నిహారిక ట్రెండీ ఇయర్ రింగ్స్‌ కలెక్షన్... మోడ్రన్ మగువకు మస్త్ ఛాయస్

Published by: Satya Pulagam

డిజైనర్ ఇయర్ రింగ్స్

నలుగురిలో మీ ఇయర్ రింగ్స్ ప్రత్యేకంగా కనిపించాలంటే డిజైనర్ పీస్ ఆర్డర్ చేయడం మంచిది. మోడ్రన్ డ్రస్ మీదకు క్రిస్టల్స్, జెమ్ స్టోన్స్ ఉపయోగించి చేసిన ఇయర్ రింగ్స్ బావుంటాయి.

కుందన్ ఇయర్ రింగ్స్

శారీ కట్టినప్పుడు కుందన్ స్టైల్ ఇయర్ రింగ్స్ అయితే బావుంటాయి. కుందన్ స్టైల్‌లో వేర్వేరు డిజైన్స్ / షేప్స్ ఉంటాయి. శారీ స్టైల్, మీ అభిరుచి బట్టి వాటిని ఎంపిక చేసుకోవచ్చు. 

నో రింగ్స్... ఓన్లీ నెక్లెస్

మోడ్రన్ డ్రస్‌లు కొన్నిటికి ఇయర్ రింగ్స్ సెట్ కాకపోవచ్చు. డిజైనర్‌వి అందరి దగ్గర ఉండకపోవచ్చు. అప్పుడు నిహారికలా నెక్లెస్‌తో మేనేజ్ చేయవచ్చు. ఆప్షన్స్, ఐడియాస్ కోసం ఈ ఫోటోలపై లుక్ వేయండి. 

ట్రెడిషనల్ ఝంకాలు!

మోడ్రన్ మహిళలలోనూ ఎక్కువ శాతం మంది చుడిదార్‌లు ధరిస్తారు. వాటిపైకి ట్రెడిషనల్ ఝంకాలు మంచి ఆప్షన్. బుట్ట కింద వచ్చే ఝంకాలకు స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉంటుంది.

వజ్రాలు, ముత్యాలు పొదిగిన దిద్దులు

ఝంకా తరహాలో ఇయర్ రింగ్స్ క్యారీ చేయడం కొందరికి ఇబ్బందిగా అనిపించవచ్చు. నిహారిక ఫోటో చూశారా? సింపుల్ & స్టైలిష్ లుక్ కోసం ముత్యాలు లేదా వజ్రాలు పొదిగిన చెవి దిద్దులు ట్రై చేయవచ్చు. 

సిల్వర్... నయా ఫ్యాషన్!

ఇయర్ రింగ్స్ అంటే చాలా మంది బంగారం వైపు చూస్తారు. కానీ తరం మారింది. ఇప్పుడు సిల్వర్ లేదా నార్మల్ మెటీరియల్ తో చేసిన ఇయర్ రింగ్స్ కొంటున్నారు. రేటు తక్కువ, లుక్ ఎక్కువ.

రింగ్ కాదు... ఇయర్ లాకెట్!

ఇయర్ రింగ్స్ ప్లేసులో లాకెట్స్ కూడా వచ్చాయండోయ్! నిహారిక ధరించినది ఇయర్ లాకెట్ అని చెప్పలేం. కానీ, ఈ టైపులో ఉంటాయి. జీన్స్, జాకెట్స్ వంటి డ్రస్‌లపై అవి బావుంటాయి. 

ear piercing (ఇయర్ పియర్సింగ్)

ఇయర్ రింగ్ మీద మరొక చిన్న డిజైన్ కనిపిస్తుందా? దానిని ఇయర్ పియర్సింగ్ అంటారు. మోడ్రన్ మగువలు చాలా మంది ఇయర్ రింగ్ మీద మరికొన్ని రింగ్స్ కోసం దీనిని ఫాలో అవుతున్నారు. 

బ్యూటీ, ఫ్యాషన్ టిప్స్ కోసం ఏబీపీ

మరిన్ని డ్రసింగ్ స్టయిల్స్, బ్యూటీ & ఫ్యాషన్ టిప్స్ కోసం ఏబీపీ దేశాన్ని (వెబ్‌సైట్, యూట్యూబ్‌) ఫాలో అవ్వండి.