అన్వేషించండి

Adilabad Latest News: సీసీఐ పరిశ్రమపై జెన్ జీల పోరాటం- ముందే మేల్కోవాలని ముఖ్యమంత్రికి ప్రొఫెసర్ కాశీం సూచన 

సీసీఐ పరిశ్రమపై జెన్ జీలు పోరాడితే ప్రభుత్వాలు కదులుతాయని ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ప్రొఫెసర్ కాశీం హెచ్చరించారు. సీసీఐ పరిశ్రమపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మౌనం వీడాలని సూచించారు. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ప్రొఫెసర్ కాశీం ఆదిలాబాద్ సిమెంట్ పరిశ్రమ పునరుద్ధరణకు పోరాడాలని పిలుపు.
  • పరిశ్రమ ప్రైవేటీకరణ కోసమే మూసివేశారని ప్రొఫెసర్ కాశీం ఆరోపించారు.
  • కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరిశ్రమ పునరుద్ధరణకు కృషి చేయాలన్నారు.

Adilabad Latest News: జెన్ జీ లు పోరాడితే ప్రభుత్వాలు కదులుతాయని ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ప్రొఫెసర్ కాశీం  అన్నారు. ఇందుకు ఢిల్లీ, జార్ఖండ్‌లో విద్యార్థులు ప్రభుత్వాలను కదిలించారని గుర్తు చేశారు. బుధవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ని ఆర్,అండ్,బీ విశ్రాంతి భవనం ఎదుట విద్యార్థి, యువత గర్జన సభను నిర్వహించారు. ఈ సభకు ముఖ్య అతిథిగా హాజరైన ప్రొఫెసర్ కాశీం విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. 

దేశంలో నీట్ పరీక్ష లీకేజి ఘటనతో 20మంది విద్యార్థులు చనిపోయారని ప్రొఫెసర్ కాశీం తెలిపారు. దీంతో విద్యార్థులు, యువత పోరాటం చేయగా.. కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చిందని పేర్కొన్నారు. ఆదిలాబాద్‌లోనూ సిమెంట్ పరిశ్రమ కోసం జెన్ జీలు పోరాటం చేస్తే ప్రభుత్వాలు కదిలి వస్తాయని వ్యాఖ్యానించారు. ఈ పరిశ్రమ ప్రారంభమైతే 6వేల ఉద్యోగాలు వస్తాయని.. ఈ పరిశ్రమ తెరవడానికి ఇక్కడ అన్ని సౌకర్యాలు ఉన్నాయని, 100ఏళ్లకు సరిపడ ముడి సరుకు ఉందని గుర్తు చేశారు. 


Adilabad Latest News: సీసీఐ పరిశ్రమపై జెన్ జీల పోరాటం- ముందే మేల్కోవాలని ముఖ్యమంత్రికి ప్రొఫెసర్ కాశీం సూచన 

ప్రభుత్వ రంగ సంస్థను  ప్రైవేట్‌కు అప్పజెప్పెందుకే ముసివేశారని ప్రొఫెసర్ కాశీం ఆరోపించారు. పరిశ్రమ భూములను ఆక్రమించే ప్రయత్నం జరుగుతోందన్నారు. గతంలోనే 2018లో ఆదిలాబాద్ కు వచ్చిన కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా ఈ పరిశ్రమను తెరిపిస్తామని హామీ ఇచ్చారన్నారు. కేంద్రం వద్ద కేవలం రూ.2వేల కోట్ల డబ్బు లేదా అని ప్రశ్నించారు. ప్రధాని మోడీ విదేశీ పర్యటనల కోసం ఏడాదికి రూ.270కోట్లు ఖర్చు అవుతుందని.. ఆ డబ్బును ఈ పరిశ్రమ కోసం వెచ్చిస్తే బాగుంటుందని హితవు పలికారు. 


Adilabad Latest News: సీసీఐ పరిశ్రమపై జెన్ జీల పోరాటం- ముందే మేల్కోవాలని ముఖ్యమంత్రికి ప్రొఫెసర్ కాశీం సూచన 

రాష్ట్ర ప్రభుత్వం పండగల పేరిట ఇచ్చే డబ్బులను ఆపివేసి ఇలాంటి పరిశ్రమల కోసం కేటాయించాలని ప్రొఫెసర్ కాశీం సూచించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణాలో మూతపడిన 2వేల పరిశ్రమలను తెరిపిస్తామని హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. ఈ పరిశ్రమపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పరిశ్రమను తెరిపించేందుకు కృషి చేయాలని స్పష్టం చేశారు. ఈ అంశంపై చర్చ జరగాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవ తీసుకొని అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలని డిమాండ్ చేశారు. 


Adilabad Latest News: సీసీఐ పరిశ్రమపై జెన్ జీల పోరాటం- ముందే మేల్కోవాలని ముఖ్యమంత్రికి ప్రొఫెసర్ కాశీం సూచన 

మాజీ మంత్రి జోగు రామన్న మాట్లాడుతూ.. సీసీఐ సాధించే వరకు విశ్రమించని పోరాటం సాగిద్దామని.. ఇందుకు విద్యార్థులు, యువత కదిలిరావాలని పిలుపునిచ్చారు. సీసీఐ సాధన కమిటీ కన్వీనర్ దర్శనాల మల్లేష్ అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో కో కన్వీనర్ విజ్జగిరి నారాయణ, విద్యార్థి సంఘాల రాష్ట్ర కార్యదర్శులు, సాధనకమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Frequently Asked Questions

ఆదిలాబాద్‌లో విద్యార్థి, యువత గర్జన సభను దేనికోసం నిర్వహించారు?

ఆదిలాబాద్ సిమెంట్ పరిశ్రమను తిరిగి తెరవాలని డిమాండ్ చేస్తూ ఈ సభను నిర్వహించారు. పరిశ్రమ ప్రారంభమైతే 6వేల ఉద్యోగాలు వస్తాయని ప్రొఫెసర్ కాశీం తెలిపారు.

ఆదిలాబాద్ సిమెంట్ పరిశ్రమను మూసివేయడానికి ప్రొఫెసర్ కాశీం పేర్కొన్న ప్రధాన కారణం ఏమిటి?

ప్రభుత్వ రంగ సంస్థను ప్రైవేట్‌కు అప్పగించేందుకే పరిశ్రమను మూసివేశారని ప్రొఫెసర్ కాశీం ఆరోపించారు. పరిశ్రమ భూములను ఆక్రమించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన అన్నారు.

ఆదిలాబాద్ సిమెంట్ పరిశ్రమ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రొఫెసర్ కాశీం ఏ సూచనలు చేశారు?

కేంద్రం రూ.2వేల కోట్లు కేటాయించాలని, రాష్ట్ర ప్రభుత్వం పండగలకు ఇచ్చే డబ్బులను ఆపివేసి పరిశ్రమలకు కేటాయించాలని సూచించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ అంశంపై ఢిల్లీకి అఖిల పక్షాన్ని తీసుకెళ్లాలని డిమాండ్ చేశారు.

ప్రొఫెసర్ కాశీం యువత, విద్యార్థులకు ఎలాంటి పిలుపునిచ్చారు?

జెన్ జీ లు పోరాడితే ప్రభుత్వాలు కదులుతాయని ఆయన అన్నారు. ఆదిలాబాద్ సిమెంట్ పరిశ్రమను తిరిగి సాధించే వరకు పోరాడాలని యువత, విద్యార్థులకు పిలుపునిచ్చారు.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Adilabad Bike Theft Gang: ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
Telangana Independence Day 2026: గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
Telangana Police Recruitment 2026: తెలంగాణలో నిరుద్యోగులకు ఊరట! యూనిఫామ్ కొలువుల వయోపరిమితి రెండేళ్లు పెంపు!
తెలంగాణలో నిరుద్యోగులకు ఊరట! యూనిఫామ్ కొలువుల వయోపరిమితి రెండేళ్లు పెంపు!
Breaking News:ఎర్రకోటపై 13వ సారి జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రధానమంత్రి మోదీ
ఎర్రకోటపై 13వ సారి జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రధానమంత్రి మోదీ
Advertisement

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND vs SL 1st Test Day 1 Updates: పడిక్కల్ మైండ్ బ్లోయింగ్ సెంచరీ, రాహుల్ ఫిఫ్టీ.. గాలే టెస్టులో టీమిండియా జోరు!
పడిక్కల్ మైండ్ బ్లోయింగ్ సెంచరీ, రాహుల్ ఫిఫ్టీ.. గాలే టెస్టులో టీమిండియా జోరు!
Pawan Kalyan Speech: డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
Adilabad Bike Theft Gang: ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
Bigg Boss Agnipariksha 2 : కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
Molesting Minor Girl: ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం
ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం
రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Toyota Hyryder కొంటే EMI ఎంత చెల్లించాలి, ఫీచర్ల వివరాలు
రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Toyota Hyryder కొంటే EMI ఎంత చెల్లించాలి, ఫీచర్ల వివరాలు
Free Bus For Women In AP: స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
Telangana Independence Day 2026: గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
Embed widget