వరుణ్ తేజ్ కెరీర్‌లో బెస్ట్, మస్ట్ వాచ్ ఫిల్మ్స్

'మట్కా'తో వరుణ్ తేజ్ నవంబర్ 14న పాన్ ఇండియా ఎంట్రీ ఇస్తున్నారు. దీనికి ముందు ఆయన సినిమాల్లో బెస్ట్ ఏవో చూడండి.

ఫిదా... హీరోయిన్ సాయి పల్లవి క్యారెక్టర్ హైలైట్ అయినా ఆమెకు ధీటుగా వరుణ్ తేజ్ నటించారు. ఎవర్ గ్రీన్ క్లాసిక్ చిత్రమిది. 

తొలిప్రేమ... నటుడిగా వరుణ్ తేజ్ ఎంతో పరిణితి చూపించిన సినిమా. అందులో ప్రేమ కథ, ఆయన నటన సూపర్ అంతే!

ఎఫ్ 2 అండ్ ఎఫ్ 3... వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా నటించిన ఆ రెండు సినిమాలకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. కొందర్ని విపరీతంగా నవ్వించిన సినిమాలు అవి. 

కంచె... ఇందులో ప్రేమ కథతో పాటు దేశభక్తి కూడా ఉంది. పాటలు ఇంకా బావుంటాయి. నటుడిగా వరుణ్ తేజ్‌కు రెస్పెక్ట్ తెచ్చిన సినిమా. 

గద్దలకొండ గణేష్... వరుణ్ తేజ్ హీరో అయినా, ఆయన క్యారెక్టర్‌లో విలన్ షేడ్స్ ఉంటాయి. గ్యాంగ్‌స్టర్ కనుక. లుక్, నటన కొత్తగా ఉంటాయి.

అంతరిక్షం... ఇదొక ఎక్స్‌పరిమెంటల్ ఫిల్మ్. థియేటర్లలో అంతగా ఆడలేదు. కానీ, ఓటీటీల్లో మంచి ఆదరణ సొంతం చేసుకుంటోంది. 

ముకుంద... వరుణ్ తేజ్ హీరోగా పరిచయమైన సినిమా. పూజా హెగ్డేకు తెలుగులో మొదటి హిట్. కథ, కథనాలు కొత్తగా ఉంటాయి.