అమ్ము అభిరామి టైటిల్ పాత్రలో నటిస్తుండగా, రామ్ కార్తీక్ హీరోగా నటిస్తున్నారు. వైదిక సెంజాలియా, అంకిత్ కొయ్య వంటి వారు ఇతర ప్రధాన పాత్రల్లో ఉన్నారు.
Missing Meghana: మిస్సింగ్ మేఘన... ఫస్ట్ లుక్ లాంచ్ చేసిన వీవీ వినాయక్
Missing Meghana First Look: అగ్ర దర్శకుడు వీవీ వినాయక్ చేతుల మీదుగా 'మిస్సింగ్ మేఘన' సినిమా ఫస్ట్ లుక్ విడుదల అయ్యింది. ఇందులో హీరో హీరోయిన్లు ఎవరు? వీవీ వినాయక్ ఏం చెప్పారు? అనేది తెలుసుకోండి.

- స్టార్ డైరెక్టర్ వి.వి.వినాయక్ 'మిస్సింగ్ మేఘన' ఫస్ట్ లుక్ విడుదల చేశారు.
- వాచస్పతి దర్శకత్వంలో రూపొందిన సస్పెన్స్ థ్రిల్లర్‌ను నరేష్ బాబు నిర్మిస్తున్నారు.
- అమ్ము అభిరామి, రామ్ కార్తీక్ ప్రధాన పాత్రలు, శామ్ కె నాయుడు ఛాయాగ్రహణం.
అమ్ము అభిరామి ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా 'మిస్సింగ్ మేఘన'. ఇందులో రామ్ కార్తీక్ హీరో. ఈ సినిమా ఫస్ట్ లుక్ స్టార్ డైరెక్టర్ వీవీ వినాయక్ చేతుల మీదుగా లాంచ్ చేశారు.
దర్శకుడు వాచస్పతికి మంచి పేరు రావాలి!
''బెక్కం వేణుగోపాల్ గారు, శ్రీనివాస్ గారి మద్దతుతో వాచస్పతి దర్శకుడిగా వస్తున్న సినిమా 'మిస్సింగ్ మేఘన'. దీనితో హీరో రామ్ కార్తీక్, దర్శకుడికి మంచి పేరు రావాలని కోరుకుంటున్నా. ఇక ధృవన్ మ్యూజికల్ ఆల్ రౌండర్. పాటలు రాస్తాడు, పాడతాడు, సినిమాలకు సంగీతం అందిస్తాడు. అతనికీ మంచి పేరు రావాలని మనస్పూర్తిగా ఆశిస్తున్నాను'' అని వీవీ వినాయక్ అన్నారు. చిత్ర బృందానికి ఆల్ ది బెస్ట్ చెప్పారు.
'మేఘన మిస్సింగ్' చిత్రాన్ని ఫస్ట్ కాపీ మూవీస్, కేడి & కో సంస్థలపై పంచుమర్తి నరేష్ బాబు నిర్మిస్తున్నారు. రామ్ కార్తీక్, అమ్ము అభిరామి ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాలో వైదిక సెంజాలియా, అంకిత్ కొయ్య, గోపరాజు రమణ, వెంప కాశి, కౌశిక్, మహిపాల్, రుచిత, నళిని, శ్రీనివాస్, అజీమ్, పండు ఇతర ప్రధాన తారాగణం. శామ్ కె నాయుడు ఛాయాగ్రహణం అందించారు.
''వీవీ వినాయక్ గారిది గోల్డెన్ హ్యాండ్. మా సినిమా టైటిల్ పోస్టర్, కాన్సెప్ట్ లుక్ ఆయన రిలీజ్ చేయడం సంతోసగంగా ఉంది. ఇదొక సస్పెన్స్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్. అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం'' అని దర్శకుడు వాచస్పతి చెప్పారు. వీవీ వినాయక్, సినిమాలో అవకాశం ఇచ్చిన దర్శకుడికి హీరో రామ్ కార్తీక్ థాంక్స్ చెప్పారు. లెజెండరీ దర్శకుడు వీవీ వినాయక్ గారి చేతుల మీదుగా తమ సినిమా పోస్టర్ లాంచ్ కావడం చాలా ఆనందంగా ఉందన్నారు సంగీత దర్శకుడు ఆర్ఆర్ ధృవన్.
She vanished. But the truth didn't...
— Telugu Film Journalists Association (@FilmJournalists) August 5, 2026
Presenting the first look of the Suspense thriller #MissingMeghana ❤️🔥
Get ready for a gripping mystery coming soon to theatres 💥@firstcopymovies @vachespathyj @iramkarthik @AnkithkoyyaLive @Ammu_Abhirami @rrdhru1 pic.twitter.com/Mnr8lxJdCk
రామ్ కార్తీక్, అమ్ము అభిరామి, వైదిక సెంజాలియా, అంకిత్ కొయ్య, గోపరాజు రమణ, వెంప కాశి, కౌశిక్, మహిపాల్, రుచిత, నళిని, శ్రీనివాస్, అజీమ్, పండు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు నిర్మాత: పంచుమర్తి నరేష్ బాబు, సహ నిర్మాత: దివెళా శ్రీనివాస్ రావ్, దర్శకత్వం: వాచస్పతి, కథ - స్క్రీన్ ప్లే: వనరాజ్, సంభాషణలు: వెంకట్ బద్దిగం, సంగీతం: ఆర్ఆర్ ధృవన్, ఛాయాగ్రహణం: శామ్. కె. నాయుడు.
Before You Go
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Frequently Asked Questions
'మిస్సింగ్ మేఘన' సినిమాలో ప్రధాన తారాగణం ఎవరు?
'మిస్సింగ్ మేఘన' సినిమా ఫస్ట్ లుక్ ఎవరు లాంచ్ చేశారు?
స్టార్ డైరెక్టర్ వీవీ వినాయక్ 'మిస్సింగ్ మేఘన' సినిమా ఫస్ట్ లుక్‌ను లాంచ్ చేశారు. ఆయన చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు.
'మిస్సింగ్ మేఘన' సినిమా ఏ జానర్‌కు చెందినది?
'మిస్సింగ్ మేఘన' ఒక సస్పెన్స్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్. దర్శకుడు వాచస్పతి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.
'మిస్సింగ్ మేఘన' సినిమాను ఎవరు నిర్మిస్తున్నారు?
పంచుమర్తి నరేష్ బాబు 'మిస్సింగ్ మేఘన' చిత్రాన్ని ఫస్ట్ కాపీ మూవీస్, కేడి & కో సంస్థలపై నిర్మిస్తున్నారు. దివెళా శ్రీనివాస్ రావ్ సహ నిర్మాతగా ఉన్నారు.
ట్రెండింగ్ వార్తలు





















