అన్వేషించండి

Manchu Manoj : రాకింగ్ స్టార్ మంచు మనోజ్ రాకింగ్ లుక్ - న్యూ అవతార్ కోసం ఏం చేశారంటే?

Manchu Manoj Reaction : రాకింగ్ మంచు మనోజ్ జిమ్ వర్కౌట్ ఫోటోస్ వైరల్ అవుతున్నాయి. భారీ యాక్షన్ ఎంటర్టైనర్ 'డేవిడ్ రెడ్డి' లుక్ కోసం ఆయన ఎంత శ్రమిస్తున్నారో పోస్ట్ చేశారు.

Manchu Manoj About His Workouts For David Reddy Movie : రీసెంట్‌గా మిరాయ్‌లో 'మహావీర్ లామా'గా అలరించారు రాకింగ్ స్టార్ మంచు మనోజ్. ఎప్పటికప్పుడు డిఫరెంట్ రోల్స్, కొత్తదనంతో ప్రేక్షకులను ఆకట్టుకునే ఆయన తాజాగా... 'డేవిడ్ రెడ్డి'లో మరో వైవిధ్యమైన రోల్‌తో ఆడియన్స్‌ను ఎంటర్టైన్ చేసేందుకు రెడీ అవుతున్నారు. దీని కోసం చాలా శ్రమిస్తున్నారు.

రాబోయే సినిమాల కోసం గత 3 వారాలుగా కఠినంగా శ్రమిస్తున్నట్లు తాజాగా ఇన్ స్టా పోస్ట్ పెట్టారు. మంచు మనోజ్ వర్కౌట్ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నటుడిగా ఆయన చూపిస్తోన్న పట్టుదల, కృషిని అందరూ అభినందిస్తున్నారు. ఈ పోస్ట్‌లో తాను తీసుకున్న డెసిషన్ గురించి వివరించారు మనోజ్.

'కెమెరా అబద్ధం చెప్పదు'

సౌకర్యంగా ఉండేందుకు సాకులు వెతక్కుండా వాటిని పక్కకు పెట్టేసి కష్టపడాలని నిర్ణయించుకున్నట్లు మంచు మనోజ్ తెలిపారు. '3 వారాల క్రితం ఓ డెసిషన్ తీసుకున్నా. ఇక సౌకర్యంతో రాజీ పడడం లేదు. సాకులు చెప్పాలని అనుకోవడం లేదు. కేవలం కష్టం మాత్రమే. యాక్షన్ సినిమాలో మీ కోసం ఎవరూ నటించలేదు. ప్రతి పంచ్, దెబ్బ తగిలినప్పుడు పడిపోవడం.

ప్రతి దెబ్బకు మీ శరీరం సిద్ధంగా ఉండాలి. లేకుంటే వెంటనే బయటపడుతుంది. కెమెరా ఎప్పుడు అబద్ధం చెప్పదు. ఇకపై కేవలం లుక్ కోసం మాత్రమే కాకుండా... శక్తి, సహనాన్ని పెంచుకోవడంపై నేను దృష్టి పెట్టాను. దృఢమైన వ్యక్తిలా తయారవడం నా లక్ష్యం. ఈ ప్రయాణం ఇప్పుడే మొదలైంది. కేవలం 21 రోజుల్లోనే నేను కొత్త వ్యక్తిలా అనిపిస్తున్నా.' అంటూ రాసుకొచ్చారు. 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Manoj Manchu (@manojkmanchu)

Also Read : శ్రీరామనవమికి 'సుయోధన'... సాయి కుమార్, ప్రియదర్శిల సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్

'మిరాయ్' సినిమాతో మంచు మనోజ్ గట్టి కమ్ బ్యాక్ ఇచ్చారు. పవర్ ఫుల్ విలన్ రోల్‌లో విమర్శకుల ప్రశంసలు సైతం అందుకున్నారు. తన పాత్రల్లో ఆయన చూపించిన శారీర‌క శ‌క్తి, భావోద్వేగ నిబద్ధత మరోసారి ఈ సినిమాతో స్ప‌ష్టంగా కనిపించింది. ఇప్పుడు భారీ యాక్షన్ ఎంటర్టైనర్ 'డేవిడ్ రెడ్డి'తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. 

ఈ భారీ పాన్ ఇండియా పీరియడ్ యాక్షన్ డ్రామాను హ‌నుమ రెడ్డి యెక్కంటి తెర‌కెక్కిస్తున్నారు. న‌ల్ల‌గంగుల వెంక‌ట్ రెడ్డి, భ‌ర‌త్ మోతుకూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. 1897 - 1920 మధ్య బ్రిటిష్ వలస పాలన కాలంలో జరిగే కథతో డేవిడ్ రెడ్డి సినిమా రూపొందుతోంది. అణచివేతకు ఎదురు తిరిగే ఒక ధైర్యవంతుడైన యోధుడి జర్నీని ఇందులో చూపిస్తున్నారు. ఇంటర్నేషనల్ హీరోయిన్ మారియా ర్యాబోషాప్కా కీలక పాత్రలో నటిస్తోంది. రీసెంట్‌గా రిలీజ్ చేసిన గ్లింప్స్‌కు 10 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. దీంతో మనోజ్ న్యూ అవతార్‌పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. డేవిడ్ రెడ్డి తర్వాత ఇతర ప్రాజెక్టుల్లోనూ ఆయన బిజీగా ఉన్నారు. త్వరలోనే వీటి అప్డేట్స్ రానున్నాయి.

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Toxic Trailer Review : టాక్సిక్ ట్రైలర్ వచ్చేసింది - రొమాన్స్, యాక్షన్, వయలెన్స్ అంతకు మించి...
టాక్సిక్ ట్రైలర్ వచ్చేసింది - రొమాన్స్, యాక్షన్, వయలెన్స్ అంతకు మించి...
Gedela Raju OTT : టాప్ ట్రెండింగ్‌లో పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ - రెండు ఓటీటీల్లో రఘు కుంచె మూవీ సూపర్ రెస్పాన్స్... డోంట్ మిస్
టాప్ ట్రెండింగ్‌లో పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ - రెండు ఓటీటీల్లో రఘు కుంచె మూవీ సూపర్ రెస్పాన్స్... డోంట్ మిస్
Agadha Story : అగధ ఓ సరికొత్త ప్రపంచం - సీక్వెల్ ఎక్స్‌పెక్ట్ చెయ్యొచ్చు... హీరో శ్రవణ్ రెడ్డి రియాక్షన్
అగధ ఓ సరికొత్త ప్రపంచం - సీక్వెల్ ఎక్స్‌పెక్ట్ చెయ్యొచ్చు... హీరో శ్రవణ్ రెడ్డి రియాక్షన్
Sanjeev Movie OTT : నాలుగు రోజుల్లోనే షూటింగ్... 7 నేషనల్ అవార్డ్స్ - తెలుగు మూవీ డైరెక్ట్‌గా ఓటీటీ స్ట్రీమింగ్
నాలుగు రోజుల్లోనే షూటింగ్... 7 నేషనల్ అవార్డ్స్ - తెలుగు మూవీ డైరెక్ట్‌గా ఓటీటీ స్ట్రీమింగ్

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Aid for Peddi Sudarshan Reddy Family: పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
Medical Student Incident: మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
Sai Sudharsan Ruled Out: శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
Pruthvishwar Reddy: లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
Gedela Raju OTT : టాప్ ట్రెండింగ్‌లో పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ - రెండు ఓటీటీల్లో రఘు కుంచె మూవీ సూపర్ రెస్పాన్స్... డోంట్ మిస్
టాప్ ట్రెండింగ్‌లో పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ - రెండు ఓటీటీల్లో రఘు కుంచె మూవీ సూపర్ రెస్పాన్స్... డోంట్ మిస్
Telangana High Court: హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
యూత్‌కు నచ్చేలా Pulsar N160 S, N160 SS వేరియంట్లు.. ఇంజిన్ నుంచి డిస్‌ప్లే వరకు సరికొత్త మార్పులు
Pulsar N160 కొత్త వేరియంట్లు.. మరింత పవర్‌, మరిన్ని మోడ్స్‌ - రూ.1.34 లక్షలకే!
Embed widget