అన్వేషించండి
YS Jagan And Sailajanath: త్వరలోనే వైసీపీలోకి కాంగ్రెస్ నేతలు - బాంబు పేల్చిన శైలజానాథ్
YS Jagan : మాజీ సీఎం జగన్ సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరిన సాకే శైలజానాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే కాంగ్రెస్ నేతలంతా వైసీపీలో చేరతారని ప్రకటించారు.

త్వరలోనే వైసీపీలోకి కాంగ్రెస్ నేతలు - బాంబు పేల్చిన శైలజానాథ్
1/13

వైఎస్‌ఆర్‌సీపీ నుంచి నేతలు వెళ్లిపోతున్న టైంలో కాంగ్రెస్ లీడర్, మాజీ మంత్రి సాకే శైలజానాథ్ కీలక నిర్ణయం తీసుకున్నారు.
2/13

ఎప్పటి నుంచో సాగుతున్న చర్చలకు ఫుల్‌స్టాప్ పెట్టేసి శైలజానాథ్ వైఎస్‌ఆర్‌సీపీలో చేరిపోయారు.
3/13

వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు జగన్ సమక్షంలో శైలజానాథ్ వైసీపీ కండువా కప్పుకున్నారు.
4/13

మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శైలజానాథ్‌కు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
5/13

శైలజానాథ్‌తో పాటు ఏఐసీసీ మెంబర్, అనంతపురం డీసీసీ మాజీ అధ్యక్షుడు ప్రతాప్ రెడ్డి కూడా వైఎస్సార్‌సీపీలో చేరారు.
6/13

వైసీపీలో చేరిన తర్వాత మీడియాతో మాట్లాడిన శైలజానాథ్ జగన్ ధానాలు నచ్చటంతోనే పార్టీలో చేరినట్టు చెప్పారు.
7/13

ప్రజల తరుపున వైసీపీ, జగన్ పోరాడుతున్నారని అందుకే తాను అందులో చేరినట్టు పేర్కొన్నారు శైలజానాథ్..
8/13

కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ప్రజా వ్యతిరేక విధానాలు అవలంభిస్తోందని శైలజానాథ్ విమర్శించారు.
9/13

ఎన్నికల్లో ఇచ్చిన ఏ హామీని కూడా నిలబెట్టుకోలేకపోగా వారికి అన్యాయం చేస్తోందని శైలజానాథ్ మండిపడ్డారు.
10/13

జగన్ ఎలాంటి బాధ్యతలు అప్పగించినా స్వీకరించి రాయలసీమ ప్రజల కష్టాలు తీర్చేందుకు కృషి చేస్తానని అన్నారు శైలజానాథ్.
11/13

కాంగ్రెస్ పార్టీ నుంచి చాలా మంది నేతలు వైసీపీలో చేరేందుకు ఆసక్తితో ఉన్నారని శైజలానాథ్ చెప్పారు.
12/13

అనంతపురం జిల్లాకు చెందిన శైలజానాథ్ కాంగ్రెస్ తరఫున శింగనమల నియోజకవర్గం నుంచి 2004, 2009లో విజయం సాధించారు.
13/13

శైలజానాథ్ ఏపీసీసీ అధ్యక్షుడిగా కూడా పని చేశారు.
Published at : 07 Feb 2025 03:00 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఇండియా
ఐపీఎల్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion