయర్ సురేష్ బాబు శుక్రవారం హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. తనను మేయర్ పదవి నుంచి తొలగించడాన్ని సవాల్ చేస్తూ ఆయన ఈ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌పై ఏపీ హైకోర్టు డిసెంబర్ 9న విచారణ జరపనుంది. హైకోర్టు తీర్పు తరువాత కడప మేయర్ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుందా లేదా అనే దానిపై స్పష్టత వస్తుంది. ఈ ఎన్నికకు సంబంధించి రాజకీయ వర్గాల్లో, నగరపాలక సంస్థ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Rahul Gandhi On Rohit Vemula Act:
"రోహిత్ వేముల చట్టం కోసం ఊరూవాడా, విద్యార్థులంతా కదలాలి" సంచలన ట్వీట్ చేసిన రాహుల్ గాంధీ
IND vs NZ 3rd ODI: ఇండోర్ నీటితో టీమిండియాలో టెన్షన్ ? వాటర్ ప్యూరిఫయర్‌తో వచ్చిన శుభ్‌మన్ గిల్
ఇండోర్ నీటితో టీమిండియాలో టెన్షన్ ? వాటర్ ప్యూరిఫయర్‌తో వచ్చిన శుభ్‌మన్ గిల్
Aadhaar Card: ఆధార్ కార్డు ఉన్నవారికి 90 వేల రూపాయలు ఇస్తుంది; ఎలాగో తెలుసుకోండి?
ఆధార్ కార్డు ఉన్నవారికి 90 వేల రూపాయలు ఇస్తుంది; ఎలాగో తెలుసుకోండి?
Nagoba Jatara 2026: నాగోబా జాతరకు సర్వం సిద్ధం! మెస్రం వంశీయుల రాక, ప్రత్యేక పూజలు!
నాగోబా జాతరకు సర్వం సిద్ధం! మెస్రం వంశీయుల రాక, ప్రత్యేక పూజలు!
Advertisement

వీడియోలు

WPL 2026 RCB vs GG Highlights | హ్యాట్రిక్ కొట్టిన బెంగళూరు!
Ashwin about India vs New Zealand | టీమ్ సెలక్షన్ పై అశ్విన్ ఘాటు వ్యాఖ్యలు
Manoj Tiwari about Rohit Sharma Captaincy | రోహిత్ కెప్టెన్సీపై మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు
Ind vs NZ Rohit Sharma Records | మరో రికార్డుకు చేరువలో రోహిత్ శర్మ
Spirit Release Date Confirmed | ప్రభాస్ స్పిరిట్ రిలీజ్ డేట్ ఇచ్చిన సందీప్ రెడ్డి వంగా | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rahul Gandhi On Rohit Vemula Act:
"రోహిత్ వేముల చట్టం కోసం ఊరూవాడా, విద్యార్థులంతా కదలాలి" సంచలన ట్వీట్ చేసిన రాహుల్ గాంధీ
IND vs NZ 3rd ODI: ఇండోర్ నీటితో టీమిండియాలో టెన్షన్ ? వాటర్ ప్యూరిఫయర్‌తో వచ్చిన శుభ్‌మన్ గిల్
ఇండోర్ నీటితో టీమిండియాలో టెన్షన్ ? వాటర్ ప్యూరిఫయర్‌తో వచ్చిన శుభ్‌మన్ గిల్
Aadhaar Card: ఆధార్ కార్డు ఉన్నవారికి 90 వేల రూపాయలు ఇస్తుంది; ఎలాగో తెలుసుకోండి?
ఆధార్ కార్డు ఉన్నవారికి 90 వేల రూపాయలు ఇస్తుంది; ఎలాగో తెలుసుకోండి?
Nagoba Jatara 2026: నాగోబా జాతరకు సర్వం సిద్ధం! మెస్రం వంశీయుల రాక, ప్రత్యేక పూజలు!
నాగోబా జాతరకు సర్వం సిద్ధం! మెస్రం వంశీయుల రాక, ప్రత్యేక పూజలు!
Google Gemini AI టెక్నాలజీతో వస్తున్న తొలి EV.. 810 కి.మీ రేంజ్ Volvo EX60 లాంచింగ్ ఎప్పుడంటే..
Google Gemini AI టెక్నాలజీతో వస్తున్న తొలి EV.. 810 కి.మీ రేంజ్ Volvo EX60 లాంచింగ్ ఎప్పుడంటే..
US President Donald Trump : 'కోటి మంది ప్రాణాలను కాపాడా' భారత్-పాక్ కాల్పుల విరమణపై మళ్లీ ట్రంప్ కామెంట్స్
'కోటి మంది ప్రాణాలను కాపాడా' భారత్-పాక్ కాల్పుల విరమణపై మళ్లీ ట్రంప్ కామెంట్స్
Euphoria Trailer: వెయ్యి కోట్ల Dhurandhar సక్సెస్ తర్వాత... సారా అర్జున్ కొత్త సినిమా 'యుఫోరియా' ట్రైలర్ రిలీజ్
వెయ్యి కోట్ల Dhurandhar సక్సెస్ తర్వాత... సారా అర్జున్ కొత్త సినిమా 'యుఫోరియా' ట్రైలర్ రిలీజ్
Sanya Malhotra: సినిమా కలెక్షన్స్ 2000 కోట్లు... కానీ హీరోయిన్ హ్యాపీగా లేదు - బాధ ఎందుకంటే?
సినిమా కలెక్షన్స్ 2000 కోట్లు... కానీ హీరోయిన్ హ్యాపీగా లేదు - బాధ ఎందుకంటే?
Embed widget