అన్వేషించండి

AP Police Constable Recruitment: ఏపీలో పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్ మెంట్ పూర్తి.. ఈ నెల 22 నుంచి ట్రైనింగ్ ప్రారంభం

AP Constable Recruitment: పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్ మెంట్ ఏపీ ప్రభుత్వం పూర్తి చేసింది. ఉద్యోగాలు పొందిన 5,757 మంది కానిస్టేబుళ్లకు ఈ 22 నుంచి ట్రైనింగ్ కార్యక్రమం ప్రారంభించనున్నారు.

AP Police Constable Recruitment 2025 | అమరావతి: పోలీసు శాఖలో ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న కానిస్టేబుళ్ల భర్తీ ప్రక్రియను ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పూర్తి చేసింది. గత ప్రభుత్వం వదిలేసిన కానిస్టేబుల్ పోస్టుల భర్తీని తాము విజయవంతంగా పూర్తి చేశామని కూటమి నేతలు చెబుతున్నారు. 6,100 మందిని రిక్రూట్ చేసుకునేందుకు నోటిఫికేషన్ రాగా, అందులో 6,014 మంది సెలక్ట్ అయ్యారు. తరువాత 5,757 మంది ట్రైనింగ్ కు ఎంపిక కాగా.. సివిల్ కానిస్టేబుళ్లుగా 3,343 మంది, APSP కానిస్టేబుళ్లుగా 2,414 మంది ఎంపికయ్యారు. సివిల్ విభాగంలో మహిళా కానిస్టేబుళ్లు 993 మంది ఉన్నారు. కానిస్టేబుల్ పోస్టులకు ఈ నెల 22 నుంచి ట్రైనింగ్ కార్యక్రమం ప్రారంభం అవుతుంది. 

ఎంపికైన వారితో నేడు సీఎం చంద్రబాబు సమావేశం..

ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు పోలీసు శాఖలోకొత్తగా జాయిన్ అవుతున్న వారితో మంగళవారం (డిసెంబర్ 16న) సమావేశం కానున్నారు. మంగళగిరి ఎపిఎస్పీ 6వ బెటాలియన్ ప్రాంగణంలో సాయంత్రం 5 గంటలకు ఈ కార్యక్రమం ఉంటుంది. కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక పెండింగ్ లో ఉన్న పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ ను పూర్తి చేసి ఉద్యోగాల భర్తీ చేపట్టి ప్రక్రియను పూర్తి చేసింది.

మొన్న మెగా డీఎస్సీ, నేడు కానిస్టేబుల్ పోస్టులు

కొన్ని నెలల నెలల కిందట ఏపీలో మెగా డీఎస్సీ నిర్వహించి 15,941 మందికి ఉద్యోగాలు ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. తాజాగా 6,104 పోస్టులతో పోలీసు శాఖలో కానిస్టేబుల్ పోస్టుల ఖాళీలను భర్తీ చేసింది. గత ప్రభుత్వం నిరుద్యోగ యువతను మభ్య పెట్టడానికి మొక్కుబడిగా నోటిఫికేషన్ ఇచ్చిందని కూటమి నేతలు విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ సమస్యపై దృష్టి పెట్టి యువతకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వడంతో పాటు శాంతి భద్రతల్ని పరిరక్షించడంలో పోలీసుల పాత్ర కీలకమని ప్రభుత్వం రిక్రూట్ మెంట్ ప్రక్రియ పూర్తి చేసింది. 

డిసెంబర్ 22 నుంచి ట్రైనింగ్ ప్రారంభం

పోలీస్ రిక్రూట్మెంట్ పై దాఖలైన 31 రిట్ పిటిషన్లు కోర్టుల్లో చట్టబద్ధంగా సమాధానం చెప్పి సమస్యను ఏపీ ప్రభుత్వం పరిష్కరించింది. నియామక పరీక్షలు కూడా రికార్డ్ టైమ్‌లో పారదర్శకంగా నిర్వహించారు. కేవలం 60 రోజుల్లోనే ఫలితాలు ప్రకటించారు. ఇప్పటికే అభ్యర్థులు ఆయా జిల్లాల్లో నియామక పత్రాలు అందుకున్నారు. పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ ద్వారా ఎంపికైన వారితోసీఎం చంద్రబాబు సమావేశం కానున్నారు.

కొత్తగా ఎంపికైన ఉద్యోగులు, వారి తల్లిదండ్రులు కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతారు. పోలీసు శాఖలోకి కొత్తగా వస్తున్న వారికి స్వాగతం పలికేందుకు, వారికి మార్గనిర్దేశం నింపడానికి సీఎం చంద్రబాబు ఈ కార్యక్రమానికి హాజరు అవుతున్నారు. డిసెంబర్ 22 నుంచి పోలీస్ కానిస్టేబుళ్లకు ట్రైనింగ్ ప్రక్రియ మొదలు కాబోతోంది.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

AP Job Calendar: 10,060 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. ఏపీ జాబ్‌ క్యాలెండర్‌ వచ్చేసింది
10,060 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. ఏపీ జాబ్‌ క్యాలెండర్‌ వచ్చేసింది
AP DSC Notification 2026: ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
Nara Lokesh About Mega DSC: 148 రోజుల్లోనే డీఎస్సీ నియామకాలు పూర్తి, వైసీపీ విమర్శలకు టీచర్లే కౌంటర్ ఇచ్చారు
148 రోజుల్లోనే డీఎస్సీ నియామకాలు పూర్తి, వైసీపీ విమర్శలకు టీచర్లే కౌంటర్ ఇచ్చారు
DSC Teachers Rally: విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Job Calendar: 10,060 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. ఏపీ జాబ్‌ క్యాలెండర్‌ వచ్చేసింది
10,060 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. ఏపీ జాబ్‌ క్యాలెండర్‌ వచ్చేసింది
CM Chandrababu: వచ్చే నెలలో అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు! ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!
వచ్చే నెలలో అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు! ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!
Veligonda Project: వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
Sheik Sadiq Khan Arrest: పంచాయతీరాజ్ ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో కీలక ముందడుగు! ఢిల్లీలో చిక్కిన రైఫిల్ షూటింగ్ కోచ్‌ సాధిక్ ఖాన్!
పంచాయతీరాజ్ ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో కీలక ముందడుగు! ఢిల్లీలో చిక్కిన రైఫిల్ షూటింగ్ కోచ్‌ సాధిక్ ఖాన్!
Lok Sabha Delimitation Freeze: డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
iPhone Crimes India: ఐఫోన్ మోజులో ముక్కలవుతున్న భారతీయ కుటుంబాలు! రోజురోజుకు పెరుగుతున్న హత్యలు, ఆత్మహత్యలు!
ఐఫోన్ మోజులో ముక్కలవుతున్న భారతీయ కుటుంబాలు! రోజురోజుకు పెరుగుతున్న హత్యలు, ఆత్మహత్యలు!
Revanth Reddy US Tour Cancellation : రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
Deepika Padukone : ప్రభాస్ స్పిరిట్ కాంట్రవర్సీపై దీపికా పదుకోన్ రియాక్షన్ - ఒక్క లైక్‌తో...
ప్రభాస్ స్పిరిట్ కాంట్రవర్సీపై దీపికా పదుకోన్ రియాక్షన్ - ఒక్క లైక్‌తో...
Embed widget