High alert at Uppal Stadium: కోల్‌కతా ఎఫెక్ట్.. ఉప్పల్ స్టేడియంలో హై అలెర్ట్.. మెస్సీ, రేవంత్ ఫుట్ బాల్ మ్యాచ్ కు భారీ భద్రత
ఉప్పల్ స్టేడియంలో ఫుట్ బాల్ మ్యాచ్ కు అకస్మాత్ గా భద్రత పెంచేశారు. కోొల్ కత్తాలో మెస్సీ పై ఆగ్రహంతో అభిమానులు రెచ్చిపోవడంతో , ఉప్పల్ లో అటువంటి ఘటనలు జరగకుండా డీజీపీ స్వయంగా రంగంలోకి దిగారు..

Lionel Messi in Hyderabad Tour | ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ ఆడేందుకు లియోనెల్ మెస్సీ రాక నేపధ్యంలో అభిమానుల్లో సందడి నెలకొంది. మరోవైపు తెలంగాణ పోలీసులు ఉప్పల్ లో ఫుట్ బాల్ మ్యాచ్ టెన్షన్ పెడుతున్నట్లు కనిపిస్తోంది. ఈరోజు కోల్ కత్తా సాల్ట్ లేక్ స్టేడియంలో మెస్సీ అభిమానులు రెచ్చిపోయారు. తమతో ఫోటోలు దిగలేదని, మ్యాచ్ ఆడిస్తామని పట్టించుకోలేదని ఓవైపు నిర్వాహకులు, మరోవైపు ఫుట్ బాల్ అభిమానుల్లో ఒక్కసారిగా పూనకాలు లోడ్ అయ్యాయి. స్డేడియంలో ఫ్లెక్సీలు, హోర్టింగ్ లు విరక్కొట్టి బీభత్సం సృష్టించారు. సెలబ్రటీలను మాత్రమే పట్టించుకున్నారు అంటూ మెస్సీ ఫ్యాన్స్ రెచ్చిపోవడంతో ఉద్రిక్తత పరిస్ధితి నెలకొంది. కోల్ కత్తా పోలీసులు సైతం మెస్సీ అభిమానుల ఆగ్రహాన్నికట్టడిచేయలేక చేతులెత్తేయాల్సిన పరిస్దితి ఏర్పడింది. ఇదే సీన్ తిరిగి ఉప్పల్ లో రిపీట్ అవ్వకూడదని భావించిన తెలంగాణ పోలీసులు ఉప్పల్ స్డేడియం వద్దకు అదనంగా పోలీసులు బలగాలను తరలిస్తున్నారు.
తెలంగాణ డీజీపీ ఆదేశాలు..
ఉప్పల్ మ్యాచ్ భద్రతపై నేరుగా డీజీపీ శివధర్ రెడ్డి రంగంలోకి పరిశీలిస్తున్నారు. కోల్ కత్తా ఘటన జరిగిన వెంటనే ఉప్పల్ స్టేడియం వద్దకు వెళ్లిన భద్రతను స్వయంగా పరిశీలించారు డీజీపీ. వెంటనే అదనంగా పోలీసులను రప్పించాాలని ఆదేశించడంతోపాటు, కోల్ కత్తాలలో జరిగిన దాడులను , గొడవను స్క్రీనింగ్ చేసి చూపించారు. సీఆర్పీఎఫ్ బలగాలను పెంచడంతోపాటు అభిమానులు ఎవరూ స్టేడియంలోపలకి రాకుండా కట్టుదిట్టమైన రక్షణా వలయం ఏర్పాటు చేశారు.
టికెట్లు ఉన్న వారికి మాత్రమే ఎంట్రీ
ఫుట్ బాల్ మ్యాచ్ టిక్కెట్ ఉన్నవాళ్లు మాత్రమే స్టేడియంలోపలికి వెళ్లేలా పూర్తి స్దాయిలో తనిఖీ చేయాలని ఆదేశించారు డీజీపీ. ఉప్పల్ లో రాత్రి 7.50నిమిషాలకు ప్రారంభమైయ్యే ఫుట్ బాల్ మ్యాచ్ లో అంతర్జాతీయ ఫుట్ బాల్ ప్లేయర్ మెస్సీ , మిడ్‌ఫీల్డర్ రోడ్రిగో డి పాల్ ఉరుగ్వేకు చెందిన లూయిస్ సువారెజ్, లోక్‌సభ ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డితో ఫుట్ బాల్ ఆడనున్నారు. అయితే 20నిమిషాల పాటు జరిగే ఈ మ్యాచ్ లో చివరి 5నిమిషాలు మాత్రమే మెస్సీ, సీఎం రేవంత్ రెడ్డి మధ్య ఫుట్ బాల్ ఆట జరగనుంది. వీరిద్దరి మ్యాచ్ చూసేందుకు రాహుల్ గాంధీ ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్నారు.
ఉప్పల్ స్టేడియం వద్ద భద్రత కట్టుదిట్టం..
అభిమానుల అత్యుత్సాహం సృతిమించే అవకాాశాలుండటంతో అప్రమత్తమైన పోలీసులు మెస్సీ చుట్టూ ఇరవై వాహానాలతో భద్రత కల్పిస్తూ , ఫలక్ నామా ప్యాలెస్ నుండి ఉప్పల్ స్టేడియంకు కట్టుదిట్టమైన భద్రతమధ్య తీసుకురానున్నారు. మెస్సీతో పాటు రాహల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డిలు ఒకేసారి ఉప్పల్ స్టేడియంకు చేరుకోనున్నారు. ఉప్పల్ స్డేడియం చుట్టూత 3వేల మందికి పైగా పోలీసులతోాపాటు, సీఆర్ పీఎఫ్ బలగాలు మోహరించాయి. స్డేడియంలోపల, చుట్టుప్రక్కల పరిసరాలను తమ ఆధీనంలోకి తీసుకున్నాయి.
తన చుట్టూ 32 మంది సీఆర్ పీఎఫ్ భద్రతా వలయం మధ్య మెస్సీ ఉప్పల్ స్టేడియం లోపలకి రానున్నారు. అభిమానులు భారీ కేడ్లు సైతం విరక్కొట్టే అవకాశాలు ఉండటంతో ఎప్పటికప్పుడు పరిస్దితిని అంచనా వేస్తూ, సీసీ కెమెరాలు నిఘా ఏర్పాటు చేశారు. ఇప్పటికే కోల్ కత్తాలో ఎదురైన అనుభవం నేపధ్యంలో అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు తెలంగాణ పోలీసులు. మరో వైపు రాహుల్ గాంధీ , సీఎం రేవంత్ రెడ్డితోపాటు రాజకీయ ప్రముఖులు సైతం మ్యాచ్ చూసేందుకు రావడంతో మరింత అప్రమత్తమైయ్యారు.





















