అన్వేషించండి
(Source: ECI | ABP NEWS)
Modi Kurnool Tour: శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి సేవలో ప్రధానమంత్రి - మోదీ వెంటే చంద్రబాబు, పవన్
Modi Kurnool Tour: శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి సేవలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ప్రధాని వెంట చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఉన్నారు.
శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి సేవలో ప్రధానమంత్రి
1/13

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో కలిసి ఉప ముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్ గురువారం శ్రీశైలం పర్యటనకు విచ్చేశారు.
2/13

భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానం అధికారులు, వేద పండితులు, జిల్లా అధికారులు పూర్ణకుంభ స్వాగతం పలికి ఆలయంలోకి సాదరంగా ఆహ్వానం పలికారు.
3/13

మొదటిగా స్వామివారికి పంచామృతాలతో రుద్రాభిషేకం చేసిన ప్రధాని మోదీ అనంతరం శ్రీ భ్రమరాంబ అమ్మవారి సేవలో పాల్గొన్నారు.
4/13

అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించిన తర్వాత ఆలయం బయట కాసేపు ధ్యానంలో గడిపారు.
5/13

ఆలయ వేద పండితులు వేదమంత్రోచ్ఛారణాల మధ్య మోదీకి, చంద్రబాబు నాయుడికి, పవన్ కళ్యాణ్‌కి ఆశీర్వచనం అందజేశారు.
6/13

అమ్మవారి స్వామి వార్ల ప్రసాదాలను అలాగే చిత్రపటాన్ని మోడీకి ఆలయ అధికారులు అందించారు.
7/13

మోదీకి గౌరవపూర్వకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా శ్రీశైల ఆలయ కళా రూపాన్ని ప్రదానం చేశారు.
8/13

ప్రధానమంత్రికి ఆలయ విశేషాలను అధికారులు తెలియచేశారు. సుమారు గంట సేపు ప్రధాని ఆలయంలో గడిపారు.
9/13

శ్రీశైలంలోనే ఉన్న ఛత్రపతి శివాజీ మహారాజ్ స్మారక స్ఫూర్తి కేంద్రాన్ని శ్రీశైలం పర్యటనలో ప్రధాని మోదీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సంయుక్తంగా సందర్శించారు.
10/13

కేంద్రంలోని గోడలపై ఉన్న శివాజీ జీవిత విశేషాలు తెలియజేసే చిత్రాలను ఆసక్తిగా మోదీ పరిశీలించారు.
11/13

కేంద్రంలో ఉన్న అతి పెద్ద శివాజీ చిత్రానికి మోదీ నమస్కరించారు.
12/13

దర్బార్ హాలు, ధ్యాన మందిరాల ప్రాముఖ్యతను అధికారులు మోదీకి వివరించారు.
13/13

ధ్యాన మందిరంలో ఉన్న అమ్మవారి విగ్రహానికి పూలను సమర్పించి నమస్కరించారు. కేంద్రం నిర్వహణ వివరాలను తెలుసుకొని నిర్వాహకులను అభినందించారు.
Published at : 16 Oct 2025 03:53 PM (IST)
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఎలక్షన్
విశాఖపట్నం
క్రికెట్
న్యూస్
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















