ఆగస్టు 7న 'కొరియన్ కనకరాజు' సినిమా విడుదల కానుంది. ఇది హారర్ కామెడీ జానర్‌తో తెరకెక్కిన ఇండో కొరియన్ చిత్రం.
Korean Kanakaraju First Review: కొరియన్ కనకరాజు ఫస్ట్ రివ్యూ... వరుణ్ తేజ్ సినిమా సెన్సార్ టాక్, ఇన్‌సైడ్ రిపోర్ట్ ఎలా ఉందంటే?
Korean Kanakaraju Review Telugu: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించిన సినిమా 'కొరియన్ కనకరాజు'. ఆగస్టు 7న రిలీజ్. ఈ మూవీ సెన్సార్ టాక్, ఇన్‌సైడ్ రిపోర్ట్ ఎలా ఉందంటే?

- 'కొరియన్ కనకరాజు' హారర్ కామెడీగా, గాంధీ మేర్లపాక దర్శకత్వంలో రూపొందింది.
- వరుణ్ తేజ్ ద్విపాత్రాభినయం, హాస్యం, స్టైల్‌లో వైవిధ్యం చూపారు.
- రాయలసీమ యువకుడిలోకి కొరియన్ ఆత్మ ప్రవేశించి కథ నడుస్తుంది.
Varun Tej's Korean Kanakaraju Movie First Review: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటించిన హారర్ కామెడీ 'కొరియన్ కనకరాజు'. ఇండో కొరియన్ ఫిల్మ్‌గా తెరకెక్కింది. ఈ సినిమాలో రితికా నాయక్ హీరోయిన్. కమెడియన్ సత్య కీలక పాత్ర చేశారు. గాంధీ మేర్లపాక దర్శకత్వం వహించారు. ఆగస్టు 7న సినిమా విడుదల. ఆల్రెడీ సెన్సార్ పూర్తి అయ్యింది. మరి సినిమా ఇన్‌సైడ్ టాక్ ఎలా ఉంది? సెన్సార్ రిపోర్ట్ ఏమిటి? అనేది చూస్తే...
హిలేరియస్ కామెడీ... నవ్వులే నవ్వులు!
'వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్', 'ఎక్స్‌ప్రెస్ రాజా'తో మేర్లపాక గాంధీ బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ అందుకున్నారు. ఆ రెండు సినిమాలతో పాటు ఆ తర్వాత సినిమాల్లోనూ ఆయన కామెడీ టైమింగ్ ఏమిటనేది ఆడియన్స్ అందరికీ తెలుసు. ఇప్పుడు హారర్ కామెడీ జానర్ సినిమా 'కొరియన్ కనకరాజు'తో మరోసారి తన కామెడీ ఏమిటనేది మేర్లపాక గాంధీ చూపించారట.
ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్... ఇంటర్వెల్ ముందు, తర్వాత కూడా 'కొరియన్ కనకరాజు' సినిమాలో కొన్ని ఎపిసోడ్స్ హిలేరియస్ వర్కవుట్ అయ్యాయని సెన్సార్ టాక్ & ఇన్‌సైడ్ రిపోర్ట్. సినిమాకు మేజర్ హైలైట్ కామెడీ అవుతుందని ఆల్రెడీ సినిమా చూసిన జనాలు చెప్పారు. వరుణ్ తేజ్, సత్య కాంబినేషన్... అలాగే బుల్లిరాజుతో వచ్చే సన్నివేశాలు బాగా వర్కవుట్ అయ్యాయట.
డ్యూయల్ షేడ్ రోల్‌లో వరుణ్ తేజ్ సూపర్!
Varun Tej Role In Korean Kanakaraju: కనకరాజుది అనంతపురంలోని పెనుగొండ. అతనిలోకి కొరియన్ ఆత్మ ప్రవేశిస్తుంది. రాయలసీమలోని పల్లెటూరి యువకుడిగా, కొరియన్ ఆత్మ ఆవహించిన తర్వాత గ్యాంగ్‌స్టర్‌గా... డ్యూయల్ షెడ్ రోల్‌లో వరుణ్ తేజ్ అద్భుతంగా నటించారని చెబుతున్నారు.
నటన పరంగా మాత్రమే కాదని, స్టైల్ పరంగానూ వరుణ్ తేజ్ రెండు పాత్రల మధ్య వేరియేషన్ చూపించారని తెలిసింది. ఎక్కువగా కంటెంట్ ఓరియెంటెడ్ ఫిలిమ్స్ చేసే వరుణ్ తేజ్... ఈసారి కమర్షియల్ హీరోగానూ కంటెంట్‌తో కూడిన సినిమా చేశారని చెబుతున్నారు.
అసలు కొరియన్ కనకరాజు సినిమా కథ ఏమిటి?
కొరియన్ కనకరాజు సినిమా కథ విషయానికి వస్తే... ఏపీలో కియా కంపెనీ పెడతారు. అందులో ఉద్యోగానికి కొరియా నుంచి ఓ అమ్మాయి (రితికా నాయక్) వస్తుంది. ఆమె వెంట పడతాడు కనకరాజు (వరుణ్ తేజ్). అయితే... అనుకోకుండా కొరియా నుంచి వచ్చిన ఓ బాటిల్‌లోని ఆత్మ బయటపడి కనకరాజును ఆవహిస్తుంది. ఆ ఆత్మ ఓ గ్యాంగ్‌స్టర్‌ది. కనకరాజు బాడీతో కొరియా వెళ్లిన ఆత్మ అక్కడ ఏం చేసింది? చివరకు ఏమైంది? అనేది సినిమా. తమన్ అందించిన సంగీతం సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ అని అంటున్నారు. కామెడీ తర్వాత సంగీతానికి ఎక్కువ పేరు వస్తుందట.
Before You Go
Jaya Chiravuri Serials and US Life | జయ చిరవూరి రోజుకి ఎంత సంపాదిస్తుందో తెలుసా?
Frequently Asked Questions
కొరియన్ కనకరాజు సినిమా ఎప్పుడు విడుదలవుతుంది?
'కొరియన్ కనకరాజు' సినిమాకు ప్రధాన ఆకర్షణ ఏమిటి?
సినిమాకు మేజర్ హైలైట్ కామెడీ. ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్‌లో కొన్ని ఎపిసోడ్స్ హిలేరియస్‌గా ఉన్నాయని సెన్సార్ టాక్.
'కొరియన్ కనకరాజు' సినిమాలో వరుణ్ తేజ్ పాత్ర ప్రత్యేకత ఏమిటి?
వరుణ్ తేజ్ డ్యూయల్ షేడ్ రోల్‌లో నటించారు. అనంతపురం యువకుడిగా, కొరియన్ ఆత్మ ఆవహించిన గ్యాంగ్‌స్టర్‌గా అద్భుతంగా నటించారని చెబుతున్నారు.
'కొరియన్ కనకరాజు' సినిమా కథాంశం ఏమిటి?
అనంతపురంలోని కనకరాజుకు కొరియన్ ఆత్మ పడుతుంది. కనకరాజు బాడీతో కొరియా వెళ్ళిన ఆ ఆత్మ అక్కడ ఏం చేసింది అనేది సినిమా కథ.
ట్రెండింగ్ వార్తలు






















