Telangana Global Summit: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్.. ఏ హాల్ లో ఏ అంశంపై , ఏ టైంలో చర్చించనున్నారంటే
ఫ్యూచర్ సిటీ లో ఈరోజు నుండి జరుగుతున్న గ్లోబల్ సమ్మిట్ పై సర్వత్రా ఆశక్తి నెలకొంది. మొదటి రోజు సమ్మిట్ లో ఏం జరగబోతోంది. అంశాల వారీగా చర్చలు ఇలా ఉండబోతున్నాయి..

ఈ రోజు నుండి రెండు రోజులపాటు తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోతున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2047 ఎలా ఉండబోతోందనే ఉత్కంఠ అధికార కాంగ్రెస్ తో పాటు ప్రతిపక్షాలు కూడా ఎదురు చూస్తున్నాయి. ప్రచారం పీక్స్ లో చూపిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం అంతే స్దాయిలో సమ్మిట్ లో పెట్టుబడులు రాబట్టగలదా , మొదటి రోజు ఏం చేయబోతోంది. ముఖ్యంగా ఏ ఏ అంశాలపై మొదటి రోజు చర్చించబోతున్నారు. ఇంతకీ ఫ్యూచర్ సిటిలో ఏర్పాటు చేసిన ఈ సదస్సులో ఏ హాల్ లో ఏం జరగబోతోంది అంటే.
తెలంగాణ గ్లోబల్ రైజింగ్ సమ్మిట్ 2047లో ఈరోజు ప్రారంభోత్సవ సమావేశం ముగియగానే వివిధ రంగాల్లో ప్రపంచంలో వస్తున్న మార్పులు, భవిష్యత్తుకు అవసరమైన అభివృద్ధి ప్రణాళికలపై చర్చలు కొనసాగుతాయి. గ్లోబల్ సమ్మిట్ వేదిక దగ్గర ప్రధాన వేదికగా సమాంతరంగా ఏర్పాటు చేసిన నాలుగు మీటింగ్ హాల్స్‌లో ఈ ప్యానెల్ డిస్కషన్లు జరుగుతాయి. మొదటి రోజున 12 అంశాలపై ఈ చర్చా వేదికలు ఏర్పాటు చేశారు. వివిధ రంగాలు.. విభిన్న అంశాలపై ఇందులో చర్చిస్తారు. అంశాల వారీగా ఆయా శాఖల మంత్రుల సారధ్యంలో ఆయా రంగాల నిపుణులు, మేధావులు ఈ చర్చల్లో పాల్గొంటారు.
ఈరోజు జరిగే ప్యానెల్ చర్చలు ఇవే..

3 గంటల నుండి 4 గంటల వరకు మొదటి సెషన్ హాల్ 1:
The Just Transition into 2047 – Powering Telangana’s Future – తెలంగాణ భవిష్యత్తు ఇంధనం.. గ్రీన్ ఎనర్జీ దిశలో ముందడుగు
హాల్ 2: Green Mobility 2047 – Zero Emission Vehicles ఎలక్ట్రిక్ వాహనాలు, నాన్-ఎమిషన్ టెక్నాలజీ
హాల్ 3: Tech Telangana 2047 – Semiconductors & Frontier Technologies సాంకేతిక రంగంలో సెమీ కండక్టర్, ఫ్రంటియర్ టెక్నాలజీ అవకాశాలు
హాల్ 4: Telangana as a Global Education Hub విద్యా రంగంలో తెలంగాణను గ్లోబల్ సెంటర్‌గా తీర్చిదిద్దే వ్యూహలపై చర్చలు జరుగుతాయి.

4:15 నుండి 5:15 వరకు రెండో సెషన్..
హాల్ 1: Telangana Flying High – The Rise of Aerospace & Defence – ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాల్లో తెలంగాణ వృద్ధిపై చర్చ
హాల్ 2: Talent Mobility (TOMCOM & MEA) – అంతర్జాతీయ అవకాశాలు, నైపుణ్య మార్పిడి విధానాలపై చర్చ
హాల్ 3: A Healthy Telangana for Prosperous Telangana” – ఆరోగ్యరంగం అభివృద్ధి దిశగా చర్చ
హాల్ 4: Korea (4:10–4:50 PM), Australia (4:50–5:30 PM) ఆ రెండు దేశాలతో వివిధ రంగాల్లో సాంకేతిక, నైపుణ్యాల సహకారం, పెట్టుబడి భాగస్వామ్యంపై చర్చలు జరుగుతాయి..
5:30 నుండి 6:30 వరకు మూడో సెషన్..
హాల్ 1: Telangana Partnering with ASEAN Tigers – ఆసియా దేశాలతో ఆర్థిక భాగస్వామ్యంపై చర్చ
హాల్ 2: Gig Economy – Rise of Fluid Careers ..గిగ్ వర్కర్స్, డిజిటల్ ప్లాట్‌ఫామ్ ఉద్యోగాల భవిష్యత్తుపై చర్చ
హాల్ 3: The RARE Strategy – Increasing Farmers Income through Value Chains ..రైతుల ఆదాయం పెంపొందించే వ్యూహాలపై చర్చ.
హాల్ 4: Canada Session, Fostering Entrepreneurship in Women – రెండు సెషన్లు.. కెనడాతో వివిధ రంగాల్లో సహకార భాగస్వామ్యాలు, పారిశ్రామికవేత్తలుగా మహిళల సాధికారత..
ఇలా నిర్దేశించిన సమయాల్లో కేటాయించిన హాల్ లలో మొదటి రోజు మొత్తంగా 12 అంశాలపై ఈ ప్యానెల్ చర్చలు జరగనున్నాయి. 





















