అన్వేషించండి

Yamaha XSR155 రియల్ వరల్డ్ మైలేజ్ ఎంత? సిటీలో, హైవే మీద ఎంత ఇచ్చింది?

Yamaha XSR155 రియల్ వరల్డ్ మైలేజ్ టెస్ట్‌లో ఎంత ఇచ్చింది? సిటీ, హైవే ఫ్యూయల్ ఎఫిషియెన్సీ వివరాలు, ఇంజిన్ విశ్లేషణ పూర్తి కథనం.

Yamaha XSR155 Mileage: తెలుగు యువత చాలా కాలంగా ఎదురుచూస్తున్న Yamaha XSR155 చివరకు మన మార్కెట్‌లోకి వచ్చింది. MT-15, R15 లతో ఒకే ఇంజిన్‌, ఒకే ప్లాట్‌ఫామ్‌ను పంచుకుంటూ వచ్చిన ఈ స్పోర్టీ నియో రెట్రో బైక్ గురించి రైడర్లలో ప్రధానంగా ఉన్న ప్రశ్న – "కంపెనీ చెప్పిన లెక్కలు కాకుండా, నిజ జీవితంలో ఈ బండి ఎంత మైలేజ్ ఇస్తుంది?". ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవడానికి, Yamaha XSR155ను ఎక్స్‌పర్ట్‌లు రియల్ వరల్డ్ పరిస్థితుల్లో టెస్ట్‌ చేశారు.

Yamaha XSR155 రియల్ వరల్డ్ మైలేజ్ ఫలితాలు

టెస్టింగ్ విధానం ప్రకారం, ముందుగా బైక్ ట్యాంక్‌ను పూర్తిగా నింపి, కంపెనీ సూచించిన విధంగానే టైర్ ప్రెషర్‌లో ఉంచి నడిపారు.

హైవే మైలేజ్ టెస్ట్
ముందుగా, విశాలమైన హైవే మీద సుమారు 50 కిలోమీటర్లకు పైగా XSR155ను ఎక్స్‌పర్ట్‌ రైడర్లు నడిపారు. ఆ తర్వాత మళ్లీ ట్యాంక్ నింపినప్పుడు 1.1 లీటర్ పెట్రోల్ అవసరమైంది. దీని ఆధారంగా లెక్కిస్తే, హైవే మీద ఈ బైక్ ఇచ్చిన మైలేజ్
ప్రతి లీటరుకు 51.7 కిలోమీటర్లు.

సిటీ మైలేజ్ టెస్ట్
తర్వాత సౌత్ ముంబైలోని ట్రాఫిక్‌తో నిండిన రోడ్లపై దాదాపు 50 కిలోమీటర్ల లోపు రైడ్ చేశారు. ఈసారి ట్యాంక్ టాప్ అప్ చేయడానికి (తిరిగి నింపడానికి) కేవలం 0.96 లీటర్ పెట్రోల్ సరిపోయింది. దీంతో సిటీ మైలేజ్ ప్రతి లీటర్‌కు 50.3 కిలోమీటర్లు అని తేలింది.

మొత్తం సగటు మైలేజ్
సిటీ + హైవే కలిపి చూస్తే, సగటున, లీటర్‌కు 50 కిలోమీటర్లు ఈ బండి ఇచ్చింది. ఈ సంఖ్యలు 155cc సెగ్మెంట్‌లో నిజంగా అద్భుతమైనవే.

Yamaha XSR155 ఫ్యూయల్ ఎఫిషియెన్సీ ఎందుకు బాగుంది?

Yamaha 155సీసీ లిక్విడ్ కూల్డ్ బైక్‌లు ఎప్పటి నుంచో మంచి మైలేజ్‌కు పేరుగాంచాయి. XSR155 కూడా అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తోంది. ఈ బైక్‌లో ఉన్న 155సీసీ లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ MT-15తో ఒకే గేరింగ్‌ను ఉపయోగిస్తుంది. కానీ ముఖ్యమైన విషయం ఏంటంటే, XSR155 బరువు కేవలం 137 కిలోలు మాత్రమే. ఇది MT-15తో పోలిస్తే సుమారు 4 కిలోలు తక్కువ. తక్కువ బరువు అంటే ఇంజిన్‌పై తక్కువ లోడ్, మైలేజ్ మెరుగ్గా రావడం సహజం.

ఇంకో ముఖ్యమైన అంశం 6 స్పీడ్ గేర్‌బాక్స్. గేర్ రేషియోలు చాలా బాగా సెట్ చేశారు. హైవే మీద గంటకు 80 కిలోమీటర్ల వేగంతో (టెస్ట్ జరిగిన రోడ్డు మీద లీగల్ లిమిట్) వెళ్తున్నప్పుడు కూడా ఇంజిన్ తన స్వీట్ స్పాట్‌లోనే ఉంది. ఇది కూడా ఫ్యూయల్ ఎఫిషియెన్సీ పెరగడానికి కారణం.

Yamaha XSR155 ఫ్యూయల్ ఎఫిషియెన్సీ టెస్ట్ ఎలా జరిగింది?

  • టెస్టింగ్ ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా సాగింది.
  • ముందుగా ట్యాంక్‌ను పూర్తిగా నింపారు.
  • టైర్ ప్రెషర్‌ను కంపెనీ సూచించిన స్థాయిలో ఉంచారు
  • ముందుగానే ఫిక్స్ చేసిన సిటీ, హైవే రూట్లపై బైక్‌ను నడిపారు
  • నిజ జీవితానికి దగ్గరగా ఉండే సగటు వేగాలను పాటించారు
  • రెండు రకాల రోడ్లపై రైడర్ బరువు, లోడ్ అన్నీ సమానంగా ఉంచారు
  • టెస్ట్ ముగిసిన తర్వాత మళ్లీ ట్యాంక్ పూర్తిగా నింపి, ఎంత పెట్రోల్ ఖర్చైంది అనే దాని ఆధారంగా ఖచ్చితమైన మైలేజ్ లెక్కించారు.

ముగింపు

Yamaha XSR155 కేవలం లుక్‌లకే కాదు, మైలేజ్ విషయంలో కూడా బలమైన బైక్ అని ఈ టెస్ట్ స్పష్టంగా చూపించింది. రోజువారీ ప్రయాణాలు, హైవే రైడ్స్ రెండింటికీ మంచి బ్యాలెన్స్ కావాలనుకునే వారికి ఇది ఖచ్చితంగా ఒక ఆకర్షణీయమైన ఎంపిక.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

టాప్ హెడ్ లైన్స్

2026 Skoda Slavia ఫేస్‌లిఫ్ట్‌ మోడల్‌లో భలే అప్‌డేట్స్‌.. వెనుక సీట్‌లో కూర్చున్నవాళ్లకు మంచి మసాజ్‌!
2026 Skoda Slavia ఫేస్‌లిఫ్ట్‌.. కొత్త ఫీచర్లతో అదరగొడుతున్న సెడాన్! బుకింగ్స్‌ ప్రారంభం
రూ.1 లక్ష చెల్లించి Renault Kwid కొంటే, ప్రతినెలా EMI ఎంత కట్టాలి
రూ.1 లక్ష చెల్లించి Renault Kwid కొంటే, ప్రతినెలా EMI ఎంత కట్టాలి
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Yamaha R15 కంటే పవర్‌ఫుల్‌.. ధర రూ.2 లక్షలు! ఆగస్టు 27న వస్తున్న R2పై భారీ అంచనాలు
Yamaha R2లో 220cc ఇంజిన్‌! - ఈ స్పోర్ట్స్‌ బైక్‌లో ఇంకా ఎలాంటి అద్భుతాలు ఉండొచ్చు?

వీడియోలు

Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nalgonda crime news:నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
Tamil Nadu CM Vijay: చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
Kolkata Hotel Fire Accident: కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
LPG to PNG Shift: LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
NTR Trivikram Movie Title: గాడ్ ఆఫ్ వార్ కాదు... త్రివిక్రమ్ మార్క్ టచ్‌తో మరో క్రేజీ టైటిల్
గాడ్ ఆఫ్ వార్ కాదు... త్రివిక్రమ్ మార్క్ టచ్‌తో మరో క్రేజీ టైటిల్
Prabhas: ప్రభాస్ 'స్పిరిట్' వాయిదా? 'ఫౌజీ'కి నెట్‌ఫ్లిక్స్ డెడ్‌లైన్!?
ప్రభాస్ 'స్పిరిట్' వాయిదా? 'ఫౌజీ'కి నెట్‌ఫ్లిక్స్ డెడ్‌లైన్!?
Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
Rajkumari Dayana: సోషల్ మీడియా నెగెటివిటీని ఎదిరించి బిగ్ బాస్ వరకు.. రాజకుమారి దయానా రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు
సోషల్ మీడియా నెగెటివిటీని ఎదిరించి బిగ్ బాస్ వరకు.. రాజకుమారి దయానా రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు
Embed widget