Ro - Ko at India vs South Africa ODI | రాంచీలో రో - కో జోడి
టెస్ట్ సిరీస్ లో వైట్ వాష్ కు గురైన తర్వాత టీమ్ ఇండియా సౌత్ ఆఫ్రికాతో వన్డే సిరీస్ ఆడనుంది. టెస్ట్ లో పోగొట్టుకున్న పరువును వన్ డే సిరీస్ తో దక్కించుకోవాలని కసిగా ఉంది టీమ్ ఇండియా. అయితే ఈ వన్ డే సిరీస్ లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ కూడా ఆడబోతున్నారు. దాంతో ఫ్యాన్స్ అంతా వీరిపైనే ఆశలు పెట్టుకున్నారు. ఈ క్రమంలో వన్ డే సిరీస్ లో రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ జోడి కొత్త రికార్డులను బ్రేక్ చేయడానికి రెడీ అవుతున్నారు.
భారత లెజెండరీ ప్లేయర్స్ సచిన్ తెందుల్కర్, రాహుల్ ద్రవిడ్... వీళ్లిద్దరు కలిసి ఇంటర్నేషనల్ క్రికెట్ లో జోడీగా భారత్ తరఫున 391 మ్యాచ్‌లు ఆడారు. వీళ్ల తర్వాత ఆ పొజిషన్ ను రోహిత్ విరాట్ కోహ్లీ భర్తీ చేసారు.
రోహిత్ , కోహ్లీ జోడీగా 391 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు ఆడారు. రాంచీలో జరిగే వన్డేలో ఈ ఇద్దరూ కలిసి క్రీజులో ఉంటే ఆ నెంబర్ కాస్త 392 కి చేరుతుంది. దాంతో సచిన్- ద్రవిడ్ రికార్డ్ బ్రేక్ అవుతుంది. కాబట్టి సఫారీలతో జరుగుతున్న ఈ వన్ డే మ్యాచ్ లో ఎలాగైనా రోహిత్ కోహ్లీ... సచిన్- ద్రవిడ్ రికార్డ్ ను బ్రేక్ చేయాలనీ వారి ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే వీళ్లిద్దరు రాంచీ చేరుకొని నెట్స్లో ప్రాక్టీస్ కూడా మొదలు పెట్టేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.





















