హీరోయినే కాదు... డాక్టర్ కూడా - కోమలీ ప్రసాద్ లైఫ్‌లో ఈ విషయాలు తెల్సా?

Published by: Satya Pulagam

'హిట్' ఫ్రాంచైజీతో వరుస విజయాలు

అడివి శేష్ 'హిట్ 2', నాని 'హిట్ 3'లో పోలీస్ అధికారిగా కోమలీ ప్రసాద్ నటించారు. ఆ రెండూ ఆమెకు బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ఇచ్చాయి. అంతకు ముందు 'నెపోలియన్', 'అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి' సినిమాల్లో కథానాయికగా నటించారు.

పుట్టింది విశాఖ... పెరిగింది బళ్ళారిలో

కోమలీ ప్రసాద్ తెలుగు అమ్మాయే. విశాఖలో ఆమె జన్మించింది. బళ్ళారిలో పెరిగింది. మహారాష్ట్రలో చదువు పూర్తి చేసింది. తెలుగుతో పాటు కన్నడ, తమిళ్, మరాఠీ, హిందీ, ఇంగ్లీష్ భాషలు మాట్లాడుతుంది.

యాక్టరే కాదు... రియల్ లైఫ్ డాక్టర్ కూడా

'రౌడీ బాయ్స్'లో డాక్టర్ పాత్రలో కోమలీ ప్రసాద్ కనిపించింది. ఆ సినిమాలోనే కాదు, నిజ జీవితంలోనూ ఆవిడ డాక్టర్. డెంటల్ పూర్తి చేసింది కోమలీ ప్రసాద్.

ఓటీటీలోనూ కోమలీ ప్రసాద్ హిట్ హీరోయిన్

'లూజర్', 'టచ్ మీ నాట్'... రెండు వెబ్‌ సిరీస్‌లలో కోమలీ ప్రసాద్ నటించింది. ఆ రెండూ ఓటీటీల్లో ఘన విజయాలు సాధించాయి. 'మోడ్రన్ లవ్ హైదరాబాద్' అని మరొక సిరీస్ చేసింది కోమలి. 

నటనకు గ్యాప్ ఇవ్వడానికి రీజన్ ఇంజ్యూరీ

కోమలీ ప్రసాద్ యాక్టింగ్ కెరీర్ చూస్తే... 2022 తర్వాత 2025 వరకు గ్యాప్ వచ్చింది. అందుకు కారణం ఆమెకు ఇంజ్యూరీ కావడం. దాన్నుంచి కోలుకున్న తర్వాత మళ్ళీ వరుసపెట్టి సినిమాలు చేయడం మొదలుపెట్టారు.

పోలీసుగా మూడుసార్లు... బ్రేక్ చేసిన శశివదనే

'హిట్ 2', 'హిట్ 3', 'టచ్ మీ నాట్' వెబ్ సిరీస్... వరుసగా మూడింటిలో పోలీసుగా కనిపించింది కోమలీ ప్రసాద్. ఆ పోలీస్ పాత్రలకు 'శశివదనే' బ్రేక్ ఇచ్చింది. ఆ మూవీలో ఆవిడ గోదావరి అమ్మాయిగా కనిపించింది.

ఫోటోలో ఉన్నది కోమలీ ప్రసాద్ బ్రదర్

కోమలీ ప్రసాద్ కు ఒక బ్రదర్ ఉన్నారు. ఫోటోలో కనిపించినది అతనే. కోమలీ ప్రసాద్ యాక్టింగ్ కెరీర్ ఎంచుకుంటే... అతను ఉద్యోగం చేస్తున్నారు. 

కోమలీ ప్రసాద్ పెట్ లవర్

కోమలీ ప్రసాద్ పెట్ లవర్ కూడా! ఆవిడకు పెంపుడు జంతువులు అంటే ఇష్టం. పెట్ డాగ్స్ తో దిగిన ఫోటోలు తరచూ షేర్ చేసేవారు. కథానాయికగా బిజీ అయ్యాక మానేశారు.

మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం

సినిమా తరాలకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయాలతో పాటు మూవీ అప్డేట్స్, బ్యూటీ & ఫ్యాషన్ టిప్స్ కోసం ఏబీపీ దేశం వెబ్ సైట్ & యూట్యూబ్ ఫాలో అవ్వండి.