శ్రావణ మాసంలో ప్రతి మంగళవారం పార్వతీ దేవి రూపమైన మంగళ గౌరీ దేవిని పూజించే వ్రతమే మంగళ గౌరీ వ్రతం. వ్రతం అసంపూర్ణంగా ఉండకుండా కథను తప్పకుండా చదువుకోవాలి.
మంగళ గౌరీ వ్రత కథ: శ్రావణ మంగళవారం గౌరీ దేవి పూజ సమయంలో ఈ కథ తప్పనిసరిగా చదువుకోవాలి!
మంగళ గౌరీ వ్రత కథ: శ్రావణ మాసంలో ప్రతి మంగళవారం మంగళ గౌరీ దేవిని పూజిస్తారు.పూజ పూర్తి చేసిన తర్వాత మహిళలు సమయంలో గౌరీ దేవి ఈ కథను పఠించాలి.

- ధర్మపాలుడు, భార్యకు అల్పాయుష్కుడైన వారదత్తుడు పుత్రునిగా కలిగాడు.
- వారదత్తుడు కాశీ యాత్రలో మంగళగౌరీ పూజిత సుశీలను పెళ్లాడాడు.
- సుశీల గౌరీ ఆదేశంతో పామును పట్టి భర్త ప్రాణం కాపాడింది.
- వ్రత మహిమతో అపమృత్యుదోషం తొలగి అత్తమామలకు చూపు వచ్చింది.
మంగళ గౌరీ వ్రతం 2026: శ్రావణ మాసంలో ప్రతి మంగళవారం మంగళ గౌరీ దేవిని పూజిస్తారు . మంగళ గౌరీ దేవి పార్వతీ దేవి రూపం. మంగళ గౌరీ దేవి పూజ చేసేటప్పుడు కథను తప్పకుండా చదువుకోవాలి. ఇది లేకుండా వ్రతం అసంపూర్ణంగా పరిగణిస్తారు.
మంగళ గౌరీ వ్రత కథ
కుండిన్ అనే ఒక నగరం గురించి ఒక పురాతన కథ ఉంది. అక్కడ ధర్మపాలుడు అనే ఒక ధనవంతుడు నివసించేవాడు. ధర్మపాలుడి భార్య అత్యంత భక్తిపరురాలు , పతివ్రత. వారు ఒక ఆదర్శ దంపతులు. వారి జీవితాలు అన్ని సౌకర్యాలు ఉండేవి కానీ సంతానం లేదనే బాధ వెంటాడేది. ఓ రోజు ఇంటికి బిక్షం కోసం వచ్చిన సన్యాసికి బంగారు పళ్లెంలో బిక్షం తీసుకొచ్చింది. అయితే తనకు వద్దని చెప్పి వెళ్లిపోయేందుకు వెనుతిరిగాడు ఆ సన్యాసి, ఏం జరిగిందని ఆమె ప్రశ్నించగా.. సంతానం ఇంట తాను బిక్షం తీసుకోనని చెప్పాడు. పార్వతీ పరమేశ్వరులను పూజించమని చెప్పి ఆ సన్యాసి వెళ్లిపోయాడు. అలా ఆ దంపతులు చేసిన పూజలకు ప్రశన్నుడైన పరమేశ్వరుడు అల్పాయుష్కు కలిగిన పుత్రుడు కలుగుతాడని వరమిచ్చి, ఊరు వెలుపల ఉన్న మామిడి చెట్టు నుంచి ఓ పండు తీసుకొచ్చి భుజించమని చెప్పి మాయమయ్యాడు. అయితే చెట్టు వద్దకు వెళ్లిన ధర్మపాలుడు అత్యాశతో చెట్టుకి ఉన్న పండ్లు అన్నీ కోసి మూటకట్టుకుని వచ్చాడు..కానీ ఇంటికి వచ్చి మూటవిప్పి చూసేసరికి ఒక్క ఫలమే ఉంది. తమకు భగవంతుడు అనుగ్రహించింది ఇదే అని భావించి ఆ ఫలమును స్వీకరించింది ధర్మపాలుడి భార్య. కొంతకాలానికి ఓ కొడుకు పుట్టాడు..వారదత్తుడు అనే పేరు పెట్టారు.
శ్రావణమాసం 2026: శుభదినాలు, వరలక్ష్మీ వ్రతం తేదీలు, పూజా విధానాలు!
ఓరోజు తల్లి బాధపడుతుండడం చూసి ఏం జరిగిందని తల్లిని అడిగాడు వారదత్తుడు. అల్పాయుష్షు గురించి చెప్పి కన్నీళ్లు పెట్టుకుంది తల్లి. ఈ మాటలు విన్న వారదత్తులు...అమ్మా నేను కాశీ యాత్ర చేసి వస్తానని చెప్పి మేనమామతో కలసి కాశీయాత్రకు బయలుదేరాడు. మార్గమధ్యలో ఆ ఓ నగరానికి చేరుకుని అక్కడ పూదోటలో బసచేశారు. ఆ పూలతోటలో సుశీల అనే రాజకుమార్తె తన చెలికత్తెలతో ఆడుకునేందుకు వచ్చింది. ఆటమధ్యలో తగవువచ్చి ఒకరినొకరు “విధవా” అని తిట్టుకున్నారు. ఆ మాట విన్న సుశీల...మా అమ్మ మంగళగౌరి వ్రతం ఆచరించి నాకు వాయనం ఇచ్చింది..ఈ వ్రతమహిమ వల్ల తనకు వైధవ్యం ఉండదు అని చెప్పింది. ఆ మాటలు విన్న వారదత్తుడి మేనమామ..తన మేనల్లుడికి తగిన భార్య ఈమె అని భావించాడు. ఆ మహారాజుతో మంతనాలు జరిపి వివాహం జరిపించాడు.
పెళ్లి జరిగిన రోజు సుశీల మగళగౌరి దేవిని పూజించింది. ఆ రాత్రి సుశీల కలలో ప్రత్యక్షమైన గౌరీదేవి నీ భర్తకు పాము నుంచి ప్రాణగండం ఉందని చెప్పి..ఆ పామును పట్టి నీ తల్లి నీకు వాయనం ఇచ్చిన కుండలో కట్టమని చెప్పి మాయమైంది. ఉలిక్కిపడి లేచిన సుశీల.. తన భర్త పక్కనే ఉన్న పామును చూసింది. ధైర్యంగా ఆ పామును పట్టి తన భర్త తొడపై నిల్చుుని..అటకపైనున్న కుండను దింపి , పామును అందులో పెట్టి వస్త్రంతో మూటగట్టి ఆ తర్వాత నిద్రపోయింది. మర్నాటి ఉదయం వారదత్తుడు తన మేనమామతో కలసి కాశీకి వెళ్లిపోయాడు. నిద్రలేచిన సుశీల తన భర్త కనిపించడం లేదని చెప్పింది. తన భర్తకోసం ఎదురుచూస్తానని చెప్పి మంగళగౌరి పూజ చేస్తూ..బాటసారులకు అన్నదానం చేస్తూ కాలం గడిపింది. మరుసటి సంవత్సరం కాశీ యాత్ర ముగించుకుని తిరిగి వచ్చాడు వారదత్తుడు. అప్పుడు కూడా సుశీల ఉన్న నగరంలో బసచేశాడు. ఆమె చేస్తున్న అన్నదానం పంక్తిలో కూర్చుని భోజనం చేశాడు. తన భర్తను పోల్చిన సుశీల..తల్లిదండ్రుల వద్దకు తీసుకెళ్లింది. ఇతడే నీ భర్త అని ఎలా తెలుసు అని అడిగితే.. పామును కుండలో కట్టి అటకపై పెట్టిన సమయంలో కాళ్ల పారాణితో తన భర్త తొడపై వేసిన ముద్రను చూపించింది సుశీల. ఆ కుండను తెరిచి చూడగా అందులో పాము బదులు ముత్యాల హారం కనిపించింది. తన కలగురించి వారదత్తుడి మేనమామకు వివరించింది సుశీల. మంగళగౌరి మహిమతో అపమృత్యుదోషం తొలగిపోయిందని గ్రహించారంతా. కుమార్తెకు సారె పెట్టి అత్తవారింటికి సాగనంపారు సుశీల తల్లిదండ్రులు.
పుట్టింట శ్రావణ మంగళ గౌరీ వ్రతాన్ని ఆచరించి అత్తారింటికి చేరుకున్న సుశీలకు..గుడ్డివారైన అత్తమామలు కనిపించారు. వ్రతం చేస్తున్న సమయంలో తయారు చేసిన కాటుకను వారి కంటికి అద్దగానే చూపు వచ్చింది. మంగళగౌరీదేవి మహిమ వల్ల ఇదంతా జరిగిందని గ్రహించారు అందరూ. సుశీల, వారదత్తుడు సంతోషంగా జీవనం సాగించారు. ప్రతి సంవత్సరం మంగళగౌరి వ్రతాన్ని ఆచరించింది సుశీల.
శ్రావణ మంగళగౌరీ వ్రతకథ సంపూర్ణం
గమనిక: ఆధ్యాత్మికవేత్తలు సూచించిన వివరాలు, ఆధ్యాత్మిక గ్రంధాల్లో పొందుపరిచిన సమాచారం ఆధారంగా అందించిన కథనం ఇది. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. దీనిని అనుసరించేముందు మీరు విశ్వశించే పండితుల సలహాలు స్వీకరించగలరు
Frequently Asked Questions
మంగళ గౌరీ వ్రతం అంటే ఏమిటి?
ధర్మపాలుడు, అతని భార్య ఎందుకు పూజ చేశారు?
వారికీ సంతానం లేదనే బాధ వెంటాడేది. ఒక సన్యాసి సలహా మేరకు సంతానం కోసం పార్వతీ పరమేశ్వరులను పూజించారు.
వారదత్తుడికి పాము నుండి ప్రాణగండం గురించి సుశీలకు ఎలా తెలిసింది?
పెళ్లి రోజున మంగళగౌరీ దేవిని పూజించిన తర్వాత, గౌరీదేవి ఆమె కలలో ప్రత్యక్షమై ఈ విషయం చెప్పింది. పామును పట్టి కుండలో బంధించమని ఆదేశించింది.
సుశీల వ్రత ప్రభావంతో అత్తమామలకు ఏమి జరిగింది?
సుశీల తన అత్తారింటికి చేరుకున్నప్పుడు, ఆమె గుడ్డివారైన అత్తమామలకు వ్రతంలో చేసిన కాటుక అద్దగానే చూపు వచ్చింది. ఇది మంగళగౌరీ దేవి మహిమ అని అందరూ గ్రహించారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు






















