Rajendra Prasad : మళ్లీ నోరు జారిన రాజేంద్ర ప్రసాద్ - స్టేజ్‌పై అలా మాట్లాడతారా అంటూ...
Rajendra Prasad Reaction : సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ మరోసారి నోరు జారారు. కాంతారావు అవార్డుల ఈవెంట్‌లో ఆయన గొప్పతనాన్ని వివరిస్తూ... తమిళ నటుడు ఎంజీఆర్‌పై అనుచిత కామెంట్స్ చేశారు.

Rajendra Prasad Controversial Comments On MGR : తెలుగు సినీ పరిశ్రమలో దశాబ్దాలుగా తన నటనతో ఫుల్ క్రేజ్ సంపాదించుకున్నారు సీనియర్ హీరో రాజేంద్ర ప్రసాద్. ఓ వైపు హాస్య నటుడిగా మరోవైపు హీరోగానే కాకుండా ఎన్నో వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకులను అలరించారు. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా మూవీస్ చేస్తున్నారు. తాజాగా తన మాట తీరుతో వరుస వివాదాల్లో చిక్కుకుంటున్నారు.
మొన్న రాబిన్ హుడ్ మూవీ ఈవెంట్‌లో డేవిడ్ వార్నర్‌ను సంబోదిచిన తీరు దగ్గర నుంచీ ఆ తర్వాత ఎస్వీ కృష్ణారెడ్డి బర్త్ డే ఈవెంట్ సందర్భంగా కమెడియన్ అలీపై బూతు కామెంట్స్‌తో తీవ్ర విమర్శలకు గురయ్యారు. స్టేజ్‌పై బహిరంగంగా మాట్లాడే టైంలో ఆయన వాడుతున్న అనుచిత పదాలు ఆయన్ను వివాదాల్లోకి నెడుతున్నాయి. అలీ ఇన్సిడెంట్ తర్వాత ఇకపై తన చివరి శ్వాస వరకూ అందరినీ మర్యాదగానే పిలుస్తానని చెప్పారు. అయితే, తాజాగా మరో ఈవెంట్‌లోనూ తమిళ నటుడు ఎంజీఆర్‌పై చేసిన కామెంట్స్ దుమారం రేపుతున్నాయి.
రాజేంద్ర ప్రసాద్ ఏమన్నారంటే?
భారత్ కల్చరల్ అకాడమీ, తెలుగు టీవీ కల్చరల్ వెల్ఫేర్ ఫోరం ఆధ్వర్యంలో రాజేంద్ర ప్రసాద్‌కు కళాప్రపూర్ణ కత్తి కాంతారావు జాతీయ పురస్కారం 2025ని ప్రెజెంట్ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన కాంతారావు గొప్పతనాన్ని వివరిస్తూ నోరు జారారు. తమిళ సినీ దిగ్గజం, తమిళనాడు మాజీ సీఎం ఎంజీఆర్ గురించి అనుచిత కామెంట్స్ చేశారు.
'కాంతారావు గారిని చూసి ఉ**** పోసిన తమిళుల గ్రేటెస్ట్ హీరో ఎంజీఆర్. కాంతారావు గారి పేరు చెబితే ఆయన జానపదాలు చూసి... వాడెవడ్రా బాబోయ్. మొత్తం ఇండియన్ సినిమానే లేపుకెళ్లిపోతున్నాడంట అంటూ ఎంజీఆర్ భయపడ్డారు.' అనే అర్థం వచ్చేలా అనుచిత కామెంట్స్ చేశారు. ఈ వీడియో వైరల్ అవుతుండగా నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. పబ్లిక్ ఈవెంట్‌లో ఇలా మాట్లాడడం సరికాదంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి దీనిపై ఆయన రియాక్ట్ అవుతారో చూడాలి.
Also Read : విరోష్ కపుల్ బెస్ట్ మూమెంట్స్ విత్ ఫ్యామిలీ - ఆ ఈవినింగ్ 100 గంటలుంటే బాగుండేదంటూ...
అభిమానిని నెట్టేసి...
కేవలం స్టేజ్‌పై కామెంట్స్ వల్ల మాత్రమే కాకుండా అభిమానులతో రాజేంద్ర ప్రసాద్ ప్రవర్తించే తీరుపైనా విమర్శలు ఎదుర్కొన్నారు. నాలుగు రోజుల క్రితం ఓ ఈవెంట్‌లో సెల్ఫీ అడిగిన అభిమానిని చిరాకుగా అసహనంతో నెట్టేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ వీడియో వైరల్ కాగా... చాలామంది నెటిజన్లు ఆయన తీరును తప్పుబట్టారు. సెల్ఫీ ఇవ్వడం ఇష్టం లేకపోతే చెప్పాలి తప్ప అలా నెట్టేయడం కరెక్ట్ కాదంటూ కామెంట్స్ చేశారు. ఇప్పుడు మళ్లీ ఎంజీఆర్‌పై కామెంట్స్ విషయంలోనూ అంతే విమర్శలు వస్తున్నాయి.
Before You Go
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
ట్రెండింగ్ వార్తలు






















