అన్వేషించండి

Bhari Movie: 'బరి'లో తండ్రీ కొడుకులు... తొలిసారి నాగబాబు, వరుణ్ తేజ్ కలిసి

Varun Tej Nagababu: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, ఆయన తండ్రి మెగా బ్రదర్ నాగబాబు కలిసి తొలిసారి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు. 'బరి'లో తండ్రీ కొడుకులు తెరపై కనిపించనున్నారు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • వరుణ్ తేజ్ నటిస్తున్న 'బరి'లో నాగబాబు కీలక పాత్ర.
  • తండ్రీ తనయులు వరుణ్, నాగబాబు తొలిసారిగా కలిసి నటించారు.
  • నిహారిక నిర్మిస్తున్న పాన్ ఇండియా వాలీబాల్ స్పోర్ట్స్ డ్రామా.
  • వరుణ్ తేజ్ గాయం వల్ల చిత్రీకరణ, విడుదల వాయిదా.

'మగధీర'లోని ఓ పాటలో మెగాస్టార్ చిరంజీవి తళుక్కున మెరిశారు. తర్వాత 'బ్రూస్ లీ'లోని క్లైమాక్స్ సీన్ చేశారు. తనయుడు రామ్ చరణ్ సినిమాల్లో తండ్రి చిరంజీవి కనిపించడంతో అభిమానులు పండగ చేసుకున్నారు. చిరంజీవి రీ ఎంట్రీ సినిమా 'ఖైదీ నంబర్ 150'లో రామ్ చరణ్ గెస్ట్ అప్పియరెన్స్ ఇచ్చారు. 'ఆచార్య'లో కలిసి నటించారు. 'ఓజీ'లోని 'ఫైర్ స్ట్రోమ్' లిరికల్ వీడియో విడుదలైనప్పుడు అందులో ఉన్నది అకిరా నందన్ అని ప్రచారం జరిగింది. తండ్రీ తనయులు కలిసి తెరపై కనిపిస్తే ప్రేక్షకులలో ఆ సినిమాపై ఉండే క్రేజ్ వేరు. అభిమానులకు వచ్చే కిక్ వేరు. ఇప్పుడు 'బరి'కి ఆ క్రేజ్, ఆ కిక్ రానుంది. 

'బరి'లో మెగా బ్రదర్ నాగబాబు కూడా!
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej) కథానాయకుడిగా ప్రారంభమైన పాన్ ఇండియా ఫిల్మ్ 'బరి'. ఇదొక స్పోర్ట్స్ డ్రామా. వాలీబాల్ నేపథ్యంలో సినిమా రూపొందుతోంది. ఇందులో వరుణ్ తేజ్ తండ్రి, మెగా బ్రదర్ నాగబాబు (Nagababu Konidela) కీలక పాత్రలో కనిపించనున్నారు. 

'కొరియన్ కనకరాజు' విడుదల (ఆగస్టు 7న థియేట్రికల్ రిలీజ్) నేపథ్యంలో ఎన్నారై అభిమానులతో వరుణ్ తేజ్ ముచ్చటించారు. జూమ్ మీటింగ్‌లో మాట్లాడారు. ఆ సమయంలో 'బరి'లో నాగబాబు నటిస్తున్న విషయాన్ని వెల్లడించారు. ఇప్పటి వరకు వరుణ్ తేజ్ సినిమాల్లో నాగబాబు కనిపించలేదు. చిరంజీవి, పవన్ కళ్యాణ్ నుంచి మొదలు పెడితే రామ్ చరణ్, అల్లు అర్జున్, సాయి దుర్గా తేజ్, అల్లు శిరీష్ సినిమాల్లో నటించారు. తనయుడితో తొలిసారి స్క్రీన్ షేర్ చేసుకోనున్నారు.

Also ReadKorean Kanakaraju First Review - కొరియన్ కనకరాజు ఫస్ట్ రివ్యూ... వరుణ్ తేజ్ హారర్ కామెడీ సినిమా సెన్సార్ టాక్, ఇన్‌సైడ్ రిపోర్ట్ ఎలా ఉందంటే?

'బరి' సినిమా స్పెషాలిటీ ఏమిటంటే... అన్నయ్య వరుణ్ తేజ్ హీరోగా చెల్లెలు నిహారికా కొణిదెల తన పింక్ ఎలిఫాంట్ పిక్చర్స్ సంస్థపై నిర్మిస్తున్న మొదటి చిత్రమిది. తండ్రీ కొడుకులు నాగబాబు, వరుణ్ తేజ్ కలిసి నటిస్తున్న మొదటి సినిమా కూడా ఇదే కావడం విశేషం.

Also ReadAnchor Charmilla Latest Photos - చుడిదార్‌లో చర్మిల ... హ్యాపెనింగ్ యాంకర్ లేటెస్ట్ ఫోటోలు

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Varun Tej Konidela (@varunkonidela7)

'కమిటీ కుర్రోళ్ళు'తో యదువంశీని దర్శకుడిగా పరిచయం చేశారు నిహారిక. 'బరి'ని కూడా అతని దర్శకత్వంలో నిర్మిస్తున్నారు. తెలుగుతో పాటు తమిళ్, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో సినిమాను విడుదల చేయనున్నారు. సంక్రాంతికి సినిమాను థియేటర్లలోకి తీసుకు రావాలని ప్లాన్ చేశారు. అయితే వరుణ్ తేజ్ కాలికి గాయం కావడం వల్ల చిత్రీకరణ ఆలస్యం కానుంది. సినిమా కూడా సంక్రాంతికి కాకుండా తర్వాత రానుంది.

Also Read: Bigg Boss 10 Telugu - 'బిగ్ బాస్ 10'లోకి ఫిమేల్ లిరిసిస్ట్... గ్లామర్ లేడీ కాదు, కంటెంట్ ఉన్న అమ్మాయి

Frequently Asked Questions

'బరి' సినిమా ప్రధాన అంశం ఏమిటి?

'బరి' ఒక స్పోర్ట్స్ డ్రామా, వాలీబాల్ నేపథ్యంలో రూపొందుతోంది. వరుణ్ తేజ్ కథానాయకుడిగా నటిస్తున్నారు.

'బరి' సినిమాలో నాగబాబు పాత్ర ఏమిటి?

'బరి' సినిమాలో వరుణ్ తేజ్ తండ్రి నాగబాబు కీలక పాత్రలో నటిస్తున్నారు. తండ్రీ కొడుకులు కలిసి నటిస్తున్న మొదటి సినిమా ఇదే.

'బరి' సినిమాను ఎవరు నిర్మిస్తున్నారు?

వరుణ్ తేజ్ చెల్లెలు నిహారికా కొణిదెల తన పింక్ ఎలిఫాంట్ పిక్చర్స్ సంస్థపై 'బరి' సినిమాను నిర్మిస్తున్నారు. ఆమె నిర్మిస్తున్న మొదటి చిత్రమిది.

'బరి' సినిమా విడుదల ఎందుకు ఆలస్యమవుతోంది?

'బరి' సినిమాను సంక్రాంతికి విడుదల చేయాలని ప్లాన్ చేశారు. అయితే, వరుణ్ తేజ్ కాలికి గాయం కావడం వల్ల విడుదల ఆలస్యం కానుంది.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Bhari Movie: 'బరి'లో తండ్రీ కొడుకులు... తొలిసారి నాగబాబు, వరుణ్ తేజ్ కలిసి
'బరి'లో తండ్రీ కొడుకులు... తొలిసారి నాగబాబు, వరుణ్ తేజ్ కలిసి
Makutam Trailer: శుక్రవారమే మకుటం ట్రైలర్ రిలీజ్... విశాల్ ఏం చేస్తాడో?
శుక్రవారమే మకుటం ట్రైలర్ రిలీజ్... విశాల్ ఏం చేస్తాడో?
మలైకా అరోరా కొత్త కారు Mahindra Thar Roxx.. స్పెషల్ SUV ధర, ఫీచర్ల పూర్తి వివరాలు
మలైకా అరోరా కొత్త కారు Mahindra Thar Roxx.. స్పెషల్ SUV ధర, ఫీచర్ల పూర్తి వివరాలు
Missing Meghana: మిస్సింగ్ మేఘన... ఫస్ట్ లుక్ లాంచ్ చేసిన వీవీ వినాయక్
మిస్సింగ్ మేఘన... ఫస్ట్ లుక్ లాంచ్ చేసిన వీవీ వినాయక్
Advertisement

వీడియోలు

BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా
Illu Illalu Pillalu Serial Actor Sai Kumar Kola | సీరియల్ నటుడు సాయి కుమార్ కోలా రియల్ లైఫ్
Mohammed Shami Test Comeback Ends? | మహమ్మద్ షమీ కెరీర్ క్లోజ్ అయినట్టేనా?
Gundenininda Gudigantalu Serial August 5 | మలేషియా మామయ్యకు బాలు , మీనా చెక్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Assembly Monsoon Sessions: ఆగస్టు 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమరం: డీఎస్సీ చాలెంజ్‌పై వైఎస్సార్‌సీపీ వ్యూహం ఏంటి? సభలోకి వెళ్తుందా.. వీధుల్లోనే పోరు సాగిస్తుందా?
ఆగస్టు 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమరం: డీఎస్సీ చాలెంజ్‌పై వైఎస్సార్‌సీపీ వ్యూహం ఏంటి? సభలోకి వెళ్తుందా.. వీధుల్లోనే పోరు సాగిస్తుందా?
Telangana Phone Tapping Case: తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - ఆగస్టు 15 తర్వాత నాంపల్లి కోర్టులో సిట్ అదనపు ఛార్జ్‌షీట్ - కేసీఆర్ పేరు ఉంటుందా?
తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - ఆగస్టు 15 తర్వాత నాంపల్లి కోర్టులో సిట్ అదనపు ఛార్జ్‌షీట్ - కేసీఆర్ పేరు ఉంటుందా?
Vijay vs Udhayanidhi Stalin: తమిళనాట విజయ్ వర్సెస్ ఉదయనిధి స్టాలిన్ - పాత మిత్రుల పొలిటికల్ ఫైట్ వెనుక అసలు ప్లాన్ ఇదేనా?
తమిళనాట విజయ్ వర్సెస్ ఉదయనిధి స్టాలిన్ - పాత మిత్రుల పొలిటికల్ ఫైట్ వెనుక అసలు ప్లాన్ ఇదేనా?
Megastar Chiranjeevi AP Brand Ambassador: ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవి - కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం?
ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవి - కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం?
Prudhvishwar Reddy POCSO Case: తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
Budget Friendly Bikes: మిడిల్ క్లాస్ వారికి లగ్జరీ ఫీల్ ఇచ్చే బెస్ట్ బైక్స్ ఇవే.. లిస్ట్ చూసేయండి
మిడిల్ క్లాస్ వారికి లగ్జరీ ఫీల్ ఇచ్చే బెస్ట్ బైక్స్ ఇవే.. లిస్ట్ చూసేయండి
Anchor Charmilla: చుడిదార్‌లో చర్మిల ... హ్యాపెనింగ్ యాంకర్ లేటెస్ట్ ఫోటోలు
చుడిదార్‌లో చర్మిల ... హ్యాపెనింగ్ యాంకర్ లేటెస్ట్ ఫోటోలు
Adilabad Chit Fund Fraud: చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
Embed widget