అన్వేషించండి

Kerala Assembly Elections 2026: కేరళ కాంగ్రెస్‌లో సీఎం సెగ - వేణుగోపాల్ రాకతో ముదురుతున్న గ్రూపు రాజకీయాలు!

KV Venugopal: కాంగ్రెస్ హైకమాండ్ లో అత్యంత కీలక నేత కేసీ వేణుగోపాల్. ఆయన ఢిల్లీ రాజకీయాలకే ఎక్కువగా పరిమితం. కానీ ఇప్పుడు సీఎం కావాలనుకుంటున్నారు.

Kerala Congress : కేరళ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ లో నాయకత్వ సెగలు పీక్ స్టేజ్‌కు చేరుకున్నాయి. అధికార ఎల్‌డీఎఫ్‌పై ఉన్న వ్యతిరేకతను ఓట్లుగా మార్చుకోవాల్సిన సమయంలో,  తదుపరి ముఖ్యమంత్రి ఎవరు  అనే ప్రశ్న పార్టీలో కొత్త చిచ్చు పెట్టింది. ముఖ్యంగా ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ పేరు సీఎం రేసులోకి రావడం, దశాబ్దాలుగా రాష్ట్ర రాజకీయాల్లో పాతుకుపోయిన సీనియర్ నేతలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది.  

కేరళలో పార్టీని నడిపిస్తున్న లోకల్ లీడర్స్              

ప్రస్తుతం కేరళ కాంగ్రెస్‌లో ప్రతిపక్ష నేత వి.డి. సతీశన్, కేపీసీసీ అధ్యక్షుడు కె. సుధాకరన్ ద్వయం పార్టీని నడిపిస్తోంది. వీరిద్దరూ గత కొంతకాలంగా క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ పార్టీ క్యాడర్‌లో ఉత్సాహం నింపుతున్నారు. అయితే, వేణుగోపాల్ అభ్యర్థిత్వంపై వస్తున్న వార్తలు వీరి ప్రాధాన్యతను దెబ్బతీసేలా ఉన్నాయి.  మేము కష్టపడి పంట పండిస్తే, కోత కోయడానికి ఢిల్లీ నుండి ఎవరో వస్తామంటే ఎలా అన్న చందంగా స్థానిక నేతల అసంతృప్తి ఉంది. ఇప్పటికే పలువురు నేతలు తమకు కేసీ వేణుగోపాల్ సారథ్యం ఆమోదయోగ్యం కాదని అంతర్గత సమావేశాల్లో కుండబద్దలు కొట్టినట్లు తెలుస్తోంది.

కేరళ కాంగ్రెస్ లో ఎన్నో గ్రూపులు           

కేరళ కాంగ్రెస్‌కు పాత జబ్బు అయిన ‘ఐ’ కాంగ్రెస్  ‘ఎ’ గ్రూపుల పోరు ఈ పరిణామంతో మళ్లీ తెరపైకి వచ్చింది. గతంలో ఉమెన్ చాందీ, రమేష్ చెన్నితాల వంటి ఉద్దండులు నడిపిన ఈ గ్రూపులు.. ఇప్పుడు వేణుగోపాల్ రాకను అడ్డుకోవడంలో ఒక్కటవుతాయా లేక కొత్త గ్రూపులు పుట్టుకొస్తాయా అనేది ఉత్కంఠ రేపుతోంది. క్షేత్రస్థాయిలో పట్టున్న సతీశన్ వర్గం తమ పట్టును వదులుకోవడానికి సిద్ధంగా లేదు. మరోవైపు, వేణుగోపాల్ మాత్రం తాను పోటీలో లేనని పైకి చెబుతున్నా, అభ్యర్థుల ఎంపికలో  మెరిటోక్రసీ ఉండాలని ఆయన చేస్తున్న వ్యాఖ్యలు.. పరోక్షంగా పాత తరాన్ని పక్కన పెట్టి తన మార్కు చూపించే ప్రయత్నమేనని ప్రత్యర్థులు ఆరోపిస్తున్నారు.

కాంగ్రెస్ అంతర్గత రాజకీయాల్ని అనుకూలంగా మలుచుకుంటున్న లెఫ్ట్ 

ఈ నాయకత్వ గందరగోళాన్ని అధికార లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్  తనకు అనుకూలంగా మార్చుకునేందుకు వ్యూహాలు రచిస్తోంది.  ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరో కూడా తేల్చుకోలేని కూటమి రాష్ట్రాన్ని ఎలా పాలిస్తుంది  అంటూ ఇప్పటికే పినరయి విజయన్  విమర్శలు మొదలు పెట్టారు. కాంగ్రెస్‌లోని ఈ అంతర్గత కుమ్ములాటలు ఓటర్లలో ప్రతికూల సంకేతాలను పంపే అవకాశం ఉందని హైకమాండ్ ఆందోళన చెందుతోంది. ఒకవేళ నాయకత్వ సమస్యను ముందుగా తేల్చకపోతే, గత ఎన్నికల్లో లాగే ఈసారి కూడా చేతికి వచ్చిన విజయం చేజారిపోయే ప్రమాదం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.

 కేరళలో కాంగ్రెస్ గెలవాలంటే కేవలం అధికార వ్యతిరేకత సరిపోదు, అంతర్గత ఐక్యత కూడా అత్యవసరం. కేసీ వేణుగోపాల్‌ను  సేవియర్  గా చూపిస్తారా లేక స్థానిక నేతలకు పట్టం కడతారా అనే నిర్ణయంపైనే యూడీఎఫ్ భవిష్యత్తు ఆధారపడి ఉంది. ఢిల్లీ నుండి వచ్చే ఆదేశాలు తిరువనంతపురంలోని కార్యకర్తల మనసు గెలుచుకోకపోతే, కేరళలో కాంగ్రెస్ ప్రస్థానం మరోసారి ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉంది. 

టాప్ హెడ్ లైన్స్

Actress Trisha Controversy: త్రిష చుట్టూ తిరుగుతున్న తమిళ రాజకీయం - డిప్యూటీ సీఎంను ను చేస్తారా?
త్రిష చుట్టూ తిరుగుతున్న తమిళ రాజకీయం - డిప్యూటీ సీఎంను ను చేస్తారా?
Defection MLAs: అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
Agri Gold Victims: అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేసే దిశగా ప్రభుత్వం - ఆస్తులు వేలం వేసి చెల్లింపులు - ఆటంకాలు లేకుండా పూర్తి చేయగలరా?
అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేసే దిశగా ప్రభుత్వం - ఆస్తులు వేలం వేసి చెల్లింపులు - ఆటంకాలు లేకుండా పూర్తి చేయగలరా?
Tesseract Company Land Allocation Controversy: రేవంత్ సోదరులే టార్గెట్‌గా బీఆర్ఎస్ పొలిటికల్ మైండ్‌గేమ్ - టెస్సరాక్ట్ భూముల వివాదంలో కాంగ్రెస్ డిఫెన్స్‌లో పడిందా?
రేవంత్ సోదరులే టార్గెట్‌గా బీఆర్ఎస్ పొలిటికల్ మైండ్‌గేమ్ - టెస్సరాక్ట్ భూముల వివాదంలో కాంగ్రెస్ డిఫెన్స్‌లో పడిందా?

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Adilabad Latest News: నిరుపేదలకు ఇందిరమ్మ గృహాలు మంజూరు చేసిన కలెక్టర్! గూడానికి ఆయన పేరు పెట్టిన గిరిజనం!
నిరుపేదలకు ఇందిరమ్మ గృహాలు మంజూరు చేసిన కలెక్టర్! గూడానికి ఆయన పేరు పెట్టిన గిరిజనం!
Pocharam Srinivas Reddy:
"అన్నం పెట్టిన కేసీఆర్‌ను మర్చిపోలేను" బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు 
Pawan Kalyan Latest Look:విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
AP Municipal Elections 2026: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
Toyota Hiluxకు గట్టి పోటీ.. Mahindra Scorpio N Pickupలో ఇవన్నీ ఉంటాయా?
మహీంద్రా స్కార్పియో N పికప్‌: ఆగస్టు 14న గ్రాండ్ డెబ్యూ.. టీజర్‌తో రచ్చ మొదలు
NTR Surgery : ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
Defection MLAs: అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
Anupama Parameswaran : రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
Embed widget