అన్వేషించండి

Upcoming Telugu Movies : ఒకే వారంలో 8 మూవీస్ - ఓటీటీ మూవీస్, వెబ్ సిరీస్‌ల ఫుల్ లిస్ట్ ఇదే!

This Week Telugu Movies : కామెడీ, యూత్ ఫుల్ ఎంటర్టైనర్స్, హారర్, యాక్షన్ ఎంటర్టైనర్స్ వరకూ ఈ వారం 8 సినిమాలు థియేటర్లలోకి రానున్నాయి. ఓటీటీల్లోనూ మూవీస్/వెబ్ సిరీస్‌లు అందుబాటులోకి రానున్నాయి.

This Week Telugu Movie In December Second Week : ఇయర్ ఎండింగ్‌లో మూవీ లవర్స్‌కు ఫుల్ వినోదాల విందు అందనుంది. డిసెంబర్ రెండో వారంలో ఏకంగా 8 సినిమాలు థియేటర్లలో సందడి చేయబోతున్నాయి. యూత్ ఫుల్ ఎంటర్టైనర్స్ నుంచి హారర్ థ్రిల్లర్, బయోపిక్స్ వరకూ ఇందులో ఉన్నాయి. దీంతో పాటే ఓటీటీల్లో మూవీస్, వెబ్ సిరీస్‌లు కూడా స్ట్రీమింగ్ కానున్నాయి. మరి ఆ లిస్ట్ ఓసారి చూస్తే...

సుమ కొడుకు మూవీ 'మోగ్లీ'

ఫేమస్ యాంకర్ సుమ కొడుకు రోషన్ కనకాల కొడుకు సరికొత్త లవ్ ఎంటర్టైనర్ 'మోగ్లీ' ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. 'కలర్ ఫోటో' ఫేం సందీప్ రాజ్ మూవీకి దర్శకత్వం వహించగా... సాక్షి మడోల్కర్ హీరోయిన్‌గా నటించారు. వైవా హర్ష కీలక పాత్ర పోషించాడు. తాను ప్రేమించిన అమ్మాయి కోసం ఓ యువకుడు చేసిన పోరాటమే 'మోగ్లీ' అని తెలుస్తోంది.

కార్తీ 'అన్నగారు వస్తారు'

తమిళ స్టార్ కార్తీ లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ 'వా వాతియార్' తెలుగులో 'అన్నగారు వస్తారు' పేరుతో రిలీజ్ చేస్తున్నారు. నలన్ కుమార స్వామి దర్శకత్వం వహిస్తుండగా... కృతి శెట్టి హీరోయిన్‌గా నటించారు. కార్తీ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనుండగా... హీరోయిన్ ఆత్మలతో మాట్లాడే పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 12న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Also Read : ఇండస్ట్రీలో ప్రభాస్ బంగారం - 'ది రాజా సాబ్' అసలు హీరోయిన్ ఎవరు?... హీరోయిన్ నిధి రియాక్షన్

హారర్ థ్రిల్లర్ 'ఈషా'

అఖిల్ రాజ్, త్రిగుణ్, హెబ్బా పటేల్ కీలక పాత్రలు పోషించిన రీసెంట్ హారర్ థ్రిల్లర్ 'ఈషా'. శ్రీనివాస్ మన్నె దర్శకత్వం వహించిన ఈ మూవీని దామోదర ప్రసాద్ సమర్పణలో హేమ వెంకటేశ్వరరావు నిర్మించారు. బన్నీ వాస్, వంశీ నందిపాటి సంయుక్తంగా రిలీజ్ చేస్తుండగా... ఈ నెల 12న థియేటర్లలోకి రానుంది. హార్ట్ పేషెంట్స్, ధైర్యం లేని వారు ఈ మూవీ చూడకపోవడమే మంచిదని బన్నీ వాస్ తెలిపారు.

'ఘంటసాల' బయోపిక్

లెజెండరీ సింగర్ ఘంటసాల జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన బయోపిక్ 'ఘంటసాల'. కృష్ణ చైతన్య ఘంటసాల పాత్రలో నటించగా... మృదుల, సుమన్, సాయికిరణ్ కీలకపాత్రలు పోషించారు. ఈ మూవీ కూడా శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు రానుంది.

'నా తెలుగోడు'

హరినాథ్ పొలిచర్ల హీరోగా స్వీయ దర్శక నిర్మాణంలో రూపొందించిన సందేశాత్మక చిత్రం 'నా తెలుగోడు'. తనికెళ్ల భరణి, రఘుబాబు, జరీనా వహాబ్, రోనీ కౌలా, నైరా పాల్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ నెల 12న సినిమా థియేటర్లలో రిలీజ్ కానుంది.

సస్పెన్స్ థ్రిల్లర్ 'మిస్ టీరియస్'

రోహిత్ సహాని, అబిద్ భూషణ్, రియా కపూర్, మేఘనా రాజ్ పుత్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ సస్పెన్స్ థ్రిల్లర్ 'మిస్ టీరియస్'. ఈ నెల 12న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

యూత్ ఎంటర్టైనర్ 'ఇట్స్ ఓకే గురు'

సాయి చరణ్, ఉషశ్రీ జంటగా నటించిన లేటెస్ట్ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ 'ఇట్స్ ఓకే గురు'. క్రాంతి ప్రసాద్ నిర్మించిన ఈ మూవీ ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఓటీటీ మూవీస్/వెబ్ సిరీస్‌ల లిస్ట్

  • అమెజాన్ ప్రైమ్ వీడియో - మెర్వ్ (డిసెంబర్ 10), టెల్ మి సాఫ్టీ (డిసెంబర్ 12)
  • నెట్ ఫ్లిక్స్ - గుడ్ బై జూన్ (డిసెంబర్ 12), వేక్ అప్ డెడ్ మ్యాన్ (మూవీ - డిసెంబర్ 12), సింగిల్ పాపా (హిందీ వెబ్ సిరీస్ - డిసెంబర్ 12), మ్యాన్ వర్సెస్ బేబీ (వెబ్ సిరీస్ - డిసెంబర్ 11)
  • ఆహా - 3 రోజెస్ (తెలుగు సిరీస్ - డిసెంబర్ 12)
  • జీ5 - సాలీ మొహబ్బత్ (డిసెంబర్ 12)
  • జియో హాట్ స్టార్ - సూపర్ మ్యాన్ (మూవీ డిసెంబర్ 11)

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ప్రముఖ నేషనల్ మీడియా సంస్థ ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. పొలిటికల్, లైఫ్ స్టైల్, హెల్త్, డివోషనల్, ఎంటర్టైన్మెంట్, అగ్రికల్చర్, ఆస్ట్రాలజీ, స్పోర్ట్స్ వార్తలతో పాటు స్పెషల్ స్టోరీలు కూడా రాశారు. ప్రస్తుతం గత రెండున్నరేళ్ల నుంచి సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా వర్క్ చేస్తున్నారు.

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Mysterious Boiling Water: అరేబియా సముద్రంలో వింత- నీళ్లు ఉడుకుతూ బుడుగలు.. గుజరాత్ తీరంలో ఏం జరుగుతోంది?
అరేబియా సముద్రంలో వింత- నీళ్లు ఉడుకుతూ బుడుగలు.. గుజరాత్ తీరంలో ఏం జరుగుతోంది?
ABP Effect: దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి దుస్థితిపై ఏబీపీ దేశం కథనం - స్పందించిన జీహెచ్‌ఎంసీ - కానీ చేయాల్సింది చాలా ఉంది !
దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి దుస్థితిపై ఏబీపీ దేశం కథనం - స్పందించిన జీహెచ్‌ఎంసీ - కానీ చేయాల్సింది చాలా ఉంది !
Nirmal Road Accident: బంధువులను పరామర్శించి వస్తుంటే రోడ్డు ప్రమాదం, నలుగురి మృతి- నిర్మల్‌ జిల్లాలో ఘటన
బంధువులను పరామర్శించి వస్తుంటే రోడ్డు ప్రమాదం, నలుగురి మృతి- నిర్మల్‌ జిల్లాలో ఘటన
Telangana phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు - హరీష్ రావుకు సిట్ నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు - హరీష్ రావుకు సిట్ నోటీసులు
Advertisement

వీడియోలు

Kavitha Meetings With Prashant Kishor | తెలంగాణ రాజకీయాల్లోకి ప్రశాంత్ కిశోర్ | ABP Desam
Virat Kohli Century Ind vs NZ 3rd ODI | మూడో వన్డేలో విరాట్ సెంచరీ | ABP Desam
Ind vs NZ 3rd ODI Highlights | భారత్‌లో తొలి సిరీస్ గెలిచిన న్యూజిలాండ్ | ABP Desam
Nagoba Jatara Maha Pooja 2026 | కేస్లాపూర్ నాగోబా మహాపూజ
Nagoba Jatara 2026 | నాగోబా ఆలయం వద్ద మెస్రం వంశీయుల సాంప్రదాయ పూజలు
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mysterious Boiling Water: అరేబియా సముద్రంలో వింత- నీళ్లు ఉడుకుతూ బుడుగలు.. గుజరాత్ తీరంలో ఏం జరుగుతోంది?
అరేబియా సముద్రంలో వింత- నీళ్లు ఉడుకుతూ బుడుగలు.. గుజరాత్ తీరంలో ఏం జరుగుతోంది?
ABP Effect: దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి దుస్థితిపై ఏబీపీ దేశం కథనం - స్పందించిన జీహెచ్‌ఎంసీ - కానీ చేయాల్సింది చాలా ఉంది !
దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి దుస్థితిపై ఏబీపీ దేశం కథనం - స్పందించిన జీహెచ్‌ఎంసీ - కానీ చేయాల్సింది చాలా ఉంది !
Nirmal Road Accident: బంధువులను పరామర్శించి వస్తుంటే రోడ్డు ప్రమాదం, నలుగురి మృతి- నిర్మల్‌ జిల్లాలో ఘటన
బంధువులను పరామర్శించి వస్తుంటే రోడ్డు ప్రమాదం, నలుగురి మృతి- నిర్మల్‌ జిల్లాలో ఘటన
Telangana phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు - హరీష్ రావుకు సిట్ నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు - హరీష్ రావుకు సిట్ నోటీసులు
BJP President: బీజేపీ బాస్‌గా నితిన్ నబీన్ - నామినేషన్ ప్రక్రియలో ఏపీ నేతల కీలక పాత్ర
బీజేపీ బాస్‌గా నితిన్ నబీన్ - నామినేషన్ ప్రక్రియలో ఏపీ నేతల కీలక పాత్ర
When Did Sunday Holiday Start:ఆదివారం సెలవు దినంగా ఎప్పుడు ప్రారంభమైంది? ఇప్పుడు దాన్నే కొనసాగించడం అవసరమా?
ఆదివారం సెలవు దినంగా ఎప్పుడు ప్రారంభమైంది? ఇప్పుడు దాన్నే కొనసాగించడం అవసరమా?
Ranya Rao Father : కర్ణాటక పోలీస్ బాస్ రాసలీలల వీడియో కలకలం - ఏకంగా ఆఫీసులోనే.. సీరియస్ అయిన సీఎం!
కర్ణాటక పోలీస్ బాస్ రాసలీలల వీడియో కలకలం - ఏకంగా ఆఫీసులోనే.. సీరియస్ అయిన సీఎం!
Telangana Latest News: మహిళా సంఘాలకు గుడ్ న్యూస్ చెప్పిన భట్టి విక్రమార్క- వడ్డీ లేని రుణాలపై కీలక ప్రకటన 
మహిళా సంఘాలకు గుడ్ న్యూస్ చెప్పిన భట్టి విక్రమార్క- వడ్డీ లేని రుణాలపై కీలక ప్రకటన 
Embed widget