అన్వేషించండి

Actor Dileep : హీరోయిన్‌కు వేధింపులు - మలయాళ నటుడు దిలీప్‌కు క్లీన్ చిట్... 8 ఏళ్ల నాటి కేసులో కోర్టు తీర్పు

Malayalam Actor Dileep : హీరోయిన్‌పై 8 ఏళ్ల నాటి లైంగిక వేధింపుల కేసులో మలయాళ నటుడు దిలీప్‌ను కోర్టు నిర్దోషిగా ప్రకటించింది. ఈ కేసులో ఆరుగురిని న్యాయస్థానం దోషులుగా తేల్చింది.

Kerala Court Acquits Actor Dileep Of All Charges In 2017 Assault Case : హీరోయిన్‌పై లైంగిక వేధింపుల కేసుకు సంబంధించి మలయాళ నటుడు దిలీప్‌కు కేరళ కోర్టు భారీ ఊరట లభించింది. ఈ కేసులో ఎర్నాకుళం న్యాయస్థానం ఆయన్ను నిర్దోషిగా ప్రకటిస్తూ సోమవారం ఉదయం తీర్పు ఇచ్చింది. అత్యాచారం, కుట్ర వంటి నేరాల కింద ఆరుగురిని దోషులుగా తేల్చిన న్యాయస్థానం... దిలీప్‌పై అభియోగాన్ని నిరూపించడంతో ప్రాసిక్యూషన్ విఫలమైందని కోర్టు తెలిపింది.

అసలేం జరిగిందంటే?

మలయాళంతో పాటు తెలుగు, తమిళ సినిమాల్లో నటించిన ప్రముఖ నటి 2017, ఫిబ్రవరి 17న కిడ్నాప్‌నకు గురయ్యారు. దుండగులు కారులో ఆమెను అపహరించి దాదాపు 2 గంటల పాటు లైంగిక వేధింపులకు గురి చేశారు. ఆ తర్వాత అక్కడి నుంచి పరారయ్యారు. వేధించిన తతంగాన్ని ఫోన్లలో రికార్డు చేసి బ్లాక్ మెయిల్‌కు కూడా పాల్పడాలని చూశారు. కొచ్చిలో ఈ ఘటన జరగ్గా విచారించిన పోలీసులు దిలీప్‌తో పాటు 10 మందిపై కేసులు నమోదు చేశారు.

కిడ్నాప్, లైంగిక వేధింపులు, గ్యాంగ్ రేప్, ఉద్దేశపూర్వకంగా ఆధారాలు చెరిపేయడం వంటి వాటిపై కేసులు నమోదు కాగా... 2017లో ఫస్ట్ ఛార్జ్ షీట్ నమోదు చేశారు. ఇక అదే ఏడాది జులైలో దిలీప్‌ను అరెస్ట్ చేశారు పోలీసులు. 4 నెలల తర్వాత బెయిల్‌పై బయటకు వచ్చిన దిలీప్... కేరళ పోలీసులు పక్షపాతంలో వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ... ఈ కేసును సీబీఐ దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. అయితే, అతని రిక్వెస్ట్‌ను రిజెక్ట్ చేశారు.  

Also Read : ఓటీటీలోకి వచ్చేస్తోన్న దుల్కర్ 'కాంత' - రూమర్లకు చెక్... స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?

8 ఏళ్ల తర్వాత నిర్దోషిగా...

దాదాపు 8 ఏళ్ల తర్వాత ఈ కేసులో దిలీప్‌ను నిర్దోషిగా న్యాయస్థానం ప్రకటించింది. ఆయన ఈ కేసులో ఎనిమిదో నిందితుడిగా పోలీసులు చేర్చారు. దిలీప్ 120 బి అభియోగాన్ని నిరూపించడంలో ప్రాసిక్యూషన్ ఫెయిల్ అయ్యిందని న్యాయమూర్తి తెలిపారు. తీర్పు అనంతరం దిలీప్ స్పందించారు. ఈ కేసులో తనకు ఎలాంటి ప్రమేయం లేదని... ఇది తనపై జరిగిన కుట్ర అని అన్నారు. తనకు సపోర్ట్‌గా నిలిచిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు.

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Musician Deva : ఇండస్ట్రీలో విషాదం... ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ దేవ కన్నుమూత
ఇండస్ట్రీలో విషాదం... ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ దేవ కన్నుమూత
Keerthy Suresh : లతా రెడ్డిగా కీర్తి సురేష్ - జనవరి 12 విడుదల నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్
లతా రెడ్డిగా కీర్తి సురేష్ - జనవరి 12 విడుదల నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్
Vijay Deverakonda New Movie : రొమాంటిక్ కామెడీ జానర్‌లో విజయ్ దేవరకొండ - ఆ డైరెక్టర్‌తో కొత్త మూవీ ఫిక్స్
రొమాంటిక్ కామెడీ జానర్‌లో విజయ్ దేవరకొండ - ఆ డైరెక్టర్‌తో కొత్త మూవీ ఫిక్స్
Nagarjuna : రిలీజ్ డేట్... సరైన ప్లానింగ్ ఉండాలి - వాయిదాలపై నాగ్ అసహనం... ఆ పెద్ద మూవీ అదేనా?
రిలీజ్ డేట్... సరైన ప్లానింగ్ ఉండాలి - వాయిదాలపై నాగ్ అసహనం... ఆ పెద్ద మూవీ అదేనా?

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Dachepalli YCP Candidate Arrest: దాచేపల్లి వైసీపీ ఛైర్మన్‌ అభ్యర్థి కొప్పుల రవి అరెస్ట్‌.. ఇంట్లో 429 సీసాల తెలంగాణ లిక్కర్ సీజ్!
దాచేపల్లి వైసీపీ ఛైర్మన్‌ అభ్యర్థి కొప్పుల రవి అరెస్ట్‌.. ఇంట్లో 429 సీసాల తెలంగాణ లిక్కర్ సీజ్!
Amaravati News: అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు, ఏడీబీ నుంచి మరో రూ.15,000 కోట్ల లోన్!
అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు, ఏడీబీ నుంచి మరో రూ.15,000 కోట్ల లోన్!
APPSC Jobs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్: ఏపీపీఎస్సీ నుంచి 302 ఉద్యోగాలకి నోటిఫికేషన్లు విడుదల
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్: ఏపీపీఎస్సీ నుంచి 302 ఉద్యోగాలకి నోటిఫికేషన్లు విడుదల
Keerthy Suresh : లతా రెడ్డిగా కీర్తి సురేష్ - జనవరి 12 విడుదల నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్
లతా రెడ్డిగా కీర్తి సురేష్ - జనవరి 12 విడుదల నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్
కొత్త బైక్ కొనేవాళ్లకు అదిరిపోయే అప్‌డేట్.. క్విక్‌షిఫ్టర్, క్రూయిజ్ కంట్రోల్‌తో వచ్చిన Xtreme 250R Carbon
దసరా కానుకగా Hero Xtreme 250R Carbon.. TFT డిస్‌ప్లే, ట్రాక్షన్ కంట్రోల్‌తో కొత్త బైక్ లాంచ్‌
Dasara Holidays: ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు వరుసగా 4 రోజులు సెలవులు, ట్విస్ట్ ఏంటంటే..
ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు వరుసగా 4 రోజులు సెలవులు, ట్విస్ట్ ఏంటంటే..
Congress Politics: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్.. 77 మంది ఇంఛార్జిల నియామకం!
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్.. 77 మంది ఇంఛార్జిల నియామకం!
Ranabaali Day 1 Collections : రణబాలి ఫస్ట్ డే కలెక్షన్స్ - తెలుగు రాష్ట్రాల్లో ఫుల్ ఆక్యుపెన్సీ... విరోష్ కపుల్ మూవీ ఎంత కలెక్ట్ చేసిందంటే?
రణబాలి ఫస్ట్ డే కలెక్షన్స్ - తెలుగు రాష్ట్రాల్లో ఫుల్ ఆక్యుపెన్సీ... విరోష్ కపుల్ మూవీ ఎంత కలెక్ట్ చేసిందంటే?
Embed widget