IND vs SA 1st ODI India Playing XI: దక్షిణాఫ్రికాతో తొలి వన్డే.. జట్టులోకి రోహిత్, కోహ్లీ.. ప్లేయింగ్ లెవన్ ఇదే!
India vs South Africa 1st ODI | భారత్- దక్షిణాఫ్రికా ODI సిరీస్ తొలి మ్యాచ్ రాంచీలో ఆదివారం మధ్యాహ్నం ప్రారంభం కానుంది. స్పిన్నర్లకు అనుకూలించే పిచ్ లో జడేజా, కుల్దీప్ కీలకం కానున్నారు.

IND vs SA 1st ODI India Playing XI: దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్ట్ సిరీస్‌లో 2-0 తేడాతో టీమిండియా దారుణ వైఫల్యాన్ని చవిచూసింది. ప్రస్తుతం వన్డే సిరీస్ కోసం టీమిండియా సన్నద్ధమైంది. వన్డే సిరీస్‌లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లాంటి దిగ్గజాలు జట్టులోకి వచ్చారు. దాంతో మూడు మ్యాచ్‌ల వన్డే ఇంటర్నేషనల్ (ODI) సిరీస్ లో నెగ్గి ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తోంది. నేడు రాంచీ వేదికగా దక్షిణాఫ్రికా, టీమిండియా జట్లు తలపడనున్నాయి.
ఇటీవల ప్రొటీస్‌తో జరిగిన మొదటి టెస్ట్‌లో గాయపడిన కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఈ సిరీస్‌కు దూరం కాగా, వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ కెఎల్ రాహుల్ తాత్కాలికంగా బాధ్యతలు చేపట్టాడు. కేఎల్ రాహుల్‌తో పాటు కోహ్లీ, రోహిత్ శర్మ జట్టులో ఉంటారు. టీమిండియా ప్లేయింగ్ 11పై ఆసక్తి నెలకొంది.
నేటి మధ్యాహ్నం 1 గంటలకు టాస్ తర్వాత మాత్రమే ఇరు జట్లు ప్లేయింగ్ లెవన్‌ను ప్రకటిస్తాయి. అయితే భారత్ vs దక్షిణాఫ్రికా తొలి ODI కోసం టీమిండియా ప్లేయింగ్ XI అంచనా ఇలా ఉంది.
దక్షిణాఫ్రికాతో భారత్ ప్లేయింగ్ XI అంచనా
శుభ్‌మన్ గిల్ దూరం కావడంతో ఓపెనర్ యశస్వి జైస్వాల్ లేదా రుతురాజ్ గైక్వాడ్ ఇద్దరిలో ఒకరు హిట్ మ్యాన్ రోహిత్ శర్మతో కలిసి భారత ఇన్నింగ్స్ ప్రారంభించవచ్చు. అయితే, ఎడమ-కుడి కాంబినేషన్ కోసం జైస్వాల్‌కు అవకాశం లభించవచ్చు. విరాట్ కోహ్లీ, మూడో స్థానంలో బ్యాటింగ్ చేస్తాడు. కెఎల్ రాహుల్ నిర్వహించిన మీడియాతో మాట్లాడుతూ రిషబ్ పంత్ కూడా జట్టులో ఉంటాడని హింట్ ఇచ్చాడు.
బౌలింగ్ విభాగం విషయానికొస్తే, రాంచీలోని పిచ్ స్పిన్నర్లకు అనుకూలం. దాంతో భారత్ ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగవచ్చు. టాస్ నెగ్గిన టీం కచ్చితంగా బౌలింగ్ తీసుకుంటుంది. ఎందుకంటే చేజింగ్ కొంచెం తేలిక అవుతుంది. ఈ విషయాలను దృష్టిలో ఉంచుకుని, రాంచీలో జరిగే మొదటి IND vs SA ODI కోసం అంచనా వేసిన ప్లేయింగ్ XI ఇలా ఉండనుంది.
భారత్ ప్లేయింగ్ 11 అంచనా..
రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, కెఎల్ రాహుల్, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, ప్రసిద్ధ్ కృష్ణ, అర్ష్‌దీప్ సింగ్
రాంచీ వేదికపై భారతదేశం చివరి 50 ఓవర్ల మ్యాచ్ కూడా దక్షిణాఫ్రికాతోనే ఆడింది. ఆ మ్యాచ్‌లో వారు 7 వికెట్ల తేడాతో సులభంగా గెలిచారు. రాంచీలో మరోసారి హిస్టరీని రిపీట్ చేయాలని టీమిండియా క్రికెటర్లు భావిస్తున్నారు. టెస్ట్ సిరీస్ దారుణ పరాభవానికి నేటి విజయంతోనే శ్రీకారం చుట్టాలని భారత్ వ్యూహాలు రచిస్తోంది.





















