కాంతార సినిమాను నైజాంలో మైత్రీ మూవీ మేకర్స్ అనుబంధ డిస్ట్రిబ్యూషన్ సంస్థ విడుదల చేస్తోంది.
గోదావరి జిల్లాల్లో గీతా ఆర్ట్స్, గుంటూరులో వారాహి చలన చిత్రం, కృష్ణలో కెఎస్‌ఎన్, రాయలసీమలో శిల్పకళ ఎంటర్టైన్మెంట్స్ విడుదల చేస్తున్నాయ్.
'కేజీఎఫ్', 'సలార్' వంటి పాన్ ఇండియా హిట్స్ తీసిన హోంబలే ప్రొడక్షన్స్ ఈ 'కాంతార'ను నిర్మించింది. నిర్మాత విజయ్ కిరగందూర్ సినిమాను అమ్మరు. కమిషన్ బేసిస్ మీద విడుదల చేస్తారు.
నైజాంలో సినిమాను విడుదల చేస్తున్న మైత్రి డిస్ట్రిబ్యూషన్ సంస్థ 'కాంతార' నిర్మాతలకు 40 కోట్లు అడ్వాన్స్ ఇచ్చారని ట్రేడ్ టాక్.
నైజాం రైట్స్, ఆంధ్ర రైట్స్ సేమ్ అమౌంట్ కు ఇవ్వడం బిజినెస్ ట్రెండ్. ఏపీలో ఏరియాల వారీగా వేర్వేరు డిస్ట్రిబ్యూటర్లు ఉన్నా అన్నీ కలిపి 40 కోట్ల అడ్వాన్స్ కు ఇచ్చారు.
'కాంతార చాప్టర్ 1' రాయలసీమ రైట్స్ వేల్యూ కేవలం 10 కోట్ల అడ్వాన్స్ మాత్రమే. అక్కడ తక్కువ అమౌంట్ తీసుకున్నట్టు చెప్పాలి.
డిస్ట్రిబ్యూటర్స్ నుంచి 'కాంతార' ప్రొడక్షన్ హౌస్ తీసుకున్న టోటల్ అడ్వాన్స్ అమౌంట్ చూస్తే 90 కోట్లు. అంత బిజినెస్ జరిగిందని అనుకోవాలి.
డిస్ట్రిబ్యూటర్లు 90 కోట్ల అడ్వాన్స్ ఇచ్చారు కదా, అంత కలెక్షన్స్ రాకపోతే అనే సందేహం ప్రేక్షకులకు రావచ్చు. కలెక్షన్స్ తక్కువ వస్తే నిర్మాతలు అమౌంట్ వెనక్కి ఇస్తారు.
అడ్వాన్స్ బేసిస్ మీద విడుదల చేస్తుండటంతో 'కాంతార చాప్టర్ 1' తెలుగు డిస్ట్రిబ్యూటర్లు సేఫ్. ఎక్కువ కలెక్షన్స్ వస్తే లాభాలు వస్తాయి. తక్కువ వస్తే కట్టిన అమౌంట్ వెనక్కి వస్తుంది.