Lockdown OTT : ఓటీటీలోకి అనుపమ సర్వైవల్ థ్రిల్లర్ 'లాక్ డౌన్' - తెలుగులోనూ స్ట్రీమింగ్
Lockdown OTT Platform : అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో నటించిన రీసెంట్ తమిళ థ్రిల్లర్ 'లాక్ డౌన్' సడన్‌గా ఓటీటీలోకి వచ్చేసింది. తమిళంతో పాటు తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోంది.

Anupama Parameswaran's Lockdown OTT Streaming : హారర్, థ్రిల్లర్ మూవీస్ అంటే ఆడియన్స్‌లో ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఓటీటీల్లో వీటికి సెపరేట్ ఫ్యాన్ బేసే ఉంటుంది. సదరు ఓటీటీ సంస్థలు కూడా క్రేజ్‌కు తగ్గట్లుగానే తమిళం, మలయాళంల్లో థ్రిల్లర్ మూవీస్‌ను తెలుగులోనూ స్ట్రీమింగ్ చేస్తున్నాయి. తాజాగా మరో సర్వైవల్ థ్రిల్లర్ సడన్‌గా ఓటీటీలోకి వచ్చేసింది.
యంగ్ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో నటించిన తమిళ థ్రిల్లర్ 'లాక్ డౌన్'. పలు వాయిదాల తర్వాత జనవరి 30న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకుంది. దాదాపు 2 నెలల తర్వాత ఇప్పుడు సడన్‌గా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.
ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ప్రముఖ ఓటీటీ 'అమెజాన్ ప్రైమ్ వీడియో'లో లాక్ డౌన్ స్ట్రీమింగ్ అవుతోంది. తమిళంతో పాటు తెలుగు, హిందీ భాషలోనూ అందుబాటులోకి వచ్చింది. ఏ ఆర్ జీవా మూవీకి దర్శకత్వం వహించగా... లైకా ప్రొడక్షన్స్ నిర్మించింది. అనుపమతో పాటు రేవతి, అభిరామి, చార్లె, నిరోషా, ప్రియా వెంకట్, లివింగ్ స్టన్ తదితరులు కీలకపాత్రలు పోషించారు.
View this post on Instagram
Also Read : రాకింగ్ స్టార్ మంచు మనోజ్ రాకింగ్ లుక్ - న్యూ అవతార్ కోసం ఏం చేశారంటే?
స్టోరీ ఏంటంటే?
ఈ మూవీ స్టోరీ విషయానికొస్తే... చదువు పూర్తయ్యాక అనిత (అనుపమ పరమేశ్వరన్) ఉద్యోగ ప్రయత్నాల్లో ఉంటుంది. ఓ రోజు ఫ్రెండ్స్‌తో కలిసి అనుకోకుండా ఓ పార్టీలో పాల్గొంటుంది. ఆ తర్వాత కొన్ని రోజులకు ఆమె ప్రెగ్నెంట్ అని తెలుస్తుంది. ఈ విషయాన్ని ఇంట్లో చెప్పలేక దాచాలని ప్రయత్నిస్తుంది. అబార్షన్ చేసుకోవాలనుకునే టైంలో సరిగ్గా కరోనా కారణంగా లాక్ డౌన్ విధిస్తారు. ఆస్పత్రుల్లో మొత్తం కరోనా పేషెంట్లనే ట్రీట్ చేస్తారు. దీంతో ఆమెకు ఏం చేయాలో పాలుపోదు.
మరోవైపు, ఆదాయం కోల్పోయిన కుటుంబం, ఊరికి వెళ్లలేక చిక్కుకున్న కార్మికులు, అయిన వారు చనిపోతున్నా వెళ్ల లేని దీన స్థితిలో కొందరు, ఒంటరితనంతో బాధ పడే యువత చాలా మంది లాక్ డౌన్‌తో సతమతమవుతుంటారు. చివరకు అనిత సైతం తీవ్ర మనో వేదనకు గురవుతుంది. అనిత ప్రెగ్నెన్సీ విషయం ఇంట్లో తెలిసిందా? ఆమె ఏం చేసింది? అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే.
Before You Go
Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు























