అన్వేషించండి

Chandrababu: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు తీవ్ర అసహనం - జాబితాలో పవన్, లోకేష్ కూడా ఉన్నట్లేనా ?

Andhra CM: 18 నెలలు అయినా మంత్రుల పనితీరు మెరుగుపడలేదని సీఎం చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ మంత్రుల జాబితాలో పవన్, లోకేష్ కూడా ఉంటారా?

CM Chandrababu expressed dissatisfaction on ministers:  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రుల పనితీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని అన్ని శాఖల హెడ్స్ ఆఫ్ డిపార్ట్‌మెంట్స్ , సెక్రటరీలతో జరిగిన సమావేశంలో మంత్రులు 18 నెలలు అయినా పనితీరులో మార్పు చూపలేదని ఆయన మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాల నిధులు తీసుకురావడంలో మంత్రులు విఫలమవుతున్నారని విమర్శించారు. ఢిల్లీకి అధికారులతో కలిసి వెళ్లి సంబంధిత పథకాలకు నిధులు తీసుకురండి. మంత్రులు ఒక్క రోజు ఢిల్లీకి వెళ్లడంలో ఏమీ నష్టం లేదు అని సీఎం సూచించారు. ఇకనైనా పనితీరు మార్చుకోవాలని మంత్రులకు హెచ్చరిక జారీ చేశారు.

కేంద్ర పథకాల నిధుల్ని సమర్థంగా వినియోగించుకోలేకపోతున్న మంత్రులు            

సమావేశంలో మాట్లాడిన సీఎం చంద్రబాబు, మంత్రులు ప్రజల సమస్యలు పరిష్కరించడంలో ఆలస్యం చేస్తున్నారని, ఇది ప్రభుత్వ  పనితీరును దెబ్బతీస్తోందన్నారు.  మీలో ఎలాంటి మార్పు రాలేదు. ప్రజలు  మన పాలనపై నమ్మకం పెట్టుకుని ఓటు వేశారు. ఆ నమ్మకాన్ని కాపాడుకోవాలంటే మంత్రులు దూకుడుగా పని చేయాలన్నారు.  కేంద్ర పథకాలు – PM Awas Yojana, Ayushman Bharat, PMAY Urban వంటి వాటికి నిధులు వచ్చేలా మంత్రులు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.           

మంత్రులకు పలు సూచనలు చేసిన సీఎం                   

మంత్రులు, ఎమ్మెల్యేలు నెలలో 4 రోజులు పల్లెల్లో పల్లె నిద్ర  చేయాలి. గ్రామాల్లో ఉండి ప్రజల సమస్యలు తెలుసుకోవాలి. పల్లె వెలుగు, స్వర్ణ గ్రామం పేరుతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలి అని ఆదేశించినట్లుగా తెలుస్తోంది. అయితే ఫలానా మంత్రి అని సీఎం చంద్రబాబు చెప్పలేదు. మంత్రుల జాబితాలో పవన్ కల్యాణ్, నారా లోకేష్ కూడా ఉంటారు. వారికి కూడా చంద్రబాబు ఈ హెచ్చరికలు చేసినట్లేనని చెబుతున్నారు. అయితే అందరి పనితీరు బాగోలేదని జనరల్ గా చెప్పారని కానీ నారా లోకేష్, పవన్ కల్యాణ్ తమ శాఖలకు చెందిన కేంద్ర నిధుల కోసం తరచూ ఢిల్లీకి వెళ్లడం లేదా అధికారుల్ని పంపడం ద్వారా గరిష్టంగా నిధులు సేకరిస్తున్నారని అంటున్నారు.  

తమ శాఖల నిధుల కోసం తరచూ ఢిల్లీ వెళ్తున్న పవన్, లోకేష్              

పవన్ కల్యాణ్ ఇటీవల పంచాయతీరాజ్ శాఖలో పల్లె పండుగ 2.0ని ప్రారంభించారు. పెద్ద ఎత్తున పనులను ప్రారంభించారు. నారా లోకేష్ విద్యాశాఖలో సంస్కరణలు తెచ్చి కేంద్ర నిధుల్ని ఎప్పటికప్పుడు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ ఇతర శాఖల మంత్రులే పెద్దగా చొరవడం చూపడం లేదని అంటున్నారు.  ఈ సమావేశం మంత్రులు, అధికారుల మధ్య సమన్వయం పెంచడానికి, పాలనా వ్యవస్థను మరింత దృఢపరచడానికి  ఏర్పాటు చేశారు.                                 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan : కొండగట్టులో పవన్ కల్యాణ్ ప్రత్యేక పూజలు! టీటీడీ నిధులతో నిర్మించే పనులకు శ్రీకారం 
కొండగట్టులో పవన్ కల్యాణ్ ప్రత్యేక పూజలు! టీటీడీ నిధులతో నిర్మించే పనులకు శ్రీకారం 
China Corruption mayor: చైనాలో అవినీతి చేశాడని మాజీ మేయర్‌కు మరణశిక్ష - ఇంత దోచేస్తే ఊరుకుంటారా?
చైనాలో అవినీతి చేశాడని మాజీ మేయర్‌కు మరణశిక్ష - ఇంత దోచేస్తే ఊరుకుంటారా?
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్
Vaammo Vaayyo Song Lyrics : ట్రెండింగ్‌లో రవితేజ రొమాంటిక్ మాస్ బీట్ - యూత్ జోష్ పెంచేలా 'వామ్మో వాయ్యో' సాంగ్ లిరిక్స్
ట్రెండింగ్‌లో రవితేజ రొమాంటిక్ మాస్ బీట్ - యూత్ జోష్ పెంచేలా 'వామ్మో వాయ్యో' సాంగ్ లిరిక్స్
Advertisement

వీడియోలు

పక్కటెముక విరగ్గొట్టుకున్నాడు.. షాక్‌లో గుజరాత్ ఫ్యాన్స్
ముస్తాఫిజుర్‌ ఐపీఎల్ ఆడితే మ్యాచ్‌లు జరగనివ్వం: షారూఖ్‌కు హిందూ సంఘాల వర్నింగ్
2026లో భారత్, పాకిస్తాన్ ఎన్నిసార్లు తలపడతాయంటే..
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్
INSV Kaundinya Explained | INSV కౌండిన్య స్పెషాలిటి తెలుసా ?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan : కొండగట్టులో పవన్ కల్యాణ్ ప్రత్యేక పూజలు! టీటీడీ నిధులతో నిర్మించే పనులకు శ్రీకారం 
కొండగట్టులో పవన్ కల్యాణ్ ప్రత్యేక పూజలు! టీటీడీ నిధులతో నిర్మించే పనులకు శ్రీకారం 
China Corruption mayor: చైనాలో అవినీతి చేశాడని మాజీ మేయర్‌కు మరణశిక్ష - ఇంత దోచేస్తే ఊరుకుంటారా?
చైనాలో అవినీతి చేశాడని మాజీ మేయర్‌కు మరణశిక్ష - ఇంత దోచేస్తే ఊరుకుంటారా?
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్
Vaammo Vaayyo Song Lyrics : ట్రెండింగ్‌లో రవితేజ రొమాంటిక్ మాస్ బీట్ - యూత్ జోష్ పెంచేలా 'వామ్మో వాయ్యో' సాంగ్ లిరిక్స్
ట్రెండింగ్‌లో రవితేజ రొమాంటిక్ మాస్ బీట్ - యూత్ జోష్ పెంచేలా 'వామ్మో వాయ్యో' సాంగ్ లిరిక్స్
Venezuela : వెనిజులా రాజధాని కారకాస్‌పై క్షిపణి దాడి! పలు చోట్ల విధ్వంసం!
వెనిజులా రాజధాని కారకాస్‌పై క్షిపణి దాడి! పలు చోట్ల విధ్వంసం!
Maoist Latest News: ఆపరేషన్ కగార్ తరువాత దేశంలో అతిపెద్ద లొంగుబాటు! డీజీపీ వద్దకు మావోయిస్టు కీలకనేత బరిసెదేవా దళం!
ఆపరేషన్ కగార్ తరువాత దేశంలో అతిపెద్ద లొంగుబాటు! డీజీపీ వద్దకు మావోయిస్టు కీలకనేత బరిసెదేవా దళం!
Hyundai Creta నుంచి Tata Sierra వరకు - కొత్త Seltos ముందు బలంగా నిలబడే కారు ఏది?
కొత్త Kia Seltos - ధర, స్పెసిఫికేషన్లలో ఇతర కార్ల కంటే బెటర్‌గా ఉందా?
Bijapur Encounter: ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా ఎన్‌కౌంటర్‌! మంగుడు, హితేష్‌ సహా 12 మంది మావోయిస్టులు మృతి
ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా ఎన్‌కౌంటర్‌! మంగుడు, హితేష్‌ సహా 12 మంది మావోయిస్టులు మృతి
Embed widget