శారీ కట్టడంలో కల్యాణీ ప్రియదర్శన్ స్టయిలే సపరేటు... మోడ్రన్ మహిళలకు బెస్ట్ ఆప్షన్స్

Published by: Satya Pulagam

టర్టిల్ నెక్... బ్యాక్ లెస్ బ్లౌజ్

శారీ ఏదైనా సరే... స్లీవ్ లెస్ టర్టిల్ నెక్, బ్యాక్ లెస్ బ్లౌజ్‌తో ధరిస్తే మోడ్రన్ లుక్ రెడీ.

ఫ్లోరల్ ప్రింట్... నయా ట్రెండ్

శారీ స్టయిల్స్ ఎన్ని అయినా రావచ్చు. కానీ వైట్ కలర్ మీద ఫ్లోరల్ ప్రింట్ ట్రెండ్ మాత్రం ఎప్పటికీ ఉంటుంది. వింటేజ్ లుక్ & వైబ్ ఇస్తుంది.

పోల్కా డాట్స్ కాటన్ శారీలు

ఫ్లోరల్ ప్రింట్ తరహాలో పోల్కా డాట్స్ శారీలు సైతం ఎవర్ గ్రీన్ ట్రెండ్. కాటన్ మీద పోల్కా డాట్స్ స్టైల్ కంఫర్ట్ ఇస్తుంది.

బ్లాక్ నెట్ శారీ... కంపల్సరీ

మోడ్రన్ మహిళల వార్డ్ రోబ్ లో కంపల్సరీ ఉండాల్సిన శారీల్లో బ్లాక్ నెట్ శారీ ఒకటి. బ్యూటీ విత్ బ్లాక్ శారీ డెడ్లీ కాంబినేషన్. 

బెల్ బాటమ్ శారీ విత్ బెల్ట్

బెల్ బాటమ్ స్టైల్ రెడీ మేడ్ శారీ లుక్ ఇది. బెల్ట్ ధరిస్తే చీర కట్టినట్టు కాకుండా స్టైలిష్ గా ఉంటుంది. 

వైట్ శారీ... డిఫరెంట్ బ్లౌజ్

మహిళలు చాలా మందికి వైట్ శారీ అంటే ఇష్టం. కట్టిన ప్రతిసారీ డిఫరెంట్ లుక్ ఇవ్వాలంటే బ్లౌజ్ మీద ప్రింట్ లేదా బోర్డర్ ఉండేలా చూస్తే సరి!

మల్టీ కలర్ షిఫాన్ శారీ లుక్

షిఫాన్ శారీ స్టైల్ ఇష్టపడే మహిళలు కొందరు ఉంటారు. అయితే రెగ్యులర్ కాకుండా మల్టీ కలర్ శారీ తీస్తే పార్టీలకూ బావుంటుంది.

సింపుల్ ఎంబ్రాయిడరీ శారీ

కంఫర్ట్ లేదా సింపుల్‌గా ఉంటుందని ప్లెయిన్ కలర్ శారీలు తీసుకుంటారు కొందరు. అయితే వాటిపై సింపుల్ ఎంబ్రాయిడరీ చేయిస్తే నయా లుక్ రెడీ. 

ఏబీపీ దేశం ఫాలో అవ్వండి

మరిన్ని స్టయిల్స్ & బ్యూటీ టిప్స్ కోసం ఏబీపీ దేశం వెబ్ సైట్, యూట్యూబ్ ఫాలో అవ్వండి.