Ab De Villiers comment on Coach Gambhir | గంభీర్ పై డివిలియర్స్ కామెంట్స్
సౌత్ ఆఫ్రికాతో టెస్ట్ సిరీస్ ఓడిపోయిన తర్వాత టీమ్ ఇండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. కేవలం ఫ్యాన్స్ మాత్రమే కాదు.. మాజీ ప్లేయర్స్, విశ్లేషకులు, విదేశీ ఆటగాళ్లు కూడా గంభీర్ తీరుపై తీవ్రంగా మండిపడుతున్నారు. అయితే ఇప్పుడు సౌత్ ఆఫ్రికా మాజీ ప్లేయర్ ఏబీ డివిలియర్స్ కూడా గంభీర్ తీరుపై కామెంట్స్ చేసారు.
గంభీర్ ఒక ఎమోషనల్ ప్లేయర్ అని, అతని ఎమోషన్స్ కోచింగ్‌లో కనిపిస్తే టీమ్ కు మంచిది కాకపోవచ్చని అన్నారు. "నేను గంభీర్‌ను ఒక ప్లేయర్ గా చాలా ఎమోషనల్ గా ఆడే వ్యక్తిగా చూశాను. అలాంటి వ్యక్తి కోచ్ అయితే, అది టీమ్ కు కొన్నిసార్లు నష్టమే. అతను ఎలా లీడ్ చేస్తాడో నాకు పూర్తి అవగాహన లేదు. ప్రతి కోచ్ స్టయిల్ వేరు. కొందరు ప్లేయర్లు మాజీ ఆటగాడిని కోచ్‌గా ఇష్టపడతారు, మరికొందరు పూర్తిగా కోచింగ్‌నే కెరీర్‌గా తీసుకున్న వారిని ఇష్టపడతారు" అని డి విలియర్స్ అన్నాడు.
ఈ మాటలు కాస్త ఒక్కసారిగా వైరల్ అయ్యాయి. ఫ్యాన్స్ కూడా ఏబీ డివిలియర్స్ కు సపోర్ట్ చేయడం మొదలు పెట్టారు. సొంతగడ్డపై జరిగిన చివరి మూడు టెస్టు సిరీస్‌లలో భారత్ రెండు ఓడిపోయింది. అయితే టెస్ట్ సిరీస్ తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్ లో గంభీర్ మాట్లాడిన మాటలు కూడా కాంట్రోవర్సీకి దారి తీశాయి.





















