రీతూ వర్మ వెండితెరకు పరిచయమైన సినిమా ఎన్టీఆర్ 'బాద్ షా'. అందులో కాజల్ చెల్లెలు పాత్రలో కనిపించారు. మొదటి సినిమాతో మెమరబుల్ హిట్ అందుకున్నారు.
'బాద్ షా' తర్వాత 'ప్రేమ ఇష్క్ కాదల్', 'నా రాకుమారుడు', 'ఎవడే సుబ్రమణ్యం' సినిమాల్లో నటించారు రీతూ వర్మ. అయితే... ఆమెకు 'పెళ్లి చూపులు' సాలిడ్ హిట్ అందించింది. అందులో ఆమె తన మార్క్ చూపించారు.
'పెళ్లి చూపులు' తర్వాత రీతూ వర్మకు మిగతా ఇండస్ట్రీల నుంచి ఆఫర్లు రావడం మొదలు అయ్యాయి. ధనుష్ 'వీఐపీ 2'తో తమిళంలోకి ఎంట్రీ ఇచ్చారు రీతూ వర్మ. అది మంచి పేరు తీసుకు వచ్చింది.
రీతూ వర్మ కెరీర్ బిగ్గెస్ట్ హిట్ అంటే దుల్కర్ సల్మాన్ జోడీగా నటించిన 'కనులు కనులను దోచాయంటే' అని చెప్పాలి. ఆ తమిళ సినిమా తెలుగులోనూ భారీ హిట్ సాధించింది.
తమిళ, తెలుగు భాషల్లో రీతూ వర్మకు వచ్చిన మరో బిగ్గెస్ట్ హిట్ 'ఒకే ఒక జీవితం'. శర్వానంద్, అమల అక్కినేని ప్రధాన పాత్రల్లో మదర్ సెంటిమెంట్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది.
సినిమాలతో పాటు ఓటీటీలోనూ రీతూ వర్మ అడుగు పెట్టారు. 'మోడ్రన్ లవ్ చెన్నై', 'మోడ్రన్ లవ్ హైదరాబాద్'... రెండు యాంథాలజీ సిరీస్‌లలోనూ ఆవిడ నటించారు.
రీతూ వర్మ కథానాయికగా నటించిన విశాల్ 'మార్క్ ఆంటోనీ' తెలుగులో అంతగా విజయం సాధించలేదు. కానీ, తమిళంలో ఆ సినిమా వంద కోట్లు వసూలు చేసింది.
కథానాయికగా మొదటి సినిమా 'ప్రేమ ఇష్క్ కాదల్' తర్వాత శ్రీవిష్ణుతో కలిసి రీతూ వర్మ నటించిన సినిమా 'స్వాగ్'. ఇందులో మహారాణిగా, మోడ్రన్ అమ్మాయిగా డిఫరెంట్ డిఫరెంట్ రోల్స్ చేశారు.
రీతూ వర్మతో పాటు ఆమె అభిమానులు, ప్రేక్షకులు ఎదురు చూసే సినిమాల్లో చియాన్ విక్రమ్ 'ధ్రువ నక్షత్రం' ఒకటి. గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఆ సినిమాలో రీతూ హీరోయిన్. అయితే, చాలా రోజులుగా సినిమా వాయిదా పడుతూ వస్తోంది.