మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ సరసన 'దేవర'లో నటించినది ఈవిడే. పేరు... శృతి మరాఠే. ఇంతకీ, ఎవరీమె? నేపథ్యం ఏమిటి? ఇంతకు ముందు ఏం చేశారు? తెలుసుకోండి.
శృతి మరాఠే గుజరాతీ. అయితే... ఆవిడ ముంబైలో సెటిల్ అయ్యారు. మరాఠీ సినిమాల్లో ఎక్కువగా నటిస్తున్నారు. పుణెలోని సెయింట్ మీరా కాలేజీలో ఆవిడ చదువుకున్నారు.
మరాఠీ సినిమా 'సనాయ్ చౌఘడే'తో శృతి మరాఠే సినిమా ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ అయ్యారు. అయితే... అందులో ఆమె హీరోయిన్ కాదు. ఓ కీలక పాత్రలో నటించారు.
మరాఠీ సినిమా చేసిన మరుసటి ఏడాది తమిళంలో 'ఇందిరా విల్లా' సినిమా చేశారు. అందులో తెలుగు ప్రేక్షకులకు 'శ్రీరామ్'గా సుపరిచితుడైన శ్రీకాంత్ హీరో. ఆ తర్వాత తమిళ సినిమాలు చేసినా ఎక్కువగా మరాఠీకి పరిమితం అయ్యారు.
'దేవర'లో యంగ్ ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ నటించారు. ఫాదర్ రోల్ చేసిన ఎన్టీఆర్ సరసన శృతి మరాఠే నటించారు. అయితే... ఫాదర్ పాత్రకు యంగ్ సీన్స్ కూడా ఉన్నాయి. ఆయా సన్నివేశాల్లో శృతి లుక్ ఇది.
ఎన్టీఆర్, శృతి మరాఠే తల్లిదండ్రులుగా చేసే సన్నివేశాలు కూడా ఉన్నాయి. ఆయా సన్నివేశాల్లో శృతి మరాఠే ఈ లుక్కులో కనిపించనున్నారు. ఇటీవల ఈ ఫోటోలను ఆవిడ సోషల్ మీడియాలో షేర్ చేశారు.
ఎన్టీఆర్ భార్య పాత్రకు శృతి మరాఠేని ఎంపిక చేయడానికి కారణం ఏమిటి? అని 'దేవర' దర్శకుడు శృతి మరాఠేని అడగ్గా... ఎటువంటి బ్యాగేజ్ లేని నటి, అందమైన రూపం కల నటి కోసం చూశామని, ఆవిడను తీసుకున్నామని తెలిపారు.
శృతి మరాఠే వయసు 38 ఏళ్లు. ఎనిమిదేళ్ల క్రితం ఆవిడ పెళ్లి చేసుకున్నారు. శృతి భర్త పేరు గౌరవ్ ఘటనేకర్. ఆమె పుట్టినరోజు అక్టోబర్ 9, 1985.
'దేవర' సినిమా తర్వాత తెలుగులో శృతి మరాఠేకి అవకాశాలు వస్తాయా? లేదా? అనేది చూడాలి. హిందీలో ఈ ఏడాది హిట్ అయిన 'ముంజ్యా' సినిమాలోనూ ఆవిడ నటించారు.