కృతి శెట్టి ట్రెండీ బ్లౌజ్ డిజైన్స్... 25 ఏళ్ళ లోపు అమ్మాయిలకు స్టైలింగ్ టిప్స్

Published by: Satya Pulagam

స్లీవ్ లెస్... కృతి ఫస్ట్ ఆప్షన్

కృతి శెట్టి ఎక్కువగా స్లీవ్ లెస్ బ్లౌజ్ ధరిస్తారు. శారీని బట్టి ఎంబ్రాయిడరీ, నెక్ స్టైల్ విషయంలో మార్పులు చేయడం వంటివి చేస్తారు.

స్క్వేర్ నెక్ లైన్ బ్లౌజ్...

ఎంబ్రాయిడరీ & క్రిస్టల్ వర్క్ చేయించిన నెట్ శారీని కృతి శెట్టి ధరించారు. బ్లౌజ్ డిజైన్‌లో ఆవిడ ట్రెండీ ఫాలో అయ్యారు. స్క్వేర్ నెక్ లైన్ స్టయిల్ ఇది.

డీప్ వి నెక్ బ్లౌజ్ డిజైన్...

అల్ట్రా మోడ్రన్ లుక్ కోసం కొందరు టీనేజ్ గాళ్స్, యంగ్ లేడీస్ ఎంపిక చేసుకునే బ్లౌజ్ డిజైన్ ఇది. డీప్ వి నెక్ స్టైల్.

కస్టమైజ్డ్ బ్యాక్ లెస్ బ్లౌజ్...

పార్టీలకు ఇటువంటి బ్లౌజ్ డిజైన్స్ బావుంటాయ్. ఇది కస్టమైజ్డ్ బ్లౌజ్. శారీ స్టైల్, ఫ్యాబ్రిక్ ఫాలో అవుతూ కృతి శెట్టి కస్టమైజ్డ్ డిజైన్ చేయించారు. తమ కంఫర్ట్ కు తగ్గట్టు యంగ్ గాళ్స్ బ్లౌజ్ డిజైన్ చేయించుకోవచ్చు.

స్లీవ్ లెస్ & వి నెక్ బ్లౌజ్...

కృతి శెట్టి బ్లౌజ్ చూశారా? వి నెక్ స్టయిల్ అది. చూసేందుకు సింపుల్‌గా ఉంది. కానీ బ్లౌజ్ మెటీరియల్ మీద సేమ్ కలర్ థ్రెడ్ వర్క్ చేశారు. కాక్ టైల్ పార్టీలకు ఇటువంటి బ్లౌజ్, శారీస్ బెస్ట్ అంటారు కొందరు.

రౌండ్ నెక్ ఫుల్ హ్యాండ్స్ బ్లౌజ్

ఫుల్ హ్యాండ్స్ బ్లౌజ్ ఇది. రౌండ్ నెక్ స్టయిల్‌లో ఫుల్ ఎంబ్రాయిడరీ వర్క్ చేయించారు. ఫెస్టివల్ టైం కోసం షిఫాన్ శారీ మీద ఇటువంటి బ్లౌజ్ డిజైన్ చాలా బావుంటుంది.

బ్లౌజ్ మీద ఎంబ్రాయిడరీ...

బ్లౌజ్ మీద మగ్గం వర్క్, ఎంబ్రాయిడరీ చేయిస్తే... ఫెస్టివల్స్, ఫంక్షన్స్ వంటి అకేషన్స్ ఉన్నప్పుడు ట్రెడిషనల్ లుక్ కోసం మంచి ఆప్షన్.

కాలర్ నెక్ & బుట్ట చేతులు

ఫ్లోరల్ ప్రింట్ శారీస్ పెద్దలకు మాత్రమే బావుంటుందనే అపోహ ఉంది. అయితే కాలర్ నెక్, బుట్ట చేతులతో బ్లౌజ్ డిజైన్ చేయిస్తే... ఆ వింటేజ్ లుక్ అమ్మాయిలకూ బావుంటుంది. 

ఏబీపీ దేశం వెబ్‌సైట్ ఫాలో అవ్వండి

బ్యూటీ, స్టైలింగ్ టిప్స్ & మూవీ అప్డేట్స్ కోసం ఏబీపీ దేశం వెబ్ సైట్ & యూట్యూబ్ ఫాలో అవ్వండి.