Lionel Messi India Tour: మెస్సీ హైదరాబాద్‌లో ఆడకపోవడానికి కారణం తెలిస్తే షాక్ అవుతారు! అతని కాళ్ల విలువ ఎంతో తెలుసా?
Lionel Messi: ఫుట్ బాల్ దిగ్గజం.. గ్రేట్ లియోనల్ మెస్సీ ఇండియాకు వస్తున్నాడు అంటే.. అత్యద్భుతమైన అతని ఆటను చూడొచ్చని అభిమానులు ఆశపడ్డారు. కానీ మెస్సీ ఒక్క మ్యాచ్‌లో కూడా ఎందుకు ఆడలేదో తెలుసా..?

Lionel Messi GOAT Tour India: లియోనల్ మెస్సీ మన గడ్డ మీద అడుగుపెడుతున్నాడు అంటే ఫుట్ బాల్ అభిమానులంతా అతని ఆటను చూడొచ్చు అని ఆశపడ్డారు. ప్రంపంచంలో అత్యధిక మంది వీక్షించే ఈ గేమ్‌లో GOAT వస్తున్నాడు అంటే... కళ్ల ముందే మాయచేసే అతని పాదాల మాయాజాలాన్ని ప్రత్యక్షంగా చూడొచ్చని సగటు అభిమాని ఆశపడ్డాడు. హైదరాబాద్‌లో మెస్సీకి..తెలంగాణ సీఎంకు మ్యాచ్ ఉంటుందని కూడా ప్రచారం చేశారు. కానీ మెస్సీ మన హైదరాబాద్‌లోనే కాదు.. కోల్‌కతా, ముంబైలలో ఎక్కడా మ్యాచ్ ఆడలేదు. పుట్‌బాల్ అంటే పిచ్చి ఉన్న కోల్‌కతా ప్రేక్షకులైతే.. మైదానాన్ని ధ్వంసం చేసి పడేశారు. జనాలు అంత అశపడుతున్నా.. మెస్సీ ఎందుకు కాలు కదపలేదు. ఎంత గ్రేటెస్ట్ అయితే మాత్రం అంత ఈగోనా.. ? (అని మనకు అనిపించడం సహజం)
మెస్సీ మ్యూచ్ ఆడకపోవడానికి కారణమిదే..!
హైదరాబాద్‌లో అయినా కోల్‌కతానే కాదు.. ఇంకెక్కడా మెస్సీ ఎగ్జిబిషన్ మ్యాచ్‌లు ఆడడు. దీనికి కారణం ఈగో కాదు ..దీనికి అనేక ఆర్థిక లావాదేవిలు, స్పోర్ట్స్ మేనెజ్‌మెంట్, రిస్క్ అసెస్‌మెంట్, ఇన్సూరెన్స్ ఇలా చాలా కారణాలున్నాయి. మెస్సీ అనే వ్యక్తి కేవలం ఓ ఫుట్ బాలర్ కాదు. అతను వేల కోట్ల రూపాయల అసెట్. అతని ప్రతీ అడుగూ కొన్ని వందల కోట్లతో ముడిపడి ఉంటుంది. అతను మాట్లాడినా.. కాలు కదిపినా లేదా కదపకపోయినా.. చాలా “లెక్కలు” ఉంటాయి. ఖాళీగానే ఉన్నాడు కదా.. ట్రాక్ ప్యాంట్ ఎందుకు.. ? షార్ట్స్ వేసుకుని వచ్చేయొచ్చుగా అన్నట్లు ఉండదు.
మెస్సీ పాదాల ఇన్సూరెన్స్ 9వేల కోట్లు..!
అవును.. .మీరు చదివింది నిజమే.. మెస్సీ పాదాల విలువ 1 బిలియన్ డాలర్.. అక్షరాలా 9వేల కోట్లు. అందులో ఎడమపాదానికే 7వేల కోట్ల ఇన్సూరెన్స్ ఉందని అంచనా. మెస్సీ కాళ్లు సాధారణ కాళ్లు కావు. అంతర్జాతీయ స్పోర్ట్స్ ఇన్సూరెన్స్ అంచనాల ప్రకారం, అతని కెరీర్‌లో వివిధ దశల్లో మెస్సీ కాళ్లకు సుమారు 700 మిలియన్ డాలర్ల నుంచి 1 బిలియన్ డాలర్ల వరకు ఇన్సూరెన్స్ ఉందని అంచనా. ఈ సంఖ్యలు అధికారికంగా బయటకు రావు. కానీ విలువ ఎంత భారీదో చెప్పడానికి ఇవే చాలు.

ఈ ఇన్సూరెన్స్ ఎందుకోసం?
మెస్సీ లాంటి ఆటగాడి పైన కొన్ని వేల కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుంది. అతన్ని స్పాన్సర్ చేస్తున్న క్లబ్, అతని ఎండార్స్‌మెంట్లు, మ్యాచ్‌లు, బ్రాడ్‌కాస్టింగ్ రైట్స్ ఇలా ఎక్కడ చూసినా కోట్ల డాలర్లు ఉంటాయి. అలాంటి వ్యక్తికి చిన్న గాయమైతే.. చాలు మొత్తం మునిగిపోతాయి. అందుకే దీని నుంచి రక్షణ కోసం భారీ ప్రీమియంతో పాలసీలు తీసుకుంటారు. కెరీర్‌ను ముగించేంత పెద్ద గాయాలు, దీర్ఘకాలిక గాయాల నుంచి ఈ పాలసీలు కాపాడతాయి.
అదే అసలు ట్విస్ట్
ఇన్సూరెన్స్ ఉందికదా.. ఇక ఆడటానికి ఏమైంది అనుకోవచ్చు. ఈ బీమా అనేది అధికారిక మ్యాచ్‌లు, యూరో లీగ్ వంటి పెద్ద వాటికే కవర్ అవుతుంది. దేశాల మధ్య పోటీలు, ప్రతిష్టాత్మక లీగ్‌మ్యాచ్‌లకు ..వాటి ప్రాక్టీస్ సెషన్లు క్లబ్ అనుమతించిన ట్రైనింగ్ సెషన్లు—వంటి వాటికి మాత్రమే ఇవి వర్తిస్తాయి. అయితే ఎగ్జిబిషన్, చారిటీ, ప్రమోషనల్ మ్యాచ్‌లు మాత్రం ఈ పరిధిలోకి ఆటోమేటిగ్‌గా వచ్చేయవు.
ఎగ్జిబిషన్ మ్యాచ్‌ను కవర్ చేయాలంటే క్లబ్, మెడికల్ టీమ్, ఇన్సూరెన్స్ కంపెనీ—మూడు కలిసి ప్రత్యేక అనుమతి ఇవ్వాలి. అదనంగా కోట్లలో ప్రీమియం చెల్లించాలి. అంతా చేసినా రిస్క్ మాత్రం అలాగే ఉంటుంది. ఇలాంటి మ్యాచ్‌లతో గాయం అయితే కేరీర్ మొత్తం ఆగిపోతుంది. అది మెస్సీ ఒక్కడికే ఇబ్బంది కాదు. కొన్ని వేల కోట్ల రూపాయల వ్యాపారా సామ్రాజ్యం దెబ్బతింటుంది. అందుకే పెద్దగా ప్రయోజనం లేని ఎగ్జిబిషన్ చారిటీ మ్యాచ్‌ల కోసం క్లబ్‌లు మెస్సీ లాంటి ఆటగాడితో రిస్కులు చేయవ్.. కాబట్టి చాలా కఠినంగా ఈ మ్యాచ్‌లకు ‘నో’ చెబుతారు,
మెస్సీ లాంటి ఆటగాడు.. వన్ టైమ్ వండర్ కాదు.. ఈ ఒక్కరోజుకే స్టార్ కాదు. అతనొక లాంగ్‌టర్మ్.. హై రిటర్న్ అసెట్. బిజినెస్ పరిభాషలో అతనొక ఆస్తి.. అతనే ఓ ఆర్థిక వ్యవస్థ. కాబట్టి అలాంటి వ్యవస్థను కాపాడేందుకు అన్ని ప్రయత్నాలూ జరుగుతాయి. ఇదంతా మనం షార్ట్స్ వేసుకుని.. బూట్లు తగిలించుకుని గ్రౌండ్‌లోకి దిగినంత ఈజీ కాదు.





















