అన్వేషించండి

Arjuna Ranatunga: వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ అర్జున రణతుంగపై అరెస్ట్ వారెంట్ జారీ.. ఏ క్షణంలోనైనా అరెస్ట్

Sri Lanka Oil Scam: 1996 వన్డే ప్రపంచ కప్ విజేత, శ్రీలంక కెప్టెన్ అర్జున రణతుంగ అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది. ఆయన అరెస్టుకు శ్రీలంక కోర్టు వారెంట్ జారీ చేసింది.

శ్రీలంకకు 1996 ప్రపంచ కప్ అందించిన కెప్టెన్ అర్జున రణతుంగ అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది. పెట్రోలియం మంత్రిగా చేసిన సమయంలో అవినీతి ఆరోపణలపై రణతుంగను అరెస్టు చేయవచ్చని సోమవారం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. రణతుంగతో పాటు ఆయన సోదరుడు చమురు కొనుగోలు ఒప్పందం ఇచ్చే ప్రక్రియను మార్చారని, ఎక్కువ ఖర్చు చేశారని ఆరోపణలు ఉన్నాయి.

శ్రీలంకకు భారీ నష్టం..

అవినీతిపై నిఘా ఉంచే సంస్థ ప్రకారం, మొత్తం 27 సార్లు చమురు కొనుగోలు జరిగింది. ఈ ఒప్పందాలు, కొనుగోళ్ల కారణంగా దేశానికి దాదాపు 80 కోట్ల రూపాయలు నష్టం వాటిల్లింది. ఈ మొత్తం భారత కరెన్సీలో దాదాపు 23.5 కోట్లకు సమానం. అవినీతి ఆరోపణలపై విచారణ కోసం ఏర్పాటు చేసిన కమిషన్ ప్రకారం 2017లో ఈ కొనుగోలు జరిగింది.

విచారణ కోసం ఏర్పాటు చేసిన కమిషన్ కొలంబో మేజిస్ట్రేట్‌కు రణతుంగ విదేశాల్లో ఉన్నారని, తిరిగి వచ్చిన తర్వాత అరెస్టు చేస్తామని తెలిపింది. పెట్రోలియం మాజీ మంత్రి అర్జున రణతుంగ సోదరుడు ధమిక రణతుంగను పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. అనంతరం ధమికను బెయిల్‌పై విడుదల చేశారు. ధమిక రణతుంగ ఆ కొనుగోలు సమయంలో ప్రభుత్వ అధికారాల పరిధిలోని సిలోన్ పెట్రోలియం కార్పొరేషన్ ఛైర్మన్‌గా వ్యవహరించారని తెలిసిందే.

ధమిక రణతుంగ ట్రావెల్ నిషేధం..

మేజిస్ట్రేట్ ధమిక ప్రయాణాలపై నిషేధం విధించారు. ఆయనకు శ్రీలంక, యుఎస్‌ఏలలో సైతం పౌరసత్వం ఉంది. ఈ కేసు తదుపరి విచారణ మార్చి 13న జరగనుంది. మాజీ క్రికెటర్ అర్జున రణతుంగ సోదరుడు ప్రసన్నను గత నెలలో బీమా మోసం కేసులో అరెస్టు అయ్యాడు. ఆ కేసు ఇంకా పెండింగ్‌లో ఉంది. అయితే జూన్ 2022లో ఒక వ్యాపారవేత్తను బెదిరించి బలవంతంగా వసూళ్లు చేసిన కేసులో ప్రసన్నను దోషిగా తేల్చారు. ప్రసన్న గతంలో శ్రీలంక పర్యాటక మంత్రిగా పనిచేశారు.

కాగా, 1996 ప్రపంచ కప్ ఫైనల్‌లో అర్జున రణతుంగ కెప్టెన్‌గా ఉన్న శ్రీలంక జట్టు పటిష్ట ఆస్ట్రేలియా జట్టును 7 వికెట్ల తేడాతో ఓడించి చరిత్ర సృష్టించింది. తొలిసారి వన్డే వరల్డ్ కప్ సొంతం చేసుకుంది. భారత్, పాకిస్తాన్ తరువాత ఈ ఘనత సాధించిన మూడో ఆసియా జట్టుగా నిలిచింది.

Also Read: BCCI Big Update: టీమ్ ఇండియా స్టార్ క్రీడాకారులకు కొత్త రూల్‌ అమలు! 15 ఏళ్ల తర్వాత బరిలోకి రోహిత్, కోహ్లీ

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Kakinada AM Green Energy: గ్లోబల్ గ్రీన్ ఎనర్జీ హబ్‌గా ఏపీ - కాకినాడలో అతిపెద్ద అమ్మోనియా ప్లాంట్‌ - చంద్రబాబు, పవన్ కీలక వ్యాఖ్యలు
గ్లోబల్ గ్రీన్ ఎనర్జీ హబ్‌గా ఏపీ - కాకినాడలో అతిపెద్ద అమ్మోనియా ప్లాంట్‌ - చంద్రబాబు, పవన్ కీలక వ్యాఖ్యలు
TTD Darshan Tickets: తిరుమల శ్రీవారి భక్తులకు గమనిక.. దర్శన, సేవా టికెట్ల విడుదల షెడ్యూల్ వచ్చేసింది
తిరుమల శ్రీవారి భక్తులకు గమనిక.. దర్శన, సేవా టికెట్ల విడుదల షెడ్యూల్ వచ్చేసింది
Telangana News: దివ్యాంగుల వివాహ ప్రోత్సాహక నగదు రూ.2 లక్షలకు పెంపు: మంత్రి అడ్లూరి లక్ష్మణ్
దివ్యాంగుల వివాహ ప్రోత్సాహక నగదు రూ.2 లక్షలకు పెంపు: మంత్రి అడ్లూరి లక్ష్మణ్
Manaswini Balabommala: శాస్త్రీయ నృత్యం, సంగీతం నుంచి సినిమాల్లోకి... 'కొక్కోరోకో'లో మనస్విని బాలబొమ్మల
శాస్త్రీయ నృత్యం, సంగీతం నుంచి సినిమాల్లోకి... 'కొక్కోరోకో'లో మనస్విని బాలబొమ్మల
Advertisement

వీడియోలు

Vande Bharat Sleeper Train Started | పచ్చ జెండా ఊపి వందేభారత్ స్లీపర్ ను ప్రారంభించిన ప్రధాని మోదీ | ABP Desam
WPL 2026 RCB vs GG Highlights | హ్యాట్రిక్ కొట్టిన బెంగళూరు!
Ashwin about India vs New Zealand | టీమ్ సెలక్షన్ పై అశ్విన్ ఘాటు వ్యాఖ్యలు
Manoj Tiwari about Rohit Sharma Captaincy | రోహిత్ కెప్టెన్సీపై మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు
Ind vs NZ Rohit Sharma Records | మరో రికార్డుకు చేరువలో రోహిత్ శర్మ
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kakinada AM Green Energy: గ్లోబల్ గ్రీన్ ఎనర్జీ హబ్‌గా ఏపీ - కాకినాడలో అతిపెద్ద అమ్మోనియా ప్లాంట్‌ - చంద్రబాబు, పవన్ కీలక వ్యాఖ్యలు
గ్లోబల్ గ్రీన్ ఎనర్జీ హబ్‌గా ఏపీ - కాకినాడలో అతిపెద్ద అమ్మోనియా ప్లాంట్‌ - చంద్రబాబు, పవన్ కీలక వ్యాఖ్యలు
TTD Darshan Tickets: తిరుమల శ్రీవారి భక్తులకు గమనిక.. దర్శన, సేవా టికెట్ల విడుదల షెడ్యూల్ వచ్చేసింది
తిరుమల శ్రీవారి భక్తులకు గమనిక.. దర్శన, సేవా టికెట్ల విడుదల షెడ్యూల్ వచ్చేసింది
Telangana News: దివ్యాంగుల వివాహ ప్రోత్సాహక నగదు రూ.2 లక్షలకు పెంపు: మంత్రి అడ్లూరి లక్ష్మణ్
దివ్యాంగుల వివాహ ప్రోత్సాహక నగదు రూ.2 లక్షలకు పెంపు: మంత్రి అడ్లూరి లక్ష్మణ్
Manaswini Balabommala: శాస్త్రీయ నృత్యం, సంగీతం నుంచి సినిమాల్లోకి... 'కొక్కోరోకో'లో మనస్విని బాలబొమ్మల
శాస్త్రీయ నృత్యం, సంగీతం నుంచి సినిమాల్లోకి... 'కొక్కోరోకో'లో మనస్విని బాలబొమ్మల
World largest Shiva lingam: ప్రపంచంలోనే అతిపెద్ద శివలింగం ప్రతిష్ఠాపన - బీహార్‌లో సనాతన వారసత్వానికి చారిత్రాత్మక ఘట్టం
ప్రపంచంలోనే అతిపెద్ద శివలింగం ప్రతిష్ఠాపన - బీహార్‌లో సనాతన వారసత్వానికి చారిత్రాత్మక ఘట్టం
Tata Punch Facelift ఏ వేరియంట్ మీ మనీకి విలువైన ఎంపిక.. ధర, ఫీచర్లు ఇవే
Tata Punch Facelift ఏ వేరియంట్ మీ మనీకి విలువైన ఎంపిక.. ధర, ఫీచర్లు ఇవే
Sankranti Feast: కొత్త అల్లుడికి ఏకంగా 1574 రకాల వంటకాలతో భారీ విందు.. గోదారోళ్లా మజాకానా..
కొత్త అల్లుడికి ఏకంగా 1574 రకాల వంటకాలతో భారీ విందు.. గోదారోళ్లా మజాకానా..
Rahul Gandhi On Rohit Vemula Act:
"రోహిత్ వేముల చట్టం కోసం ఊరూవాడా, విద్యార్థులంతా కదలాలి" సంచలన ట్వీట్ చేసిన రాహుల్ గాంధీ
Embed widget